సాయం సంధ్య
Published Sunday, 12 January 2020ఓ సాయంత్రం వేళ
చెట్టు కొమ్మల మాటున
తన సహజ తేజంతో అలరారుతూ
ఎర్రని కాంతి కిరణాలు ప్రసరిస్తూ
పడమటి దిక్కున సూర్యుడు
చిరుగాలికి ఆకుల కదలికలు
వాటి నడుమ దోబూచులాడుతూ దినకరుడు
కనువిందు చేసేలా ఆ దృశ్యం
పడమటి సంధ్యారాగం
తన ప్రస్థానం ఈ రోజుకింతేలా
కనుమరుగవుతూ నింగిలో
వెలుగులకు నీవు పొంగిపోవద్దని
చీకట్లకు కృంగిపోవలదని వాటిని
సమానంగా స్వీకరించడమే మేలని
నన్నలా జీవన గమ్యాన్ని చేరుకోమని
ఓ ప్రకృతి పాఠాన్ని ఎరుక పరుస్తూ
బతుకు అర్థాన్ని బోధిస్తున్నట్టు
ఆ నీలాకాశంలో ప్రకాశిస్తూ
నే కన్నార్పక చూస్తుండగనే
నిష్క్రమించాడా ప్రభాకరుడు
ఓ చీకటి ప్రపంచాన్ని సృష్టించి!
*