S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మార్పు ( కథ)

సింగడు ఆటవిక తెగకు చెందిన యువకుడు. అడవిలోని గూడెంలో నివసిస్తున్నాడు. వన్యమృగాలను వేటాడి చంపి తినేవాడు. వన్య మృగాలను వేటాడకూడదని అటవిక శాఖ వాళ్లు ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకునేవాడు ఆదు. ఒకరోజు గూడెం పెద్ద సింగడిని పిలిచాడు.
‘సింగా! వన్య ప్రాణుల్ని వేటడటం నేరమని ఆటవిక అధికారులు నా వద్దకు వచ్చి చెప్పారు. నువ్వు వాటిని వేటాడి చంపడం మానకపోతే కారాగారంలో పెడతారంట. నువ్వు వన్యప్రాణుల్ని వేటాడటం మానెయ్యి’ అని చెప్పాడు గూడెం పెద్ద.
‘వేటాడకపోతే నాకు గడవదు పెద్దయ్యా! నేను బతికేది ఎట్టా?’ ప్రశ్నించాడు సింగడు.
‘అడవిలో దొరికే వనమూలికలు, కట్టెలు, కుంకుళ్లు, పుట్టతేనె ఇలాంటివి సేకరించి గిరిజన సొసైటీలకు అమ్మి జీవించవచ్చు కదా?’ సూచించాడు గూడెం పెద్ద.
సింగడు మారు మాట్లాడకుండా వేట కోసం అడవిలోకి వెళ్లిపోయాడు. అడవిలో ఒక పొదల మాటున ఒక లేడి కనిపించింది. అది కదలలేక పోతోంది. సింగడు బాణం ఎక్కుపెట్టాడు. అది చూసి కూడా కదలలేక పోతోంది. ఏదో బాధతో మూలుగుతూ కనిపించింది. సింగడు దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ లేడి బిడ్డకు జన్మనివ్వబోతూ ప్రసవ వేదనతో బాధపడుతోంది. ఈ దృశ్యాన్ని చూసి సింగడి మనస్సు ద్రవించింది. ఆ లేడిని ఎత్తుకుని ఆపసోపాలు పడుతూ సమీపాన ఉన్న గూడేనికి చేరాడు. గూడెంలోని మహిళలంతా సపర్యలు చేయగా చక్కటి లేడిపిల్ల జన్మించింది. తల్లి లేడి సింగడి వద్దకు వచ్చి అతని చేతిని ముద్దాడింది. ఆ లేడి కళ్లల్లో నీళ్లు తిరగటం సింగడి కంట పడింది. అతడి మనస్సు కరిగిపోయింది. సింగడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ రోజు నుండి వన్యప్రాణుల్ని వేటాడటం మానేశాడు. అడవిలో లభించే ఆటవిక ఉత్పత్తుల్ని సేకరించి గిరిజన సొసైటీల వారికి అమ్మి వచ్చిన సొమ్ముతో జీవనం సాగించాడు. సింగడి ప్రవర్తనలో వచ్చిన మార్పునకు గూడెం పెద్దతోపాటు అందరూ సంతోషించారు. సింగడి ప్రవర్తనలో మార్పును గమనించిన గూడెం పెద్ద తన మనుమరాలిని అతడికిచ్చి వివాహం చేశాడు. తన మంచి ప్రవర్తనతో సింగడు గూడేనికి మంచి పేరు తెచ్చాడు.

-షేక్ అబ్దుల్ హకీం జానీ 9949429827