S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

షిగ్గీ.. సిగ్గు సిగ్గు

పిచ్చి పీక్‌ని దాటేసింది
ఎవరెస్టుని మీరి అంగలేసింది
ఎగిరిందన్న ఆనందం కాదు
గంతులేస్తుందన్న ఆహ్లాదం లేదు
ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే విషాదం
ఫొటోకి దిగిపోవటం
దూసుకెళ్లే కారులోంచి దూకేసి
పరుగెత్తుతూ చేస్తున్న తాండవం
చిత్రవిచిత్ర మానసికతకి పరాకాష్ట
కంచి మేకల ముందు పూనికల నృత్యంలా
పేట్రేగుతున్న యువోన్మాద తకదిమితలన్ని
దేశదేశాల సంస్కృతులను కాలరాస్తున్న రుతువు
వెర్రి వెయ్యి విధాలు
తోక మొలచిన వెర్రి ఇది.. ఒకడు కార్లోంచి దూకేస్తా
డొకడు దూసుకెళ్లే మోటార్‌బైక్ నుంచి
జంప్ చేసి పరుగుదీస్తాడు
మలుపు తిరిగే ట్రైన్ వెనుక
ఒకడి గరక నృత్యం
ఎక్కడికెళుతోంది ప్రపంచం
జీవితాన్ని పణం పెట్టి క్షణక్షణం!
(‘షిగ్గీ’ నడిపే కార్ల నుండి బైక్ మోటార్ల పైనుండి నడిచే రైళ్ల నుండి అమాంతం క్రిందికి దూకి వాటితోపాటు చేసే వింత దృశ్యం.)

-గుర్రాల రమణయ్య 9963921943