S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవ ప్రదర్శనశాలలు

కొన్ని రకాల జంతువులని మనం ఊళ్లో చూస్తాం. మరి కొన్నిటిని చూడాలంటే అడవికి వెళ్లాలి. నాగరికత పెరిగాక మనిషి జంతువులని చూడటానికి అడవికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఓ పద్ధతిని ఏర్పాటు చేశారు. అదే జంతు ప్రదర్శనశాల. లేదా జూ.
నేడు జూలలో జంతువులని, పక్షులని, జలచరాలని మాత్రమే చూస్తున్నాం. కాని అరవై ఏళ్ల క్రితం దాకా మానవ ప్రదర్శనశాలలు, అంటే హ్యూమన్ జూలు ఉండేవి! వీటిని ఎత్నొలాజికల్ ఎక్స్‌పొజిషన్ లేదా హ్యూమన్ జూ అని పిలిచేవారు. ఖండాల మధ్య సముద్రయానాలు అభివృద్ధి చెందాక ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నించి మనుషులని జూలలో ఉంచడం యూరప్‌లో మొదలైంది. యూరప్‌లో అంతా తెల్లగా ఉంటారు. నల్లటి మనుషులు ఉంటారని వారి ఊహకి అందదు. అందుకని 15వ శతాబ్దం నించి ఆఫ్రికా నించి బానిసల రవాణా మొదలవగానే వారిని యూరప్‌లోని జూలలో ఉంచడం ఆరంభమైంది.
ఐతే మొదటి హ్యూమన్ జూ మెక్సికోలోని మొక్టేజ్‌మా అనే చోట ఆరంభమైంది. ఇక్కడ జంతువులతో పాటు మనుషులని కూడా ప్రదర్శనలో ఉంచేవారు. మరుగుజ్జులు, గూనివాళ్లు, పాండు రోగంతో చర్మం తెల్లబడ్డవారు, ఇతర శారీరక అవకరాలు ఉన్నవాళ్లని ఇక్కడ ప్రదర్శనలో ఉంచేవారు. ఐతే వీరంతా మెక్సికనే్ల.
1664లో ఓ డచ్ నావికుడు డేనిష్ రాజసభకి నలుగురు గ్రీన్‌లేండర్స్‌ని తీసుకువచ్చాడు. ఆ నలుగుర్ని ప్రజలు చూడటానికి ఎక్కడ ఉంచాలా అని ఆలోచించారు. అనేక మంది సూచించిన ప్రదేశాల్లో జూ సరైన ప్రదేశంగా భావించి వారిని అక్కడి బోనుల్లో ఉంచారు. అలా మానవ జూలకి నాంది పడింది. ఇలాగే జోసెఫ్ బేంక్స్ అనే నావికుడు లండన్‌లోని కింగ్ జార్జ్ ది థర్డ్ సభకి తహితి దేశం నించి ఒమాయ్ అనే మనిషిని తీసుకువచ్చాడు. అతన్ని కూడా లండన్ జూలో ఉంచారు. అతని చిత్రం నేడు లండన్ జూలో చూడచ్చు.
ఆ తర్వాత ప్రపంచంలో తొలిసారి వివిధ ప్రాంతాల నించి తెచ్చిన మనుషులని ఉంచిన ప్రదర్శనశాలని యూరప్‌లోని వేటికన్ సిటీలో కార్డినల్ హిప్పోలిటస్ మెడిసి ఆరంభించాడు. ఇతను ఈ జూలో అనేక జాతులు, తెగలు, రంగులు, ప్రాంతాలకి చెందిన మనుషులని ఈ జూలో ప్రదర్శనకి ఉంచాడు. ఎస్కిమోలు, మూర్స్ (సిసిలీకి చెందిన అరబ్ ముస్లిమ్స్) టార్టార్స్ (మంగోలియన్ వలసజాతులు) ఇండియన్స్, టర్క్స్, ఆఫ్రికన్స్, చైనీస్ లాంటి ఇతర ఖండాలకి చెందిన మనుషులని, ఇంకా యూరప్‌లో చూడలేని సింహం, పులి, ఏనుగు, నెమలి లాంటి జంతువులని కూడా ఆ జూలో మెడిసి ఉంచాడు. తెల్లజాతి వారు మిగిలిన రంగు చర్మాలకి చెందిన జాతుల వారికన్నా అధికులు అనే భావనతో ఈ జూలని ఏర్పాటు చేశారు. జూలలో ఉంచే మనుషుల మనోభావాలని వారు పట్టించుకునేవారు కారు. అమెరికా మొదటి వాసులైన రెడ్ ఇండియన్స్‌ని కూడా యూరప్‌లోని మానవ జూలకి ఎగుమతి చేసేవారు. యూరోపియన్స్ ఇతర ఖండాల్లోని కొన్ని దేశాలని జయించడం ద్వారా అక్కడి మనుషులని సులువుగా ఎగుమతి చేయగలిగేవారు.
1889లో న్యూయార్క్‌లో జరిగిన వరల్డ్ ఫెయిర్‌లో 400 మంది మనుషుల జూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫ్రాన్స్‌లో ఇలాంటి జూలు అధికంగా ఉండేవి. వీటిలో అధికంగా ఆఫ్రికా నించి రప్పించబడ్డ నల్లవాళ్లే ఉండేవారు. నేడు పారిస్‌లో హ్యూమన్ జూల చరిత్రకి చెందిన క్వాయ్ బ్రాన్లీ అనే ఓ మ్యూజియం ఉంది. అందులో వివిధ కాలాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉన్న హ్యూమన్ జూలకి సంబంధించిన చరిత్రని, ఫొటోలని, చిత్రాలని, పోస్టర్లని చూడచ్చు. లండన్, బెర్లిన్, హేంబర్గ్, ఏంట్‌వెర్స్, బార్సిలోనా, మిలన్‌ల లాంటి యూరోపియన్ నగరాలతోపాటు న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజెలెస్ లాంటి అమెరికన్ నగరాలకి కూడా వ్యాపారస్థులు ఇతర ఖండాల నించి జూలలో ఉంచడానికి మనుషులని దిగుమతి చేసేవారు.
ప్రతీ అంతర్జాతీయ ట్రేడ్ ఫేర్‌లో హ్యూమన్ జూలు వినోదంలో భాగంగా ఉండేవి. పారిస్‌లో అలాంటి ట్రేడ్‌ని నిర్వహించిన గ్రౌండ్‌లో సెనెగల్ దేశానికి చెందిన ఓ గ్రామాన్ని రూపొందించారు. ఆ దేశం నించి మనుషులని రప్పించి అందులో వారి యుద్ధ నృత్యాన్ని, మతపరమైన క్రతువులని సందర్శకుల కోసం ప్రదర్శించారు.
సౌతాఫ్రికాలో 1780లో జన్మించిన సార్ట్‌జీ అనే మహిళని లండన్ జూకి తీసుకువచ్చారు. తర్వాత 30 ఏళ్లపాటు, 1810 దాకా ఆమె ఆ జూలో జీవించింది. ఆమె చాలా అందగత్తె. ఆమెకి హాటెంటాట్ వీనస్ అనే ముద్దు పేరు వచ్చింది. కొంతకాలం ఆమె అప్పుగా పారిస్ జూకి కూడా పంపబడింది. మరణించాక ఆమె అస్థిపంజరాన్ని కూడా అక్కడి జూ ఆఫ్ మేన్‌కైండ్‌లో 1974 నించి 2002 దాకా ప్రదర్శనలో ఉంచారు. 2003లో సౌత్ ఆఫ్రికాకి తిరిగి తీసుకెళ్లి అక్కడ పాతిపెట్టారు.
న్యూయార్క్ సిటీలోని బ్రాంక్స్ జూలో 1906లో కాంగో దేశానికి చెందిన ఓటా బెంగా అనే పిగ్మీ (మరుగుజ్జు) ఉండేవాడు. సందర్శకులకి వినోదాన్ని ఇవ్వడానికి సందర్శకులు వచ్చే వేళల్లో అతను ఓ చింపాంజీని ఎత్తుకోవాలని నిర్బంధించేవారు. మానవ ప్రదర్శన శాలలని మొదటగా నిషేధించింది హిట్లర్. ఆఖరి జూ 1958లో బెల్జియంలో మూసేశారు. రెండు వందల ఏభై ఏళ్లలో సుమారు 35 వేల మందిని జూలలో నిర్బంధించారు. వారిని 140 కోట్ల మంది సందర్శించారని అంచనా. దీన్నిబట్టి ఈ జూలకి గల డిమాండ్‌ని అర్థం చేసుకోవచ్చు.

పద్మజ