S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (15-9-2019 నుంచి 21-9-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు ప్రాధాన్యం వహిస్తాయి. విశ్రాంతి లభిస్తుంది.ప్రయాణాదులకు అవకాశం. గుళ్లూ గోపురాలు దర్శిస్తారు. ధార్మిక దానాల వల్ల మేలు కలుగుతుంది. గురువులను సత్కరించడం మంచిది. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు. వ్యతిరేకతలపై విజయం. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ దక్షణ, బాధ్యతలు విస్తరిస్తాయి. వేరు వేరు పనులపై దృష్టి కేంద్రీకరిస్తారు. భాగస్వామ్యాల్లో శుభపరిణామాలు. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం, అలంకరణ, ఆనందంపై దృష్టి పెరుగుతుంది. విహార యాత్రలకు కూడా అవకాశం. వారాంతంలో కుటుంబం, బంధువర్గంలో అనుకూలత, ఆర్థిక వ్యవహారాల్లో తలమునకలవుతారు. మాటతీరులో మంచి మార్పులు ఉంటాయి. కొన్ని గౌరవలోపాలకు అవకాశం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలకు అవకాశం. గౌరవ లోపాలు. పెద్దల కోపాలు, ధార్మిక కార్యక్రమాల్లో జాగ్రత్త అవసరం. ధాన ధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ఊహించని సంఘటనలుంటాయి. కుటుంబ ఆర్థికాంవాల్లో కొంత జాగ్రత్త అవసరం. మాటతీరులో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యనిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. వారం మధ్యమంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి అనేక రకాల కార్యక్రమాల నిర్వహణ. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే అవకాశం. వ్యవహార దక్షణ, సుదూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు. యాత్రలు, సోదర వర్గంతో అనుకూలత. విద్యారంగంలో వైజ్ఞానిక పరిశోధనా రంగంలో మంచి గుర్తింపు. వారాంతంలో వృత్తిలో గుర్తింపు. వ్యాపారాదుల్లో శుభపరిణామాలు. అధికారిక వ్యవహారాలపై దృష్టి. పదోన్నతులకు అవకాశం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలల్లో అనుకూలత . గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యం, సౌకర్యాల కోసం పెట్టుబడులుంటాయి. దానధర్మాలు వల్ల మరింత మేలు కలుగుతుంది. శ్రమ ఉన్న కార్యక్రమాల్లో అనుకూలత. సంతోషంగా ఉంటారు. వారం మధ్యమంలో ఆలోచనల్లో ఒత్తిడ్లు ఉంటాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. శ్రమ తప్పక పోవచ్చు. వైజ్ఞానిక వ్యవహారాల్లో అనుకూలత. పరిశోధనా రంగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం. వారాంతంలో వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సామాజిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. గౌరవం కోసం వెచ్చిస్తారు. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లో ప్రయోజనాలు సమకూరుతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గుర్తింపు ఉంటుంది. కొత్తపనులపై దృష్టి ఏర్పడుతుంది. అన్ని పనుల్లోను లాభాపేక్ష ఉంటుంది. కొంత వ్యాపార ధోరణి. అభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వర్గ వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. వారం మధ్యమంలో ప్రయాణావకాశాలు. పరామర్శలుంటాయి. ఖర్చులు అధికం. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు భావనలకు అవకాశం ఉంటుంది. గొప్పల కోసం డబ్బు వెచ్చిస్తారు. పోటీలు, ఒత్తిడులు బాగా పెరిగే అవకాశం. స్ర్తి వర్గంతో కొంత జాగ్రత్త. కాంటాక్టు వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. పోటీరంగంలో విజయం. వారాంతంలో కార్యనిర్వహణ పెంచుకుంటారు. విశ్వాసం, దృఢ నిశ్చయంతో కార్యక్రమాలు జరుగుతాయి. అనేక కార్య క్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో పరిచయాలు పెంచుకుంటారు. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడిపే ప్రయత్నం. పెద్దలతో అనుబంధాలు ఏర్పడుతాయి. ధార్మిక, వైజ్ఞానిక భావనలు పెంచుకుంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ఇతరుల సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. చిన్న చిన్న ప్రమాదాలకు అవకాశం. మానసిక భౌతిక వ్యవసారాలన్నింటిలోనూ అప్రమత్తగా మెలగాలి. కుటుంబ ఆర్థికాంశాల్లోను ఇబ్బందులుంటాయి. మాట తీరు వల్ల సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. ముఖ్యనిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది. వారాంతంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. ఆత్మవిశ్వసంతో వ్యవహారిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. పెద్దల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనుల నిర్వహణ పై సంతృప్తి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. శుభవార్తా శ్రవణం. వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి. వారం మధ్యమంలో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. గృహవాహనాదులు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యంగా గడపడానికి కొంత శ్రమ తప్పక పోవచ్చు. కొన్ని అనుకోని ఇబ్బందులుంటాయి. పితృవర్గ వ్యవహారాల్లో శుభపరిణామాలుంటాయి. చిన్నచిన్న ప్రమాదాలను అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. వారాంతంలో మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెంచుకుంటారు. సంతానంతో సంతోషంగా గడిపే ప్రయత్నం. కార్యనిర్వహణ దక్షత.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక వ్యవహారాలపై దృష్టి, వ్యాపారాలలో అనుకూలత, విజ్ఞాన వికాసం. సామాజకమైన గుర్తింపు. గౌరవం పెరుగుతుంది. విద్యారంగంలో శుభపరిణామాలు. సౌకర్యాలు సంతోషానిస్తాయి. ఆహార విహారాలలో సంతృప్తి. వారం మధ్యమంలో అన్ని పనుల్లో అనుకూలత, ప్రయోజనాలు సంతోషానిస్తాయి. లాభాపేక్ష దృష్టి పెరగకుండా చూసుకోవాలి. తొందరపాటు కూడదు. ఆలోచనలు ఫలిస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. సంతోషం కాంటాక్టు వ్యవహారాల్లో అనుకూలత, సంతాన వర్గం సంతోషానిస్తుంది. క్రియేటివిటి పెంచుకునే ప్రయత్నం. వారాంతంలో విహార యాత్రల కోసం వెచ్చిస్తారు. విందులుంటాయి. సంతోషంగా గడుపుతారు. వేరు వేరు రూపాల్లో ప్రయాణాలకు అవకాశం. పెట్టుబడుల్లో అనుకూలత.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీరంగంలో గుర్తింపు. వ్యతిరేకతలపై విజయం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ఋణ రోగాదులను అధిగమిస్తారు. నిరోధక శక్తి పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. కష్టపడినప్పటికీ ఆర్థిక ప్రయోజనాలు అధికవౌతాయి. మాటతీరులో మంచి మార్పులు. వారం మధ్యమంలో పరిచయాలు, స్నేహానుబంధాల్లో శుభ పరిణామాలు. ఆలోచనలకు వికసిస్తాయి. భాగస్వామి వల్ల కొన్ని ప్రయోజనాలుంటాయి. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో పెంచుకోవడం పై దృష్టి. వ్యాపారంలోను ఉన్నతి కలుగుతుంది. వారం చివరలో అన్ని పనుల్లోను జాగ్రత్త అవసరం. విందులు, విహారాల కోసం అధికంగా వెచ్చించాల్సి వస్తుంది. నిర్ణయాలు ఆర్థిక సమస్యలకు గురి చేసే అవకాశం. సంతోషంగా, విశ్రాంతిగా గడుపుతారు.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాట విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం. బాధ్యతలు పెరుగుతాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. బంధువర్గ వ్యవసారాలు నిర్వహించాల్సి వస్తుంది. కొన్ని అనుకోని సమస్యలను అధిగమించాలి. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. కమ్యూనికేషన్స్ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాల్సి వస్తుంది. ప్రయాణాదుల్లో జాగ్రత్త వహించాలి. తొందర పాటు నిర్ణయాలు కూడవు. ఇతరులకు సహకారం అందించడం మరింత మంచిది. వారాంతంలో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో అనుకూలత. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. గృహ వాహనాదులను సమకూర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రయాణ భావన. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. వ్యాపార , విహార యాత్రలకు కూడా అవకాశం. విద్యారంగంలో సమమ్నుది.కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. సోదరీమణులతో సంతోషం. వ్యాడార వర్గ సహకారం. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలపై దృష్టి. సామాజిక గౌరవం పెరుగుతుంది. శ్రమ ఉన్నా గుర్తింపు ఉంటుంది. హోదా పెరుగుతుంది. పదోన్నతులు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలపై దృష్టి. పార్టీలలో పాల్గొనే అవకాశం. సౌఖ్యంగా గడుపుతారు. వారాంతంలో అన్ని పనుల్లోను ప్రయోజనాలుంటాయి. లాభాపేక్షతో కార్యక్రమాల నిర్వహణ. కొత్త కాంటాక్టులకు అవకాశం. ఆలోచనలకు రూపకల్పన . క్రియేటివిటీ పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గ వ్యవహారాల్లో గుర్తింపు. నిర్ణయ శక్తిని పెంచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారు. బాధ్యతలు అధికం. క్రియేటివిటీ పెరుగుతుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. వారం మధ్యమంలో వ్యతిరేక ప్రభావాలు విస్తరిస్తాయి. గుర్తింపు కోసం ప్రయత్నం. పోటీలు ఒత్తిడులున్న విజయ సాధన. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. సామాజిక హోదా పెంచుకునేందుకు కృషి అత్యధికంగా చేయాల్సి వస్తుంది. కాంపిటీషన్స్ గెలుపు ఉంటుంది. ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. వినోద, విహారాలు ప్రభావితం చేస్తాయి. వారాంతంలో పరిచయాలు పెరుగుతాయి. అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి. భాగస్వామి వల్ల ప్రయోజనాలుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ చేస్తారు. బాధ్యతలు అధికం. వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. సంతృప్తినీ ఇస్తాయి. కొత్త లక్ష్యాలను సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి. గుళ్లూ, గోపురాలు దర్శిస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. పరిశోధనా రంగంలో గుర్తింపు. వారం మధ్యమంతలో కుటుంబంలో అనుకూలత. మాటల్లో కొంత జాగ్రత్త అవసరం. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టే అవకాశం. పోటీలు, ఒత్తిడులు, చికాకులు అధికమవుతాయి. బంధువర్గ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. భాగస్వామ్యాల్లో అత్యంత శుభపరిణామాలు. కొత్త మిత్రుల ప రిచయం. కాంటాక్టు వ్యవహారాలు లాభిస్తాయి. మీడియా రంగంలోని వారికి అత్యంత అనుకూలత.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744