S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రూకలెన్ని ఉన్నా చారెడు నూకలే గతి

ఒక మంచి మాట వినగలిగే ఓపిక, ఏదైనా మంచి పుస్తకం చదవాలనే కోరిక, తీరిక చాలామందికి తక్కువ. ఉన్నదల్లా ఒకటే- లోకాన్ని కబళించేయాలన్నంత కోరిక. నిజానికి తినటానికి ఉన్నంత ఉత్సాహం వినటానికి ఉండదు. కాల మహిమ కాదు.
సాధారణంగా కనిపించే జీవలక్షణం. ఎండలో తిరిగి బాగా అలిసిపోయిన తర్వాత చెట్టుకింద కాస్సేపు, కాస్త చల్లగాలిలో నిలబడితే కలిగే హాయిలా ఉండేలా శాస్త్రాలు పుట్టుకొచ్చాయి.
వృక్షశాస్త్రం చదువుతారు, జంతుశాస్త్రం ఉంది. ఖగోళ శాస్త్రం ఉంది. ఎనె్నన్నో శాస్త్రాలున్నాయిగానీ శరీరానికి సంబంధించిన శాస్త్రం కూడా ఉందనీ శరీర ధర్మాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అనుకోరు.
మనిషి కోసమే పుట్టిన శాస్త్రాలు, అతన్ని మహనీయునిగా చేయటానికై నిలిచి గమ్మత్తుగా అందకుండా పోతున్నాయేమో అనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు కాని ఒక్కటి మాత్రం నిజం. కాలక్షేపం కోసం పుట్టలేదు శాస్త్రం. అది అక్షర ఖడ్గం. మనస్సుకు పట్టిందా? మనిషిలోని మాలిన్యం తొలగించేస్తుంది. కొత్త ఊపిరి పోయటం శాస్త్రం పని.
అందుకే వేదశాస్త్ర పురాణాగమలాన్నీ మన దేశంలో పుట్టి, మన సంప్రదాయంలో ఒక భాగమై, సాధుజన ప్రవచనాలుగా మిగిలాయి.
మామూలుగా నిత్యం తినేది పృథివీ అన్నం. భూమిలో పుట్టే పదార్థాలతో వండుకుంటాం. రెండోది నీరు కలిపి వండేది జలాన్నం. శబ్దం వినటం కూడా అన్నంతో సమానమే. అదే జలాన్నం. శబ్దాన్నం కూడా ఉంది. అందుకే చూడండి.. మంచి సంగీతం వింటూంటే అసలు ఆకలే పుట్టదు. అలాగే పుస్తకాలు చదవటంవల్ల, ఉపన్యాసాలు వినటంవల్ల కలిగేది జ్ఞానాన్నం. మెదడుకు మేత అనే మాట అందుకే పుట్టింది.
ఏడు రకాల అన్నం తినటంవల్ల ఏర్పడేవి ధాతువులు. ఇవి కూడా ఏడే. మొత్తం వీటిని ఆత్మ నియంత్రిస్తుంది. అందుకే ఆత్మారాముడు, ఆత్మానందం అనే మాటలు పుట్టాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మహర్షులు చెప్పిన మాట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల పరిణామంలోనే ఈశ్వరతత్త్వం మొత్తం ఇమిడి ఉంది. కోశానికి ఆవరణ అని పేరు. యివన్నీ ఆత్మను ఆవరించి ఉంటాయి. శరీర విజ్ఞానం అంత గొప్పది.
గగన పవన గగనానిలతే జోజల భూమయమగు
మృగ ఖగ నగ తరుకోటులతో
సగుణములలో విగుణములలో సతతము
సాధధు త్యాగ రాజార్చితుడిలలో
పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగు తెలుసుకోరె- అన్నాడు త్యాగరాజు.
హరిలోనూ, హరుడిలోనూ (శివుడిలోనూ) సమస్త దేవతలలో, నదుల్లో , అఖిల బ్రహ్మాండంలో, ఆకాశంలో, వాయువులో అగ్నిలో, జలంలో, భూమిలో, పశుపక్ష్యాదుల్లో కొండల్లో, చెట్లలో, సర్వే సర్వత్రా పరమాత్మ వ్యాపించి ఉన్నాడనే అర్థంలో పాడిన కీర్తన. మనం తినే అన్నమే సృష్టికి కారణం. అన్నమే సృష్టి, స్థితి లయలకు మూలం. అన్నహితమే వేదంటే క్రమంగా ఆత్మ ఆ శరీరాన్ని వదిలేస్తుంది.
అతిగా తినటం, అతిగా పడుకోవటం కూడా రోగకారణాలే..
నిత్య జీవితంలో పరిశీలించండి. ఒక చోటకు వెళ్ళాలనుకున్నా, వెంటనే మనసు మారిపోయి విరమించేస్తాం, లేదా మరో చోటకు చేరుతాం. ఆవేశంతో నోటికి వచ్చిన రీతిలో మాట్లాడతారు. ఇంటికి పోయి అయ్యో! ఎందుకు తిట్టానో కదాయని ఏడుస్తారు. యిది కూడా మనం తినే అన్నం ప్రభావమే.
కనిపించినదంతా తినేయాలనీ కనబడ్డ భూభాగం కబ్జా చేసైనా సరే కాజేయాలనుకునే రాబందులు ఎందరు లేరు? అలా అక్రమార్జనతో,, అన్యాయంగా సంపాదించి కూడబెట్టుకున్నదానితో తిన్న తిండివల్ల ఏర్పడే పరిణామం చాలా దారుణంగా ఉంటుందని మనకు చరిత్ర చెప్తూ గుర్తుచేస్తూన్నప్పటికీ బుద్ధుల్లో మార్పు రాకపోతే ఏం ప్రయోజనం? మనం తిన్న అన్నంవల్ల ఏర్పడ్డ ఆత్మారాముడికన్నీ తెలుసు. ఎవరికీ తెలియదని ఎవరూ చూడటలేదనుకుంకటారు. అదే ప్రారబ్ధం. ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా?
ఎదుటివాడికేముంటే అది మనకూ ఉండాలనే కోరిక, వేడుక. అది సాధ్యం కాకపోతే ఒకటే దుఃఖం. లేదనే ఏడుపుతో ఆకలి మందగిస్తుంది. ఆడంబారలు, శారీరక భోగాలు, ధన సంపాదనపై దురాశ అన్నీ కలిపి మరణానికి చేరువ చేస్తాయి.
‘‘నా మనస్సు చంచలమైనది, బలహీనమైనది కానీ! రామా! నీ మనస్సు, నీ చిత్తము నిర్మలమైనది, నిశ్చలమైనది. కాబట్టి నన్ను వదలకుండా గట్టిగా నా చేయి పట్టుకుని నడిపించమని వేడుకున్న త్యాగరాజు వంటి బుద్ధిమంతులీ లోకంలో ఎందరుంటారు?
అడ్డంగా అదుపు లేకుండా సంపాదించేసి, తిన్నకాడికి తినేసి, రోగాలపాలై ఏ వైద్యుడికీ అందనంద సమస్యలు తెచ్చుకుని చివరకు ప్రకృతి వైద్యమంటూ పచ్చి ఆకులు, కూరలు, చిరుధాన్యాలంటూ కడుపు మాడ్చుకునే దుస్థితికి జారిపోయినవారిని గమనిస్తున్నారుగా? అందుకే-
మతిభ్రమస్థితిని కొంత
మన్ను నాకు రాజ్యమని
సతులంతా సుతులంటా సంసారినైతి
గతియై శ్రీ వేంకటేశ కాచితి వింతటిలోనె
ఇతరుడను ఇంతే నీకు ఏమి భాతి నేను?
దైవమా? ఓ దైవమా? నన్ను దయచూడతగదా? దైవమా?
నే వెర్రివాడనైతే, నీవు వెర్రివా’’ యంటాడు పదకవితామహుడైన అన్నమయ్య.
కోట్లాదిమందిలో నిజం తెలుసుకున్న జ్ఞానులు కొందరే. కడుపు నిండితే కాసులతో పనిలేదు. అన్ని తాపత్రయాలూ అందుకేగా! ‘అన్నాద్భవంతి భూతాని’.
మొత్తం ప్రపంచ సృష్టే. అన్నంమీద ఆధారపడిందంటే- శుభ్రంగా, శుద్ధమైన మనసుతో శుచిగా లేని పదార్థంతో శుద్ధమైన మనస్సు ఏర్పడదు కాక ఏర్పడదు.
పాకశుద్ధి లేని భాండం, చిత్తశుద్ధిలేని శివపూజ ఒకటే.
దేశిక తోడి - ఆదితాళం
పల్లవి: రూలు పదివేలున్న చేరెడు
నూకలు గతి గాని మనసా
అ/ప/ కోకలు వెయ్యున్న కట్టు - కొనుట కొకటే గాని ఓ మనసా!
చరణం: ఊరేలిన తాబండుటకు మూడు మూరల తావు గాని
నూరు నక్షణములబ్బిన నోటి కంతగాని
ఏరు నిండి పారిన పాత్రకు తగు నీరు వచ్చుగాని
సార తరుని హరిని త్యాగరాజు.. సన్నుతుని
మరవకే ఓ మనసా రూకలు
కోట్లు గడించినా తినే అన్నం గుప్పెడు మాత్రమే. బీరువా నిండా ఎనే్నసి చీరెలున్నా కట్టుకుతిరిగేదొక్కటే.
మహారాజైనా మామూలు మనిషైనా పడుకునేందుకు కావలసినది మూడు మూరలే. దండిగా ప్రవహించే నది ఉన్నా తీసుకెళ్ళగలిగేది మాత్రం కడివెడే.
ఎంత సంపాదింనా, చిల్లి గవ్వ కూడా తీసుకుపోవయేదంటూ ఏమీ ఉండదు.
సారం లేని విషయాలపై మమకారం పెంచుకుని సుఖపడిన వాడెవడూ లేడనే భావం ఈ కీర్తనలో కనిపిస్తుంది.
త్యాగరాజు తన బాల్యంలో రామభక్తి ధ్యాన తత్పరుడై గోడలమీద రాసుకుని పాన ‘నమో నమో రాఘవాయ’ ఆయన మొట్టమొదటి కీర్తన ‘దేనికతోడి’లోనిదే.

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656