S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేను.. తమస్సోదయ తపస్సును

నేను
ఏకత్వాన్ని
భిన్నత్వాన్ని
సంపూర్ణత్వాన్ని
ఏకత్వమొక్కటే సత్యం కాదు
భిన్నత్వాలు మాయలూ కాదు
ఏకత్వం నుండి భిన్నత్వం
భిన్నత్వమూ సత్య సంపదే
సంపూర్ణ సంధతే

నేను
సంపూర్ణతను
కలిపినా తీసివేసినా
కదలని సం‘పూర్ణ’తను
ఏకతల సంపూర్ణతను
భిన్నతల సంపూర్ణతను
అనేకతల సంపూర్ణతను

నేను
ప్రయోగ సంపూర్ణతను
తొలి సంపూర్ణతను
తుది సంపూర్ణతను
ఆద్యంత సంపూర్ణతను
విభజిత సంపూర్ణతను
విరచిత సంపూర్ణతను
అరచిత సంపూర్ణతను
గిక సంపూర్ణతన

నేను
ఉషోదయ తమస్సును
తమస్సోదయ తపస్సును
సార్వకాలిక శూన్యతను
ప్రకృతితత్వ మార్మికతను
అంతర్దృష్టి భూమికను
ఆదేశ ఆత్మ ఆవరణను.

నేను
అఖండ విశ్వాన్ని ఖండ సృష్టిని

నేను
కల్లోల భారతాన్ని
స్వతంత్ర భారతాన్ని
ప్రబుద్ధ భారతాన్ని
కడకు, అరవింద యోగాన్ని

నేను
కాను, యంత్రశక్తిని
అవును, ఆత్మశక్తిని
భరతజాతి పునరుజ్జీవనాన్ని
మానవజాతి పునర్నిర్మాణాన్ని

నేను
కాను, జీవిత చరిత్రను
కాను, ఆత్మకథను
అవును, గిక భారతాన్ని.

చదవటం నాకొక సాధన
రాయటం నాకొక సాధన
యోగం నాకొక సాధన
నేను
ఈ త్రిపురల అధిమానసాన్ని

నేను
ఒక కల్లోలాన్ని
ఒక మథనాన్ని
ఒక శాంతివనాన్ని
అరవింద ఆశ్రమాన్ని

నేను
అలిఖిత జీవనరేఖల అరుణోదయాన్ని
స్వాతంత్య్ర ఉద్యమతంత్ర రుధిరపత్రాన్ని
అంతరంగ ప్రాణస్పందనల పరిమళాన్ని
ప్రాక్పశ్చిమ నాస్తిక విప్లవ సంస్కార స్వరాన్ని
అంతరంగ బాహిర తమస్సుల రాపిడిని
ప్రాచీనతన గళమెత్తిన ప్రణవ తపస్సును.

నేను
మార్మికక్షేత్ర రహస్య ప్రయాణాన్ని
అరవిందాశ్రమ గిక ప్రవాణాన్ని
మాతృమందిర మది ఆవిష్కరణను
సూక్ష్మభూమికల శక్తి ఆవరణను
సుప్త భూవనరుల వికాస కేంద్రాన్ని

నేను
కనులు కన్న గమనికను
నిగ్రహ మానస ప్రజ్ఞను
ఆవహించిన శూన్యతను
సాధించిన అధిమానసాన్ని
అవ్యక్త సంకేత విశ్వమేధను

నేను
మీరా ఆత్మ శరీరాన్ని
మదర్ అంతర్ముఖ నేత్రాన్ని
మనిషికే తెలియని మనిషితనాన్ని
భౌతికాలను దాటిన ఆత్మ భూమికను.

నేను
సావిత్రిని
సంకేతపద సావిత్రిని
మార్మిక కావ్య సావిత్రిని
గికాక్షర నవసృష్టిని
వృత్యుపథ అమరకోశాన్ని

నేను
ప్రకృతి పురుష గిక వివేకాన్ని
‘యమ’్ధర్మజుని మృత్యుబంధాన్ని
‘సత్య’పథాన మృత్యు పరిణామాన్ని
‘సావిత్రి’ పదాల మృత్యు విజయాన్ని
‘అరవిందా’క్షరాల మృత్యు రహస్యాన్ని.

నేను
తాకిన మృత్యువును
ఆరోహించిన మృత్యుదశలను
ఛేదించిన మృత్యురహస్యాన్ని
సాధించిన మృత్యుతత్వాన్ని
అధివసించిన మృత్యుధర్మాన్ని.

-విశ్వర్షి 93939 33946