S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిత్రసీమ మకాం మార్చినవేళ!

అరవై నాలుగు ఉగాదికి - ఆంధ్రపత్రిక ఆఫీసులో - వినాయక చవితి కళ కనిపించింది. ఆంధ్ర పత్రికకి పుట్టిన రోజు వేడుకలు అంటే వినాయక నవరాత్రులే. డిపార్ట్‌మెంట్‌ల వారీగా విఘ్నేశ్వర పూజలు చెయ్యడం - ప్రసాదాల పంపిణీలో - విగ్రహాలంకరణలో - ఎవరి ప్రత్యేకత వారు చాటుకోవడం ఒక పరంపర. కానీ ఆ సారి అదనంగా - ఉగాది వేడుకలు అంటూ సిబ్బంది చేసుకోడాన్ని - నేను వెనకేసుకొచ్చాను. అందర్నీ కూర్చోబెట్టి పల్లకీ మోసే బోరుూలెవరోయ్? అంటే - మేమేనంటారు వర్కర్లు - మాకు కావాలి పేపర్లో పడే పండుగలనేవాళ్లు - చెప్పానుగా. వర్కర్లలో నటులున్నారు. గాయకులూ లేకపోలేదు. బి.బశే్వశ్వర్ సర్క్యులేషన్ సెక్షన్. కమ్మగా రఫీ పాటలు పాడతాడని - పెళ్లి పందిళ్లలో ఇతని సినీ పాటల కచేరీకి డిమాడు వున్నది అనీ తెలుసు. అతనితోపాటు పాడే ఇరవై సంవత్సరాల అమెచ్యూర్ గాయని వసంత. వీళ్ల పాటలు మేనేజ్‌మెంట్ సిబ్బంది వినాలని ఎప్పటి నుంచో వున్న కోరిక. వాళ్లకే ఓ ట్రూపు వుంది కానీ పేపర్‌లో పడాలనే కోరిక మాత్రం తీరలేదు. వెనక్కి తిరిగి చూస్తే - ఓ యాభై అరవై ఇండ్లలో సమాచార రంగంలో - ఎలక్ట్రానిక్ టెక్నాలజీ తెచ్చిన మార్పులు నిజమా అనిపిస్తాయి. అమెచ్యూర్ కళాకారులకి - సరదా కళాకారులకి - అలాగే ప్రవాస ఆంధ్ర సంఘాల వారికి పేపర్‌లో పడాలని కోరిక మిక్కుటంగా వుండేది. ఖరగ్‌పూర్, బిలాస్‌పూర్, రూర్కెలా, భిలాయి, నాగపూర్ లాంటి చోట్ల మనవాళ్లదే డామినేషన్. కలకత్తా, బొంబాయి నగరాల్లో కూడా జరిగే వేడుకలకి - వీక్లీని అతి క్లుప్తంగా వేదిక చెయ్యాలి అన్నది కోరిక. ఆ ప్రాంతాలలో వారపత్రిక కోసం రైల్వే స్టేషన్‌కి ట్రిప్పులు వేసి - కాలనీ వాసులు తెలుగు మేగజీన్లు కొనేవారు. మొత్తం మీద - కథలు కార్టూన్లు వేసుకోక - ఈ సోకాల్డ్ సాంస్కృతిక కార్యక్రమాలు - ఎవడిక్కావాలి? అనే వాళ్లు. కానీ నేను అవీ ఇవీ అన్న శీర్షికకు పేజీ పెట్టి విస్తరించాను. అన్నీ అన్న తోక చేర్చి - అవీ ఇవీ అన్నీ అన్నాను. భారతి పత్రికలో కలగూరగంప అని ఓ శీర్షిక వుండేది. అదీ నాకు ప్రేరణ. ఈ శీర్షికలో అన్ని రకాల విశేషాలు ఆంక్ష ఆక్షేపణ లేకుండా వెయ్యొచ్చును. తెలుగు వాడెక్కడ వున్నా దినపత్రిక కాదు వెళ్ళేది వారపత్రిక - క్లర్క్ బసవేశ్వర్ మా రూమ్‌కి వచ్చి కిషోర్ పాటలు వినిపించేవాడు. యోడ్లింగ్.. కిశోర్‌లాగ చెయ్యడానికి ప్రయత్నం చేసేవాడు కానీ అతనికి రఫీ పాటలే బాగా అతికేయి. ఉగాదికి ఆఫీసు ఆవరణలోనే బసవేశ్వర్ ట్రూప్ కచేరీకి అందర్నీ ఒప్పించాము. తెలుగు మాటలు ‘నేర్పడం’ కోసం జి.ఎం.ని. ఆయన ఛాంబర్‌లో కలిసేవాణ్ణిగా సాపాటుకి కూడా పోకుండా. డైలీలో శ్రీరాములుగారు ఇన్‌ఛార్జి ఎడిటర్. అందరం సమావేశమైన లలిత మధుర సంగీత భరిత సన్నివేశం అదే - దేనికయినా అయ్యర్‌ని (అయ్యవారు) అడిగి చెబుతానని గడుసుగా చెప్పే కుంచితపాదంగారు కూడా దీనికి హాజరు. రాధాకృష్ణగారు చీఫ్ గెస్ట్.. నేను ఆర్గనైజేషన్ లాంటి వాటికి దూరం - కర్రపెత్తనమే కానీ చాకిరికి పనికిరాను - ఓపిక సహనం వగైరాల మీద - లెక్చర్లు.. ఓకే.. అప్పలరాజు ఆర్కెస్ట్రా దిగబడింది.. దాని మీద అదేదో స్టార్‌నైట్ అయినట్లు రెండు బొమ్మలు కూడా వేసి నేనే సమీక్ష రిపోర్టు రాశాను. జియముడుగారి దగ్గర నించి ఎన్నడూ ఫొటోకి రాను అనే ఎస్సార్‌గారు దాకా, అంతా వారపత్రికలో సినిమా పేజీలకన్నా పాపులర్ అయిన అవీ ఇవీ అన్నీలో పడ్డారు. సరే - అదొక సంధికాలం. హైదరాబాద్‌కి తెలుగుదనం కావాలి. చెన్నైకి తెలుగుదనం వదులుకోవడం కావాలి.
‘హై’బాదులో - సినిమా కళకళ... సరిగ్గా, అదే టైములో హీరో అక్కినేని - అమెరికా గవర్నమెంట్ ఆహ్వానం మీద స్టేట్స్‌కి ప్రయాణమైన (హైదరాబాద్ నుంచి) వెళ్తున్నాడు. ఓహోమని ఆంధ్రలో - హైబాదు నుంచి విజయవాడ మీదుగా అక్కినేని సొంత వూరు దాక ఝామ్మని సన్మానాలు జరిగాయి. అదేదో, యాత్ర జేగీయమానంగా ముగించుకు వచ్చినట్లు - బ్రహ్మాండంగా ఊరేగింపులు గట్రా సాగేయి. దానికి కూడా ‘అవీ ఇవీ అన్నీ’యే వేదికగా కవరేజీ ఇచ్చాము. ఈ సన్మానాలు సంబరాలు మరో అందుకు కూడా చెప్పుకోవలసిన సందర్భం, సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ ఊరేగింపులో సావిత్రి నుంచి రాజసులోచన దాకా ఉత్సవరధాలు ఎక్కారు ఉద్దేలంగా.. కోట్ చేస్తున్నా సదరు రిపోర్టు.. ‘ఆంధ్రుల రాజధాని ఐన హైదరాబాద్ నగరం - గత వారమంతా ఎనె్నన్నో అందచందాలతో మురిసి మెరిసిపోయింది. ఆంధ్రుల ప్రియతమ నాయకుడు అక్కినేని నాగేశ్వరరావు అమెరికా వెళ్తున్న సందర్భంలో - రాజధానిలో ఎన్నో వేడుకలు ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఆబాలగోపాలము ఆ ఉత్సవాలలో పాల్గొని - ఆ మహానటునికి సన్మానం చేసి చారిత్రాత్మకమైన వీడ్కోలు ఇచ్చి పంపటం జరిగింది. కోఠీ నుంచి నిజాం కళాశాల వరకు జరిగిన ఊరేగింపు చూపరులకు ‘దిగ్భ్రమ’ కలిగించింది’ - ఇలా సాగింది ఆంధ్రపత్రిక బ్యూరో రిపోర్టు. ఇంకా కొంచెం చదువుదాం - ‘శ్రీయుతులు జగ్గయ్య, గుమ్మడి, సావిత్రి, సూర్యకాంతం, రాజసులోచనా ప్రభృతులు - పూల రధాల మీద పాల్గొనడం కేవలం ఆయా నటుల విశాల దృక్పథానికే నిదర్శనం. ఇంకా ఆంధ్రావని సంబరాలను కూడా పత్రిక రిపోర్టు చేసింది. ఇదిలా గొప్పగా సాగింది కట్ చేసి - చెప్పాల్సిన సంగతి ఏమిటీ అంటే తమిళనాడు నుంచి తెలుగు నాడుకి మన ఫిలిం ఇండస్ట్రీ ప్రస్థానం చెయ్యడం - నాగేశ్వరరావు అందుకు నాందీ ప్రస్తావన చెయ్యడం - ఇవి చారిత్రిక సత్యాలు. ఈ సందడిలో అవి వెల్లడయ్యాయి. లేకపోతే ఈ వీడ్కోలు సంబరాలు మద్రాసులో జరిగేవి. చివరగా అక్కినేని వివరణ ఇవ్వడం ఈ మహోత్సవాన హైలైట్.. బైదిబై అక్కినేని మద్రాసు నుంచి రాజధాని హైదరాబాద్‌కి మూటాముల్లె సర్దుకుని వెడుతూ - తన మద్రాసు స్వగృహంలో పెట్టిన విలేఖరుల సమావేశానికి నేను వెళ్లాను. అది ఆనక చెప్పుకోవచ్చును. ఇక్కడ నాగేశ్వరరావుగారి స్పందన అన్నదే ముఖ్యమైన రిపోర్టు. మా హైదరాబాద్ లేఖ రాజధాని కబుర్లలో కూడా అక్కినేని చెప్పినది వివరంగా వున్నది. అది, పేర్కొంటాను. ‘తానేదో చలనచిత్ర పరిశ్రమను ఉద్ధరించడానికి ఇక్కడికి తరలి వచ్చననటంలో సత్యం లేదు. ఆనాటి పరిస్థితుల్లో మద్రాసు స్టూడియోలలో సమ్మె జరిగిన దృష్ట్యా రెండు మూడు చిత్రాలు తియ్యడానికి మాత్రమే సారథి స్టూడియోకి రావడం జరిగింది. వచ్చిన తరువాత ఇక్కడ కనపడ్డ అనువైన వాతావరణం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం - కొత్త ఆలోచనలకి తావు ఇచ్చింది - దుక్కిపాటి మధుసూదనరావు గారి సూచనలు కూడా కారణం అయ్యాయి అన్నది తన వివరణ - అటు తరువాత విజయవాడలో మొత్తం 187 సంస్థలు బ్రహ్మాండంగా సన్మానించాయి అక్కినేనిని. అక్కినేని వీడ్కోలు సన్మానంతోపాటు మా వాళ్లు పత్రికలో పడ్డారు. ఆనందమే ఆనందం. ఎందుకు చెబుతున్నాను అంటే మద్రాసులో పత్రికల ఆఫీసులలో తప్ప, ఇంకెక్కడా తెలుగు వాసనలు లేకుండా పోతున్న దశ అది. అదేమీ విజయవాడ కాదు - వైజాగ్ కాదు. తమిళనాడు మద్రాసు. అక్కడ తెలుగు సినిమా చూడాలంటే మార్నింగ్‌లో పాత సినిమాలు చూసే స్థితి వచ్సేచింది. మాకు దగ్గరిలో సౌందర్య మహల్ హాలు ఉండేది. మన తెలుగు ట్రూప్‌లు వచ్చి పౌరాణిక ఒక్కోసారి సాంఘిక నాటకాలు ప్రదర్శించేవారు. దేశం నుంచి (మన రాష్ట్రం) పెద్ద ట్రూప్‌లు కూడా వచ్చి నాటకాలు వేసేవారు. వీటికి వాసిరాజు ప్రకాశాన్ని పంపి మరీ వీక్లీలో కవరేజి ఇచ్చేవాణ్ని. కంపోజింగ్ సర్క్యులేషన్ శాఖలకి హుషారు ఉంటేనే ప్రాచుర్యానికి దోహదం. కానీ వీక్లీకి ‘సర్క్యులేషన్ డ్రైవ్’ లాంటిది సరిగ్గా లేదు (నా వాదన). అసలే న్యూస్‌ప్రింట్ లేదు నెపా మీద వేస్తే అలుకుగడ్డ లాగ వున్నది అని గోల. కవర్‌పేజీ విషయంలో తగినంత శ్రద్ధ రీసెర్చ్ లేదు అని దుఃఖం. ఆడబొమ్మ ఏదైనా నో ప్రాబ్లెం. కొత్త అమ్మాయిలు - ‘పిన్-అప్స్’ అనదగ్గ వాళ్లు. ‘ఒ.కే.’ కానీ మగబొమ్మల్లో ఎంతసేపూ ఆ మహానటులే తప్ప కొత్త నటున్ని వేస్తే - కాపీలలు తిరిగొచ్చేవి - కత్తి కాంతారావు గుమ్మడి ఎస్వీఆర్ జగ్గయ్యల నాన్ సినిమా బొమ్మలు - తెర మీద - తెర వెనుక కోసం తీసినప్పుడే తీయించి పెట్టుకొని వేసినా, కొందరు అబ్బా.. ‘వీళ్లు ఎక్కరండీ!’ అనే వాళ్లు. ఓ ఎక్సరిమెంట్ చేశాడు రాధాకృష్ణగారు. కవరు మీద ‘పైకి’ వస్తున్న శోభన్‌బాబు, రామకృష్ణ వగైరా బొమ్మల్ని నాలుగో వంతు సైజులో వేసి మిగతా జాగాలో - బాపు వేసిన కార్టూన్లతో మార్కెట్‌లోకి వెళ్లాం గానీ - ముక్కు బజ్జీ అయిపోయింది. ప్రత్యేక సంచికకి అయిదు పైసలు పెంచి - ముప్పై పైసలు అంటేనే - ప్రకటనలేగా? ఎక్కువ అని నిలదీసేవారు. ఇక ప్రకటనకర్తలు వాళ్ల డిమాండ్ వాళ్లది. మధ్య పేజీ ప్రకటనలు వస్తే మురిసిపోయేవాళ్లం. అవతల ప్రభ పోటీ ఒక్కోసారి మరీ ఎక్కువయిపోయి - ఓ మార్పు చేశాము. ఫుల్ పేజీలు ఎడమ ప్రక్కన వేసేవాళ్లం. డబుల్ కాలమ్ కుడి ప్రక్కన. దీనితో కొందరు మాకు ‘డీసీ ప్రకటన చాలులే’ అనే వాళ్లు. వెంటనే ఓ ఐడియా వచ్చింది. ఫుల్ పేజీలు కుడివేపునకు మార్చేశాం. పేజీ తియ్యగానే కొట్టొచ్చినట్టు ఉండేవి. డైలీ కాలంకన్నా వీక్లీ కాలం సైజు పెద్దదే. దాన్ని మరో అర సెంటీమీటర్ పెంచాము. అందుకని బొమ్మని టాప్ కార్నర్‌లో పెట్టి పేజీకి అటూ ఇటూ వచ్చే తెల్లని జాగాని కూడా ప్రింట్ జాగాలో పెట్టేవాన్ని. దీన్ని ప్లష్కట్ అంటారు. నా మీద అదో కంప్లైంట్. ఈలోగా తెలుగు నగారాలలో - వారపత్రికలను - మాసపత్రికలను కూడా అద్దెకు ఇచ్చే ‘కేంద్రాలు’ వెలిశాయి. ఇవి ఇల్లాండ్రు నడిపేవారు. దుకాణాలు అన వీలులేదు కేంద్రాలు అనాలి. ఒక రకంగా మా సర్క్యులేషన్‌కి దెబ్బా? అంటే కాలేదు. పైగా, ఏ సీరియల్ ఏ ఫీచర్ ఎట్లా పోతున్నదీ? అన్నది వీళ్ల ద్వారా తెలిసేది. గాంధీ నగరంలో పాత కొత్త ఇంగ్లీషు నవలలు కూడా అద్దెకి జోరుగా పోతూ ఉండేవి. వీటివల్ల వీక్లీలకి దెబ్బ లేదు - సీరియల్స్‌ని చాలామంది విడిగా తీసి పుస్తకంగా అతికించి పొందుపరచుకొనేవారు. అందుకనే సీరియల్స్‌ని ఒకదాని వెనుక ఒకటి పడకుండా పెట్టాలని ఉత్తరాలు రాసేవారు. అదంతా అంతులేని ఆరాటం.. కానీ నాకు సర్క్యులేషన్ యావ తగ్గలేదు.
(ఇంకా భోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com