నీ స్థానం ఎక్కడ...?
Published Monday, 18 November 2019నీ పుట్టుక ఒక ప్రశ్నార్థకం
నీ ఎదుగుదల భూమికి భారం
ఇంతకీ నువు చేసిన నేరమేంటంటే
నువు అబలగా జన్మించడం
లింగ నిర్ధారణతోనే నిన్ను
భ్రూణ హత్యలు చేసేస్తున్నారు
సంప్రదాయాలూ, కట్టుబాట్లూ
నీకు కట్టు బానిసలు
పురుషులతో సమానమయినా
మగ పురుగులు నిన్ను వంటగదికీ
ఇంటికీ బందీని చేస్తారు..
మంగళసూత్రం ఉచ్చు పడగానే
నీ కోరికలూ, ఆశయాలూ
ఆవిరయి పోతాయి
ప్రపంచమంతా స్ర్తి ప్రకృతి అంటుంటే
మహిళలు అన్నింటా మేటి అంటుంటే
రంగుల లోకంలో సీతాకోక చిలుకలా
అష్టకష్టాలు పడి ఆపసోపాలు పడుతూ
అక్రమ రవాణా, గృహహింస
వరకట్న వేధింపులతో
ప్రేమోన్మాదం, అరాచకాలూ, వేధింపులతో
అత్యాచారాలతో, అంట్లు తోముతూ
బట్టలుతుకుతూ, వెట్టిచాకిరీ చేస్తూ
ఇంటికి వెలుగునిచ్చే దీపంలా
కొవ్వొత్తిలా కరిగిపోతున్న నీకు
ఈ నింగిలో నీ స్థానం ఎక్కడ..!