S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (13.10.2019 నుంచి 19.10.2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో విశ్రాంతికి ప్రాధాన్యం ఉంటుంది. విందులు వినోదాలు తప్పవు. ఖర్చులు పెట్టుబడులు కూడా అధికం. ప్రయాణాలకు అవకాశం. వారం మధ్యమంలో అనేక బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. శ్రమాధిక్యం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొంత మొండిగా కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని వ్యవహారాల్లోనూ అనుకూలత. భాగస్వామ్యాలలో శుభ పరిణామాలు. నూతన నిర్ణయాలకు అనుకూలం. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా గడుపుతారు. వారాంతంలో కుటుంబ, బంధువర్గ వ్యవహారాలపై దృష్టి. ఆర్థిక వ్యవహారాలను చర్చిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. కాంట్రాక్టు వ్యవహారాలకు అనుకూలం. మాట విలువ పెంచుకుంటారు. ఆత్మీయులతో చర్చిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. అప్రమత్తంగా మెలగాలి. కార్యనిర్వహణలో జాగ్రత్తలు అవసరం. ముఖ్య నిర్ణయాదులు వాయిదా వేసుకోవడం శ్రేష్ఠం. వారం మధ్యమంలో నూతన కార్యక్రమాల నిర్వహణ. ఉన్నత వ్యవహారాలు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. మాటల్లో తొందరపాటు కూడదు. సుదూర ప్రయాణ లక్ష్యాలు నెరవేరుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. వారాంతంలో సామాజిక హోదా పెరుగుతుంది. గుర్తింపు, గౌరవాదులుంటాయి. పితృవర్గ వారి వ్యవహారాల్లో తలమునకలవుతారు. స్ర్తి వర్గంతో సంప్రదింపులుంటాయి. సహకారం లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాలకు అనుకూలం. శ్రమతో కార్యక్రమాలుంటాయి. గృహ వాహనాది సౌకర్యాల కోసం ధనం, కాలం వెచ్చించాల్సి వస్తుంది. దానధర్మాల వల్ల మరింత అనుకూలత. సంతోషంగా గడుపుతారు. వారం మధ్యమంలో ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. సంతానవర్గ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. శ్రమతో కార్యక్రమాలు. కష్టపడితే గానీ గుర్తింపు ఉండదు. సామాజిక గౌరవం పెంచుకునేందుకు జాగ్రత్తగా కృషి చేయాల్సి వస్తుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రణాళికల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. లాభాలు కొన్ని సంతోషాన్నిస్తాయి. వారాంతంలో వ్యతిరేకులు పెరిగే అవకాశం. పోటీ రంగంలో అప్రమత్తంగా మెలగాలి. అయినా అనేక రూపాల్లో ప్రయోజనాలుంటాయి. ఖర్చులు ఉన్నా అవి శుభ కార్యాల కోసం ఉంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో అనేక రూపాల్లో ప్రయోజనాలు ఉంటాయి. లాభాల వల్ల సంతృప్తి. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందులు వినోదాలపై దృష్టి ఉంటుంది. విశ్రాంతిని కోరుకుంటారు. పరామర్శలకు కూడా అవకాశం ఉంది. ప్రయాణాలుంటాయి. మానసికమైన కొంత ఉద్రిక్తత ఉంటుంది. సంతాన వర్గ వ్యవహారాల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టినా, పోటీ రంగంలో విజయం సాధిస్తారు. గుర్తింపు. వారాంతంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని కార్యక్రమాలకు అనుకూలత. భాగస్వామితో సంతోషంగా గడిపే ప్రయత్నం. గౌరవం పెరుగుతుంది. కార్యనిర్వహణ దక్షత. శత్రువులపై విజయం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సామాజిక అనుబంధాలు మెరుగుపడతాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పూర్వ మిత్రులను కలిసే అవకాశం. పెద్దల నుండి మంచి సమాచారం అందుతుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. తొందరపాటు కూడదు. శారీరక, మానసిక ఒత్తిడులు. నిర్ణయాలు ఇబ్బంది పెట్టవచ్చు. ఊహించని ఇబ్బందులుంటాయి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రశాంతంగా, దైవధ్యానంతో కాలం గడపాలి. దాన ధర్మాల వల్ల అధికమైన మేలు కలుగుతుంది. ప్రమాదాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. వారాంతంలో ఉన్నత వ్యవహారాలుంటాయి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కార్యనిర్వహణ.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. సమాచారం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనేక రూపాల్లో గౌరవం లభిస్తుంది. కొత్త పనులపై దృష్టి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ప్రయోజనకరమైన వార్తలుంటాయి. వారం మధ్యమంలో సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాలకు అనుకూలం. కృషితో కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. విద్యారంగంలోని వారికి అత్యంత అనుకూలం. గృహ వాహనాదులు సంతోషాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. అభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వర్గంతో సంతోషంగా వ్యవహరిస్తారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సృజనాత్మకతతో కార్యనిర్వహణ ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. సామాజిక గౌరవం పెరుగుతుంది. పదోన్నతులు సంతోషాన్నిస్తాయి. పోటీ రంగంలో గుర్తింపు. విజయం. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనుల నిర్వహణ. సంతోషంగా గడుపుతారు. సౌకర్యాలు సౌఖ్యాదుల కోసం ప్రయాణాలు, ఖర్చులు ఉంటాయి. ఆలోచనలకు రూపకల్పన. లాభ దృష్టి అధికంగా ఉంటుంది. అన్ని పనుల్లోనూ అనుకూలత. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. విందులు వినోదాలుంటాయి. విలాసాల కోసం కాలం ధనం వెచ్చించే అవకాశం. క్రియేటివిటీ పెరుగుతుంది. సంతాన వర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. విశ్రాంతి లభిస్తుంది. విహార యాత్రలకు కూడా అవకాశం అధికం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీలు ఒత్తిడులు అధికవౌతాయి. విజయ సాధన. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. శ్రమాధిక్యం. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. మంచి ఖర్చులు, అనుకూలమైన పెట్టుబడులు ఉంటాయి. వారం మధ్యమంలో అనుబంధాలు విస్తరిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. భాగస్వామ్యాల్లో అనుకూలత ఉన్నా ఖర్చులు తప్పకపోవచ్చు. భాగస్వామితో కలిసి ప్రయాణావకాశాలు. వ్యర్థమైన ఖర్చులు, పెట్టుబడులకు అవకాశం. జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వారాంతంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయాలు ఇబ్బంది పెట్టే అవకాశం. ముఖ్య నిర్ణయాలు తీసుకోదలచినప్పుడు ఇతరులతో సంప్రదింపులు అవసరం.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకుంటారు. బంధువర్గ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. కొన్ని అనుకోని ఇబ్బందులుంటాయి. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. అనేక రూపాల్లో సమాచారం లభిస్తుంది. వార్తలు సంతోషాన్నిస్తాయి. అనుకోని సమస్యలుంటాయి. వ్యర్థంగా కాలం ధనం కోల్పోవచ్చు. ప్రమాదాలకు అవకాశం. సుదూర లక్ష్యాలను సాధించే యత్నం. వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. సంతోషంగా కాలం గడిపే ప్రయత్నం. వారాంతంలో ఆహార విహారాలకు అనుకూలం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. దగ్గరి ప్రయాణావకాశాలు. వైజ్ఞానిక, పరిశోధనా రంగాల వారికి గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కార్యక్రమాల్లో సంతోషం, సంతృప్తి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ సంతోషం. నూతన కార్యక్రమాల నిర్వహణ. సృజనాత్మక శక్తితో వ్యవహారాలు నిర్వహిస్తారు. కొత్త నిర్ణయాదులు తీసుకుంటారు. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. వేరు వేరు పనుల్లో బిజీగా అవుతారు. అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. లాభాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. గృహ వాహనాదుల విషయం చర్చలకు వస్తుంది. చివరలో ఖర్చులు అధికం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గంతో సంతోషం, సంతృప్తి. గౌరవం పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. నిర్ణయాదులకు అనుకూలం. కొత్త నిర్ణయాదులకు అనుకూల సమయం. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వారం మధ్యమంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు ఒత్తిడులు అధికం. లాభాలు ఉన్నా తొందరపాటు ఉంటుంది. అధికమైన ప్రయోజనాలను కోరుకుంటారు. ప్రశాంతంగా గడపాలి. రుణాలు, రోగాలు ఇబ్బందులకు గురి చేయవచ్చు. పెద్దలతోనూ అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. ఇష్టమైన వారితో ప్రయాణాలు, విహార యాత్రలు చేసే అవకాశం. విలాసాలు, విందులు, వినోదాల కోసం అధికంగా వెచ్చిస్తారు. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారు. బాధ్యతలు అధికం. కార్యనిర్వహణ దక్షత. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కొత్త పనులపై దృష్టి. భాగస్వామ్యాలలో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. వారం మధ్యలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాలు చర్చల్లోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి. మాట్లాడే ధోరణిలో శుభ పరిణామాలుంటాయి. అనుబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలను వింటారు. దగ్గరి ప్రయాణాలుంటాయి. స్ర్తివర్గంతో ఆచితూచి వ్యవహరించాలి. సుదూర లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సమాచార రంగంలోని వారికి అత్యంత అనుకూలత. గౌరవం, కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744