అంతర్నేత్రం
Published Sunday, 12 January 2020సాంకేతిక విప్లవంలో
అణువుగా ఆరంభమై
జగంలోని ప్రతీ అంశాన్ని స్పృశించే
వైజ్ఞానిక ఖడ్గమై
అరచేతిలోనే విశ్వాన్ని దర్శింపచేసే
కరదీపికై
దారి చూపి తీరం చేర్చే
స్నేహ హస్తంలా
అనే్వషణ సేద్యం చేసే పిపాసకుల
దాహార్తి తీరుస్తుంది
ఒంటరితనం ఎరుగనీయకుండా
ఆప్స్తో మనసుకు విందు చేస్తూ
వినోదాలను అందిస్తుంది
ప్రేయసిలా మురిపిస్తుంది
కాలాన్ని మరిపిస్తుంది
అనవసరాల కౌగిట్లో బంధించి
ఊపిరాడనివ్వక
మస్తిష్కాల్ని మలినం చేసి
వ్యసనాల పాలుచేసే
మాయా మశ్చీంద్రి.
యద్భావం తద్భవతై
శ్వాసించే శ్వాసగా
అంతర్లీనంగా అవతరించిన
అంతర్జాలం తానొక కరవాలం
మంచికా చెడుకా?
నిర్ణయం నీదే!
*