S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (29.9.2019 నుంచి 5.10.2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యితిరేకతలు అధికవౌతాయి. పోటీలు ఒత్తిడులను అధిగమించాలి. వ్యాపారాదుల్లో అనుకూలత. రుణ విముక్తమయ్యే ప్రయత్నం. క్రమంగా భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. మనస్సు అనిశ్చితంగా ఉండే అవకాశం. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ముఖ్య నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది. గౌరవ లోపాలకు అవకాశం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఊహించని సంఘటనలు ఉంటాయి. వారాంతంలో ఉన్నత లక్ష్యాలను సాధించడంలో విఫలం. ప్రణాళికల్లో ఇబ్బందులు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. బంధువర్గంతో సమస్యలు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. నిల్వధనం కోల్పోయే అవకాశం. మాట విలువ తగ్గే సూచనలు. వౌనంగా మెలగాలి. తొందరపాటు కూడదు. స్పందనలు తగ్గించుకోవాలి. క్రమంగా సంప్రదింపులుంటాయి. స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి. విహార యాత్రలకు అవకాశం. మంచి వార్తలు వింటారు. దగ్గరి ప్రయాణాలుంటాయి. వారం మధ్యమంలో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాదుల్లో అనుకూలత. సౌఖ్యంగా గడుపుతారు. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. విద్యారంగంలోని వారికి అనుకూలత. వారాంతంలో ఆలోచనల్లో ఒత్తిడులు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. అధికారుల వల్ల సమస్యలు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. సామాజిక గౌరవం ఉన్నా అధిక శ్రమ తప్పదు. అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. ప్రయాణావకాశాలు. క్రమంగా అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. ప్రయోజనాలు సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. కీర్తి ప్రతిష్ఠలు విస్తరించే అవకాశం. వారం మధ్యమంలో ఖర్చులు అధికం. వేరు వేరు రూపాల్లో పెట్టుబడులుంటాయి. ధార్మికమైన దానాల వల్ల మాత్రమే మేలు కలుగుతుంది. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడుపుతారు. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. వారాంతంలో నిర్ణయాదుల్లో ఆలస్యం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనల్లో ఒత్తిడులకు అవకాశం. కొంత ఆందోళన తప్పకపోవచ్చు. సంతానవర్గ వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. క్రియేటివిటీ తగ్గే సూచనలు. క్రమంగా వ్యతిరేకతలను అధిగమిస్తారు. పోటీల్లో విజయం. కార్యనిర్వహణ దక్షత. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. రుణ రోగాదులపై విజయం సాధిస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వారం మధ్యమంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసం. గౌరవం పెరుగుతుంది. పెద్దలు, పాతమిత్రుల కలయిక. భాగస్వామితో కలిసి ప్రయాణం. వారాంతంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. కొత్త నిర్ణయాదులు కూడదు. అప్రమత్తంగా మెలగాలి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదుల వల్ల సమస్యలుంటాయి. ఆత్మవిశ్వాస లోపాలు. అనేక రకాల భావాలు ఇబ్బంది పెట్టే అవకాశం. తొందరపాటు కూడదు. బాధ్యతల నిర్వహణలో శ్రమ తప్పకపోవచ్చు. క్రమంగా కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. బంధువర్గ వ్యవహారాల్లో అనుకూలత. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. కొన్ని అనూహ్య పరిణామాలకు అవకాశం. వ్యాపారాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. శుభ వార్తలు అందుతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీడియా రంగంలోని వారికి విశేష గుర్తింపు. పెద్దలతో అనుబంధాలు మెరుగుపడతాయి. దగ్గరి ప్రయాణాదుల్లో అనుకూలత. కొంత శారీరక ఒత్తిడి ఉంటుంది. వారాంతంలో సౌకర్య లోపాలకు అవకాశం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. సుదూర ప్రయాణాలపై ఆసక్తి. ఆధ్యాత్మిక వ్యవహారాలపై అసంతృప్తి. అధికారిక గుర్తింపుపై ప్రీతి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే మార్గం వైపు ప్రత్యేక దృష్టి. సంప్రదింపులుంటాయి. సహకారం లభిస్తుంది. క్రమంగా వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. పదోన్నతులకు కూడా సరియైన అవకాశం. సామాజిక గౌరవం పెరుగుతుంది. తండ్రి తరఫున వ్యవహారాల్లో పురోగతి. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గురువులను దర్శించుకునే అవకాశం. ఆలోచనలు ఫలిస్తాయి. సంతాన వర్గంతో అనుకూలత. సృజనాత్మకత. కొత్త పనులపై దృష్టి. వారాంతంలో కాలం ధనం వ్యర్థవౌతాయి. కార్యనిర్వహణలో లోపాలుంటాయి. పెట్టుబడులు, ఖర్చులు ఇబ్బందులకు గురి చేస్తాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. శ్రమాధిక్యం. ఆహార విహారాల్లో ఇబ్బందులు. ప్రయాణాదుల్లో సమస్యలు. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త. గృహ వాహనాదుల వల్ల సమస్యలకు అవకాశం. క్రమంగా ఆలోచనల్లో పరిణతి. అభీష్టాలు నెరవేరుతాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి. క్రియేటివిటీ పెంచుకుంటారు. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. వారం మధ్యమంలో వ్యతిరేకతలు ఉన్నా విజయం సాధిస్తారు. పోటీ రంగంలో గెలుపు ఉంటుంది. కొందరి సహకారం లభిస్తుంది. అయినా ఇతరుల సహకారాలకు దూరంగా ఉండడం మంచిది. కార్యనిర్వహణలో శ్రమ ఉన్నా ఫలితాలు సాధిస్తారు. వారాంతంలో సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పరిచయాలు స్నేహానుబంధాలలో జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. కాలం ధనం శ్రమ పోగొట్టుకునే సూచనలు. విశ్రాంతి లోపం. ప్రయాణాదుల్లో జాగ్రత్త. సౌఖ్య లోపం ఉంటుంది. క్రమంగా ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాల నిర్వహణ. బాధ్యతలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి. కొత్త నిర్ణయాదులున్నా ఖర్చులు తప్పకపోవచ్చు. విహార యాత్రలకు అవకాశం. వారం మధ్యమంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాలపై దృష్టి. ఆత్మీయుల కలయిక. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పెరిగే అవకాశం. కొన్ని అనూహ్య పరిణామాలకు కూడా అవకాశం. వారాంతంలో సంప్రదింపుల్లో జాగ్రత్త. ప్రయాణాదుల్లో సమస్యలు.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. ఊహించని సంఘటనలు. కార్యనిర్వహణలో లోపాలుంటాయి. కాలం ధనం వ్యర్థం అయ్యే అవకాశం. అప్రమత్తంగా ఉండాలి. క్రమంగా ఉన్నత కార్యక్రమాలపై దృష్టి. సుదూర లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక స్థలాల దర్శనం. వ్యవహారాల్లో సమున్నత దృష్టి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే దృష్టి. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. పదోన్నతులకు అవకాశం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. అధికారిక వ్యవహారాల్లో ఘర్షణ. సమస్యలు అధికం. పనుల్లో మునిగి తేలుతారు. వారాంతంలో ప్రయోజనాలు కోల్పోయే అవకాశం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఆలోచనల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. సంతానవర్గ సమస్యలు.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. కొన్ని సమస్యలకు కూడా అవకాశం. సోదరవర్గంతో ఒత్తిడులు. వ్యాపారాదుల్లో సంతృప్తి. శుభాశుభ వర్తమానాలు, వార్తలు ఉంటాయి. క్రమంగా సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ప్రయాణాదుల్లో అనుకూలత. విద్యా రంగంలోని వారికి మేలు. వారం మధ్యమంలో అభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వర్గంతో సంతృప్తి. నూతన ప్రణాళికలుంటాయి. సృజనాత్మకత విస్తరిస్తుంది. అన్ని పనుల్లోనూ అనుకూలత. పెద్దలతో అనుబంధాలు మెరుగుపడతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వారాంతంలో పోటీలు అధికం అవుతాయి. వ్యతిరేకతలు పెంచుకోవడం వల్ల సమస్యలు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. కొత్త పనులపై దృష్టి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారాదుల్లో అనుకూలత. కార్యనిర్వహణలో సంతోషం. క్రమంగా ఖర్చులు పెట్టుబడులు అధికం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాదుల్లో శుభ పరిణామాలు. విహార యాత్రలకు అవకాశం. ధనాన్ని కాలాన్ని సంతోషం కోసం వెచ్చిస్తారు. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. వారం మధ్యమంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. గౌరవం పెంచుకుంటారు. బాధ్యతలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ముఖ్య నిర్ణయాదులను తీసుకోవాల్సి ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. సమర్థత రాణిస్తుంది. వారాంతంలో కుటుంబంలో ఒత్తిడులు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో అప్రమత్తంగా మెలగాలి. అనేక రకాల వ్యక్తులతోనూ వ్యవహారాల్లోనూ కలిసి పని చేయాల్సి రావచ్చు. భాగస్వామితో జాగ్రత్త. వ్యాపారానుబంధాలు విస్తరిస్తాయి. అనుకోని సమస్యలు. ఆనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఊహించని సంఘటనలుంటాయి. ఆర్థిక సామాజికాంశాల్లో సమస్యలకు అవకాశం. కొత్త నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. వారం మధ్యమంలో కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. గుర్తింపు గౌరవాలుంటాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. సుదూర ప్రయాణ లక్ష్యాలను, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాదులకు అవకాశం. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744