S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నకిలీ (కథ)

మణిపురి పట్టణాన్ని మహారాజు నారాయణవర్మ పాలిస్తున్నాడు. అతనికి దైవభక్తి ఎక్కువ. అందుచేత తన ర్యాంలో చుట్టుపక్కల ఎక్కడా లేని శివాలయాన్ని నిర్మించాలని తలంచి విదేశీ కళాకారులను రప్పించి ఆలయాన్ని సుందరంగా చూడముచ్చటగా నిర్మింపజేశాడు. కానీ అందులో స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కాకుండానే దివంగతుడయ్యాడు. అతని తదుపరి ఆయన కుమారుడు యువరాజు రామేశ్వర వర్మ పరిపాలనా బాధ్యత చేపట్టి రాజ్యపాలన కావిస్తున్నాడు. కానీ అతని బాధ ఒక్కటే. తన తండ్రి చేపట్టిన శివాలయ నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని. అందుచేత స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేయించాలని, విగ్రహాన్ని తయారుచేయుటకు నైపుణ్యం గల కళాకారులను రప్పించాడు. విగ్రహాన్ని మేలిమి బంగారంతో చేసేవారు కావాలి. ఎవరైతే చేయగలరో రండి ప్రకటించాడు.
శిల్పులు వచ్చారు. ఒక శిల్పిని పిలిచి ‘నీవు చేయగలవా?’ అని అడుగగా, ‘లేదు యువరాజా! నేను మూడొంతులు మేలిమి బంగారము, ఒక వంతు నకిలీ కలిపి చేయగలను. నన్ను క్షమించండి’ అని తప్పుకున్నాడు. చివరగా మూడవ వాడు ‘యువరాజా! నేను పూర్తిగా నకిలీతో మాత్రమే చేస్తాననటం’తో యువరాజుకు ఆశ్చర్యం కలిగి, ‘నీవే ఈ విగ్రహాన్ని తయారుచేయాలి. పూర్తిగా విగ్రహాన్ని ఎలా నకిలీ చేయగలవో చూస్తాన’ని ఆజ్ఞాపించాడు. అందులో భాగంగా యువరాజు రామేశ్వర శర్మ తన రాజ్య ప్రాసాదంలోనే విగ్రహాన్ని తయారు చేయాలని చెప్పి మేలిమి బంగారం ఇప్పించాడు. అనుక్షణం శిల్పిపై నిఘా ఉంచమని సైనికులను నియమించాడు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. విగ్రహ తయారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు శిల్పి.
కొన్నాళ్లకు విగ్రహ తయారీ ముగిసింది. అప్పుడు రామేశ్వర శర్మ విగ్రహాన్ని చూసి ‘ఈ విగ్రహంలో నకిలీ ఏముంది? విగ్రహం పూర్తిగా మేలిమి బంగారమే కదా వాడావు. పూర్తిగా నకిలీ చేయగలను అని చెప్పావ్. అలా చేయలేక పోయావు. నీ తప్పు ఒప్పుకుంటావా?’ అని అనగా, ‘క్షమించండి యువరాజా! అది పూర్తిగా నకిలీ అని మీకు తరువాత తెలుస్తుంది’ అన్నాడు. ‘ఏ విధంగా?’ అని యువరాజు అడిగాడు.
‘విగ్రహాన్ని గంగా స్నానానికి సిద్ధం చేయమనండి’ అన్నాడు శిల్పి.
విగ్రహాన్ని గంగా స్నానం కొరకు నదికి ఊరేగిస్తూ తీసుకెళ్లి ఆ విగ్రహాన్ని యువరాజు తన తలపై పెట్టుకుని ‘ఓం నమః శివాయ’ అని మూడుసార్లు మునిగి విగ్రహానికి స్నానం చేయించాడు. ఆ తరువాత విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట గావించాడు. కొన్ని రోజులకు విగ్రహం తన మేలిమి కాంతిని పోగొట్టుకుంది. అది గమనించిన యువరాజు ఈ‘ విగ్రహం కాంతి విహీనమవటానికి కారణమేమిటో కనుక్కోమ’ని నిపుణులను అడగగా, దాన్ని వారు పరిశోధించి ‘యువరాజా! విగ్రహం పూర్తిగా నకిలీది. అందుకే కాంతి విహీనమైంది’ అని చెప్పారు.
అందుకు యువరాజు తయారుచేసిన శిల్పిని పిలిచి, ‘ఎంత బందోబస్తు మధ్యన చేయించిన ఈ విగ్రహాన్ని నీవు ఎలా నకిలీ చేయగలిగావు?’ అని ప్రశ్నించగా, అందుకు సమాధానంగా ‘అది నా వృత్తి ధర్మం యువరాజా! ముందుగా పూర్తి నకిలీ బంగారంతో చేస్తాను అని చెప్పాను. అదే విధంగా చేశాను. ఎలానంటారా? నేను ఈ విగ్రహంతో గంగాస్నానం చేసే సమయంలో విగ్రహాన్ని మార్చాను. ఇదే నకిలీ విగ్రహం. అసలు విగ్రహం మా ఇంట్లో వుంది’.
ఆ మాటలు విన్న యువరాజుకి శిల్పి తెలివితేటల్ని చూసి నోట మాట రాలేదు.

-వులాపు బాలకేశవులు 9704527928