S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కూరలూ కేన్సరుకు మందులే!

కూరగాయలకు ఫండ్లకు రకరకాల రంగులు, సువాసనలు, రుచులూ ఉంటాయి. దేని ప్రత్యేకత దానిదిగానే ఉంటాయి. కూరగాయలకు, పండ్లకూ ఆ రంగు, రుచి, సువాసనలను అందించే రసాయనాలలో కెరటినాయిడ్లు, ప్లావనాయిడ్లు ముఖ్యమైనవి. ఇవి మొకకలలోని రసాయన మేలు చేసే సహజ రసాయన ద్రవ్యాలు. వాటి ఆరోగ్య ప్రభావాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోవటంవలన కొన్ని ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నాం. పళ్ళరసాలు త్రాగటం అంటే చాలామంది, పండుని నిమ్మరం పిండినట్టుగా పిండి ఆ రసాన్నిన వడగట్టి, ఏ మాత్రం పీచు లేకుండా శుద్ధ జలం మాత్రమే అతాగాలని భావిస్తారు. నిజానికి ఇలాంటి పండ్ల రసం శుద్ధ జలంతో సమానమే. పీచు (డైటరీ ఫైబర్) అనే అసలైన కేన్సరు నివారక ఔషధన్నా మనం వడగట్టి బయట పారేస్తున్నాం. అందుకని, కమలా, బత్తాయి, నారింజ లాంటి పండ్లను తొనలుగానే తినండి. కేవలం రసం తీసి తాగితే ఫలితం తక్కువ.
కూరల్ని కూడా ఇలానే పీచు అధికంగా ఉండే భాగాలను పారేసి, మసాలాలు, చింతపండులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి కూరని చాలా తక్కువగాను, అన్నం ఎక్కువగానూ తినే పద్ధతికి బాగా అలవాటుపడిపోయాం. ఎక్కువ పీచు కలిగిన కూరగాయలతో అన్నం తక్కువగానూ, కూర ఎక్కువవగానూ తినగలిగేలా కూరలు వండుకుని తింటే కేన్సరు నివారణ సాధ్యమేనంటున్నారు శాస్తవ్రేత్తలు.
బ్రూకింగ్స్‌లోని దక్షిణ డకోటా రాష్ట్ర విశ్వవిద్యాలయం శాస్తవ్రేత్తలు తాజాగా చేసిన పరిశోధనా ఫలితాలను జర్నల్ కేన్సర్స్ ప్రకటించగా మెడికల్ న్యూస్ టుడే వెబ్ జర్నల్ దాని వివరాలను తాజా సంచికలో ప్రచురించింది. కూరగాయలలోనూ, పండ్లలోనూ ఉండే ఫ్లావనాయిడ్లు పేగులలో ఉండే ఉపయోగపడే బాక్టీరియాల ద్వారా అత్యంత సూక్ష్మీకరణం చెందించటంవలన ఏర్పడిన సూక్ష్మ జీవ రసాయన ద్రవ్యాలు (మెటబొలైట్స్) పేగు కేన్సరు రాకుండా నివారిస్తాయని దీని సారాంశం. కేన్సర్ కణాల పెరుగుదలను నెమ్మది చేసేందుకు కూడా ఈ మెటబొలైట్స్ ఉపయోగిస్తాని భావిస్తున్నారు. వీటిలో 2, 3, 6- టిహెచ్‌బిఎ అనే మెటబొలైట్స్ గురించి ఇపుడు ఎక్కువ పరిశోధనలు సాగుతున్నాయి. ఎస్‌ఎల్‌సి5ఎ8 అనే ప్రొటీను కేన్సరు కణంలోకి చొచ్చుకుపోయి ఈ మెటబొలైట్సుని అక్కడ వదులుతుంది. వాటివలన కేన్సరు కణం నశిస్తుంది లేదా నెమ్మదిస్తుందని పరిశోధకులు విశే్లషిస్తున్నారు.
దక్షిణ డకోటా రాష్ట్ర విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ అండ్ అలైడ్ హెల్త్ ప్రొఫెషన్స్ విభాగంలో ఆచార్యులుగా వున్న పరిశోధకుడు డా.జయరామ్ భట్ అనే భారతీయుడు చేసిన పరిశోధనలో మనం ఆశ్చర్యపోయే అనేక వస్తావాలు వెలుగుచూస్తున్నాయి.
పెద్దప్రేవుల కోలాన్, మలాశయం నఅ రెండు భాగాలుంటాయి. ఈ రెండింటిలో వచ్చే కేన్సరు వ్యాధిని కోలో రెక్టల్ కేన్సర్ అంటారు. ప్రాణాంతక వ్యాధుల్లో ఇది నాలుగవ స్థానంలోవుంది. ఒక్క అమెరికాలోనే 14 లక్షల పైచిలుకు రోగులు ఈ పేగు కేన్సరు వ్యాధితో మృత్యుముఖంలో ఉన్నారని చెబుతున్నారు. అమెరికన్ సొసైటీ 2018లో చేసిన ఓ సర్వేలో 97,220 మంది కేన్సర్ రోగుల్లో 43,030 మంది కోలో రెక్టల్ కేన్సరుతో బాధపడుతున్నవారేనని నిర్థారించింది.
వ్యాధి వచ్చిన తరువాత కూడా కేన్సరు కణాల పెరుగుదలని నిరోధించటం ద్వారా నేటి మరణాన్ని రేపటికి వాయిదా వేయగలిగే అవకాశాల గూర్చి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.
నిజానికి శాకాహారుల సంఖ్య మొత్తం ప్రపంచ దేశాలలో భారతీయుల్లోనే ఎక్కవ. కానీ కేన్సరు రోగానికి భారతీయులు ఎక్కువ గురికావటానికి ఇక్కడ కూరగాయలను దుర్వినియోగం చేయటం నఅది ముక్‌య కారణం అవుతోంది. తినేది పేరుకు శాకాహారమే గాని, అందులో శాకం (కూరగాయ ముక్కలు) చాలా తక్కువగా ఉంటుంది. గరిటెడు సొరకాయ పులుసు కూరలో రెండో మూడో సొర ముక్కలు, మిగతాదంతా పులుసు లేదా గ్రేవీ వంటుంది. ఈ గ్రేవీలు కేన్సరును పెంచేవేగానీ తగ్గించేవి కాదు. కూరగాయలు మాత్రం చాలినంతగా కడుపులోకి చేరటం లేదు. ఆ చిన్న రహస్యాన్ని అర్థం చేసకుని ఎక్కువ కూర, తక్కువ అన్నంత భోజనం చేసే అలవాటు వలన కేన్సరు వ్యాధి నుండి బయటపడలుగుతాము
కేన్సరు వ్యాధిని తగ్గించటానికి అనేక ఔషధాలు ఉండవచ్చు. కానీ దాన్ని నివారించగలిగే ఔషధంలేదు. నివారణ అనేది రెండు పద్ధతుల్లో జరుగుతుంది. మొదటి కేన్సరు వ్యాధిని తచ్చిపెట్టే ఆహార విహారాలను మానేయటం. ఇది చాలా ముఖ్యమైన ముందుజాగ్రత్త చర్య. కాగా, కేన్సరు వ్యాధికి వ్యతిరకేంగా పనిచేసే ఆహార విహారాలను పాటించటం. ఇది కష్టమైనదైనా శ్రద్ధతో అలవాటు చేసుకోవడం అందరికీ అవసరం.
కోలోరెక్టల్ కేన్సర్ వ్యాధిలో ఇంపార్టెంట్ రిస్క్ ఫాక్టర్స్ ఆహార విహారాలేనని శాస్తవ్రేత్తలు చెబుతోన్నవిషయాన్ని ఆరోగ్యవంతులు పట్టించుకోవటం అవసరం. రెడ్ మీట్ అని అమెరికన్లు ముద్దుగా ఇష్టింగానూ పిలుచుకొనే గొడ్డుమాంసం మితిమీరి తినటం ఈ వ్యాధి రావటానికి గల అనేక కారణాలలోఒకటి. స్తన్యజీవుల మాంసం ఏదైనా ఈ వ్యాధి రావటానకి కారణంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. ‘ఈటింగ్ ఎ లాట్ ఆఫ్ రెడ్ మీట్ ఈజ్ నోన్ టు సిగ్నిఫికెంట్‌లీ ఇన్‌క్రీజ్ ది రిస్క్ ఆఫ్ కోలోరెక్టల్ కేన్సర్’ అని విస్పష్టంగా ప్రకటిస్తున్నారు. పిండిపదార్థాలతో తయారుచేసి బజరులో అమ్మే ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్’ వలన కేన్సరు వ్యాప్తి ఎక్కువవుతోందని కూడా చెబుతున్నారు. ఇక్కడ నేరం మాసానిది కాదు, ఆ మేరకు కూరగాయల వాడకాన్ని మనుషులు కోల్పోతున్నారు కదా! చాలినంతగా కూరగాయల వాడకం లేకపోతే కేన్సరు వ్యాధి అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతుందని ఈ సిద్ధాంతానికి భాష్యం.
ఇలాంటి బజారు తిళ్లు ఏమీ లేని పాత రోజుల్లో కేన్సరు వ్యాప్తి ఇంత ఎక్కువగా లేకపోవటాన్ని గుర్తుచేసుకుంటే నాగరికత పేరుతోనూ, విదేశీ ప్యాకింగులమీద వ్యామోహంతోనూ, మనం కొని తెచ్చుకునే కేన్సరు వ్యధులని అర్థం అవుతుంది. కాలిఫోర్నియాలోని లోమా లిండా విశ్వవిద్యాలయంలో శాకాహార తరహాభోజన విధానం (వెజిటేరియన్ - స్టైల్ డైట్స్- వేగన్) కేన్సరు రిస్కుని సగానికిపైగా తగ్గించగలుగుతాయని నిర్థారించారు.
లాక్టో - ఓవో వెజిటేరియన్ భోజనం అంటే మాంసం లేకుండా పాలు, పెరుగు, మజ్జిగ, గుడ్లు, కూరగాయలు వీటితో మాత్రమేతీసుకునే ఆహారం అని! పెస్కో వెజిటేరియన్ అంటే స్తన్యజీవుల మాంసం కాకుండా, పై శాకాహారానికి అదనంగా చేపలను కూడా తినటం అని! సెమీ వెజిటేరియన్ అంటే పైన చెప్పిన శాకాహారం ప్రధానంగా తీసుకుంటూ, ఎపుడో ఒకసారి సరదాగా మత్స్య మాంసాలు తీసుకోవటం అని! ఈ నాలుగు రకాల భోజనాలు కేన్సరు ప్రమాదాన్ని తగ్గిస్తాయని అమెరికన్ నిపుణులు చెబుతున్నారు.
ఆహార పదార్థాల్లో రంగు విషాలు కలిపి తినటంవలన కేన్సరు పెరుగుతుంది. మంచి రంగు, రుచి, సువాసనలున్న కూరగాయలు, పండ్లను తింటే ఫ్లావనాయిడ్లు, కెరటినాయిడ్లు లాంటి జీవరసాయనాలు కేన్సరు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రంగులున్న కూరలు తినాలేగని కూరల్లో ఉంగులు కలిపి తినకూడదన్నమాట.
మద్యాన్ని, మాంసాన్నీ తీసుకోవటానికి తాము పుట్టినట్లు, వాటిని తీసుకోనివారు చేతకానివారు అయినట్టు మాట్లాడే చాలామందికి ఈ శాస్త్ర నిరూపణలు ఒక కనువిప్పు కావాలి.
కేన్సరు మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేటి కాలంలో శాకాహార ప్రాధాన్యతని ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కేన్సరు వచ్చాక ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు.
*

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com