S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఖగోళ సత్యానే్వషణ

...కాలం గుప్పిట్లోకి జారుకోకూడదు...
శని అంటే కాలానికి కళ్లెం వేసేవాడు... కాలాన్ని దాటిన వాడు. అందుకే కాలాతీతం కావాలనుకునే యోగులకు శని ఆప్తుడు. శనిని సాధనతో స్నేహించగలిగితే కాలజ్ఞానం యోగుల సొంతమే. అంటే యోగ సాధకులు కాలజ్ఞానులైపోవటమే.
అసలు యోగసాధకుల దృష్టి తమ మూలాలను, మూలాన్ని చేరుకోవటం. మూలం నుండి బయలుదేరిన మన అంశ జ్యోతిర్మండలాన్ని దాటి, గ్రహ మండలాలను దాటుకుని, ఆయా మండలాలలో మన అంశను చేరిన ఆ ఖగోళధూళితో భూగర్భాన్ని చేరుకోవటంతో మానవజన్మ ప్రారంభమవుతోంది. అలా ఖగోళ ప్రభావాలకు మానవ జీవితం లోనవుతోంది.
ఈ ఖగోళ గ్రహ ప్రభావాలలో శని ప్రభావం దాదాపు సగం. కాబట్టి సమస్యల పరిష్కారంలో శని ప్రాతినిథ్యమే ఎక్కువ. ఇలా కాలం గుప్పిట్లోకి జారుకోకుండా కాలానికి అతీతం కావటంపై యోగసాధకుల దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది.
మనకు కావలసింది ఏమిటి? కోరుకుంటున్నది ఏమిటి?
అవసరానికి మించి కోరుకోవటం మానవ నైజం. ఇలా మించి కోరుకుంటున్నప్పుడు శని మనల్ని నెమ్మదింపజేస్తుంటాడు...
అయినా తొందరపడితే ప్రతికూలతా తొందరపడుతుంది. ఆశించిన ఫలితం మనకు అంది రాదు. అంటే వేచి ఉండగలవారినే విజయం వరిస్తుంది. అందరికంటే నెమ్మదస్తులు యోగసాధకులై ఉంటారు కాబట్టి వారికే శని మరింత దగ్గరవుతుంటాడు. శనికి సమీపం కావటం అంటే కాల ప్రభంజనానికి అతీతం అవుతుండటమే... విశ్వమూలాలకు చేరుకుంటుండటమే... మన మూలాలకు చేరుతుండటమే. మన పరిసరాల నుండి, మన విశ్వం నుండి శక్తిని చేదుకోవటానికి మార్గం చూపేవాడు శని. శక్తి చేరిన చోటికే జ్ఞానమూ చేరుతుంది. ఇలా శక్తీ జ్ఞానమూ చేరిన కేంద్రం ఆరవచక్ర స్థానం. అది శని స్థానం. అక్కడ అందేది అతీత మానసానందం, బ్రహ్మానందం.
విశ్వ రహస్యాలను విప్పేది శని
విశ్వ రహస్యాలను అందుకోవటానికి ఎంత ఓర్పు కావాలి... ఎంతటి నిరీక్షణ... ఎంత సహనం...ఎంతటి సాధన. ఇన్ని లక్షణాలు మన వ్యక్తిత్వంలో, తత్వంలో చోటుచేసుకోవాలంటే శని మనతో సహకరించాల్సిందే. మనం ఉన్నది విశ్వంలోని భూగోళంలో ఓ మూలన... చిరుజీవంగా అయితేనేం బుద్ధిబలం ఉందిగా... అది చాలు. అది శని చలవవల్లే మనకి సంక్రమించింది. మనకు అందుబాటులో ఉన్న కాలాన్ని, మనకు తెలిసిన యోగసాధనతో ముడిపెడితే సరి మనం కాలాతీతులమై విశ్వాన్ని ఆక్రమించగలుగుతాం. విశ్వాత్మ అవుతాం.
అంటే మాస్టర్ యోగ సాధనతో కాలం వ్యాపిస్తుంది. దీనే్న మనం జౄళ ఉనఔ్ఘశజూ అంటున్నాం. ఫలితం కాలానికి అతీతం కావటం. ఈ కాలాతీతతతో శని మనలను సృష్టి మూలాలకు చేరుస్తాడు... అంటే కాలమే లేని, సృష్టి ప్రారంభం కాని ‘ఆదిమా’నికి చేరతామన్న మాట. అది శూన్యం. జ యోశళ యోఆ జళ్పళ అంటే అక్కడ శూన్యం తప్ప మరొకటి ఏదీ లేనిది. అదే బ్రహ్మాండం. అక్కడి నుండి పుట్టుకొచ్చింది ఖగోళం. నక్షత్ర మండలాలు గ్రహ మండలాలు, గ్రహ మండలాలు. శక్తి - ఉశళూక వాయువు - ఉఆ్దళూ, సాంధ్రశక్తి - యూషళ, కాంతి - జజదఆ, కాలం - జౄళ... ఇత్యాధుల ఉనికి. వీటి అవతర రహాస్యాలు తెలియాలంటే తొలిగా మొదటి చక్రంలో ఉన్న శనితో స్నేహించటం మొదలుపెడితే శని అపార దృష్టితో ఆరవ చక్రాన్ని చేరుకుని ఖగోళ శక్తులను చేదుకోగలం.
ఆరవ చక్ర శక్తిపాతంతో ఈ విశ్వరహస్యాలు యోగసాధనలో మన ముందుకొస్తుంటాయి. అంటే ఆరవ చక్రభ్రమణంతో సానుకూల ప్రతికూల అనే భావవలయాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. చీకటి, వెలుగు అనే ద్వంద్వాలు కరిగిపోతాయి. ఇలా ద్వంద్వాలకు అతీతం కావటమే కదా యోగం.
ఇంతకీ కాలాతీతం మనలోనిదే
డ్ఘఆఖూశ ఇ్యజశ ఆ్దళ ఉ్ఘఆ్ద అన్నధి మాస్టర్ యోగ సాధన. అంటే శని భూమిని తొలుచుకుంటూ పోవటమని కాదు. శని మనలోకి మనం ప్రవేశించేలా, ప్రవహించేలా చేస్తుంది. మన దేహమే ఒక వాయుగోళం. ఉఆ్దళూజష జ్యీజూ అవుతుంది. ఉఆ్దళూ జ్యీర్యీఖఆ అంటే ఇదే. ఆ ప్రవేశంతో విశ్వ రహస్యాలు ఒక్కొక్కటిగా మన నుండే వెలికి వస్తాయి. ళజూషఖౄచిళూళశషళ ఒజజూళత్ఘీకఒ ౄజళూ చ్యిౄ ళళశఆళఒ ౄళళఆ ళళశఆళ అంటే ఇదే. అక్కడిదంతా సత్యభాసురమే. యోగపరమైన ఈ ఆత్మవిచారణా పరిణామంలో శని మన సహచరుడవుతుంటాడు.
అన్నట్లు, శని యోగసాధకులను ఆరవ చక్రానికి చేరుస్తుంటే సామాన్యులకు మొదటి చక్రంలో ఉంటాడు. అందుకే సామాన్యులు భౌతిక జీవనంలో సైతం భయపడుతుంటే మహాత్ములు భౌతికాన్ని లెక్క చేయక అధిభౌతిక జీవితంపై అనాయాసంగా దృష్టిపెడుతుంటారు.
సామాన్యులు శనిని చెడుగ్రహంగా పరిగణిస్తుంటే యోగులు, మహాత్ములు డ్ఘజశఆక -్ఘశళఆ, డఔజూజఆఖ్ఘ -్ఘశళఆగా పరిగణిస్తుంటారు.
శనికి యోగసాధకులన్నా, తపస్సంపన్నులన్నా, ధ్యానమగ్నులన్నా, సాధువులన్నా ఇష్టం. అణతర్ముఖీనత వీరందరికీ ఇష్టం కాబట్టి శని దృష్టి వీరిపై అత్యంత అనుకూలంగా పడుతుంది. శనిది వాయుతత్వం... యోగుల యాస్ట్రల్ ట్రావెల్‌కి కావల్సింది ఆ వాయుతత్వమే. విశ్వ రహస్యాలు వెల్లడయ్యేది ఈథరిక్ ట్రావెల్ వల్లనే.
శని మార్గదర్శకత్వంలోని ఆత్మ దర్శనం
శనిని అనుసరిస్తూ శనితో స్నేహిస్తుంటే చాలు ఖగోళ సత్యాలు మన గిక వాకిలిని చేరతారు. అయితే కొన్ని ఆంక్షలను, ఇంకొన్ని ఆటంకాలను, కొంత అశాంతిని, ఇంకొంత భ్రాంతిని కలుగజేసి మన వాకిట ఆ ఖగోళ రహస్యాలను విప్పదు. శని ఏర్పరిచే ఈ అవరోధాలకు కారణం సాధకుల పట్టుదలతో తనలోకి తానుగా చొచ్చుకుపోవటానికి పదార్థ జగతికి భిన్నంగా మన ఆత్మ జగత్తును మనకు మనంగా గుర్తించటానికే. నిజానికి మన ఆత్మ జగత్తు సత్యలోకమే. అందుకే ఈ పదార్థ జగతి నీడ కూడా సోకని అంతరంగంలో తిష్ట వేసుకుని ఉంటుంది. భౌతికంగా ప్రోదిపడే కర్మలు రహితం కావాలంటే శని మనల్ని ఒక పట్టు పట్టాల్సిందే. అంటే శని మన కష్టాన్ని గుర్తించి తగిన ఫలితాన్ని అందిస్తాడు. ఆ ఫలితాలను సరైన రీతిన అర్థం చేసుకోగలిగితే మన బాట ఆత్మదర్శనం దిశగా నడిపిస్తుంది. అలా భౌతిక జీవితంపై ఆసక్తి తగ్గటానికి శని కారకుడవుతాడు.

-విశ్వర్షి 93939 33946