S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (1.3.2020 నుంచి 7.3.2020 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో కుటుంబ, బంధువర్గ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. నిల్వధనంపై దృష్టి. మాట విలువ పెరుగుతుంది. అధికారిక ప్రయోజనాలు. పెద్దల సపోర్ట్ ఉంటుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించడంలో కొంత ఘర్షణ. దూర ప్రయాణాలపై దృష్టి ఉన్నా సఫలీకృతం కావు. కొంత అసంతృప్తి. వారం మధ్యమంలో సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం కోసం ప్రయత్నం. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే అవకాశం. మీడియా రంగంలోని వారికి సమస్యలు. పరిశోధనలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. దైవ ధార్మిక కార్యక్రమాలు ప్రభావితం చేస్తాయి. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వారాంతంలో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. బాధ్యతలు విస్తరిస్తాయి. గుర్తింపు. గౌరవాదులు లభ్యం. వృత్తి ఉద్యోగాదుల్లో పదోన్నతులుంటాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. పితృవర్గ వ్యవహారాల్లో సంతృప్తి. సంప్రదింపులకు అనుకూలం. నిర్ణయాదుల్లో కొన్ని ఇబ్బందులుంటాయి. తొందరపాటు కూడదు. వారం మధ్యమంలో కుటుంబానుబంధాల్లో జాగ్రత్త. నిల్వధనం కోల్పోయే అవకాశం. మాటల్లో అనిశ్చితి ఉంటుంది. బ్యాంకు కార్యకలాపాల్లో జాగ్రత్త అవసరం. వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించాలి. పెద్దలతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. కొన్ని అనుకోని ఇబ్బందులకు అవకాశం. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. సేవక వర్గంతో అనుకూలత ఏర్పడుతుంది.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులుంటాయి. విహారాలు, విందులకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో సంతోషం. విశ్రాంతి లభిస్తుంది. ఉన్నత వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. లక్ష్యాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. భాగస్వామ్యాల్లో ఖర్చులు అధికం. తొందరపాటు కూడదు. వారం మధ్యమంలో నిర్ణయాదులు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఆత్మవిశ్వాసం తగ్గిపోయే సూచనలు. సలహాలు సంప్రదింపుల వల్ల మేలు కలుగుతుంది. గుర్తింపు, గౌరవాలు తగ్గే సూచనలు. పరిచయాలు, స్నేహానుబంధాల వల్ల అనుకూలత. దైవ, ధర్మకార్యాల వల్ల సంతృప్తి. ప్రయాణాలుంటాయి. వారాంతంలో మాట విలువ పెంచుకుంటారు. కుటుంబంలో శుభ పరిణామాలు. ఆర్థిక నిల్వలపై దృష్టి.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతృప్తినిస్తాయి. కొత్త పనులపై దృష్టి. పై అధికారుల వల్ల వచ్చే సమస్యలను జాగ్రత్తగా ఎదుర్కొంటారు. ఆరోగ్య లోపాలను అధిగమించాలి. నిర్ణయాదులు ప్రాధాన్యం వహిస్తాయి. పోటీలు, వ్యతిరేకతలున్నా గుర్తింపు, గౌరవాదులు లభిస్తాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వారం మధ్యమంలో వ్యర్థమైన ప్రయాణాలకు, ఖర్చులకు అవకాశం. కాలం ధనం కోల్పోవచ్చు. విశ్రాంతి లోపం ఉంటుంది. పెట్టుబడుల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. పోటీ రంగంలోనూ ఖర్చులు అధికం. వ్యితిరేకతలు తప్పకపోవచ్చు. విహారాలు, విందులు సంతోషాన్నిస్తాయి. వారాంతంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. గుర్తింపు, గౌరవాదులు లభిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. పితృవర్గ వ్యవహారాల్లో అనుకూలత. పదోన్నతులు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులను అధిగమిస్తారు. ఖర్చులు పెట్టుబడుల్లో సంతోషం. విందులు, విహారాలుంటాయి. సంతానవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. వారం మధ్యమంలో వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలను ఆశిస్తారు. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాలి. శ్రమ రహిత లాభాలపై దృష్టి ఉంటుంది. ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. కొత్త పనులపై దృష్టి. తొందరపాటు లేకుండా దైవ ధ్యానంతో ప్రవర్తించాలి. వారాంతంలో ఖర్చులు, పెట్టుబడులు అధికవౌతాయి.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణలో సంతోషం. గుర్తింపు, కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. శ్రమతో కార్యనిర్వహణ. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. ఆహార విహారాలపై దృష్టి. విద్యారంగంలో శ్రమతో ఫలితాలు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం. వేరు వేరు బాధ్యతలను ఒకేసారి నిర్వహించాల్సి వస్తుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. గృహ వాహనాదుల విషయంలో మంచి నిర్ణయాలు. మాతృవర్గ వ్యవహారాలపై దృష్టి. వారాంతంలో ప్రయోజనాలపై దృష్టి. లాభాలను ఆశించినా కొంత ఒత్తిడి తప్పదు.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలు. అనారోగ్య లోపాలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. ఊహించని సంఘటనలుంటాయి. సంతానవర్గంతో సమస్యలు. ప్రణాళికలు ఇబ్బంది పెట్టే అవకాశం. ఆలోచనల్లో ఒత్తిడులు. వృత్తిపరమైన ఇబ్బందులు. సంప్రదింపుల్లో అప్రమత్తంగా మెలగాలి. సోదర వర్గంతో ఒత్తిడులకు అవకాశం. వారం మధ్యమంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్య సాధనపై దృష్టి. సుదూర ప్రయాణావకాశాలు. కొంత అసంతృప్తి. దుర్గా ధ్యానం వల్ల మేలు. పెద్దలతో సంప్రదింపులు. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం. వైజ్ఞానిక పరిశోధనలపై ప్రత్యేక దృష్టి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో ఫలితాలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. పాతమిత్రుల కలయిక. సౌకర్యాలు కొంత శ్రమకు గురి చేయవచ్చు. ఆహార విహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు కూడదు. ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాటల్లో కొంత జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సమస్యలకు అవకాశం. కాలం ధనం వ్యర్థం అయ్యే సూచనలు. తొందరపాటు నిర్ణయాలు కూడదు. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయాలి. పెద్దలతో జాగ్రత్త. ఆర్థిక నిల్వలు కోల్పోవచ్చు. వారాంతంలో కొత్త పనులపై దృష్టి. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడులను అధిగమించాలి. కాంపిటీషన్స్‌పై దృష్టి, పోటీ రంగంలో గుర్తింపు కలుగుతుంది. శ్రమ ఉన్నా ఫలితాలుంటాయి. అధికారులతో సంప్రదింపులకు అనుకూలం. కొన్ని అనుకోని సమస్యలున్నా అధిగమిస్తారు. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త. తొందరపాటు కూడదు. దైవధ్యానం వల్ల మరింత మేలు కలుగుతుంది. వారం మధ్యమంలో పరిచయాలు, స్నేహానుబంధాలు పెరుగుతాయి. సమయం, ధనం కోల్పోకుండా చూసుకోవాలి. కొందరి పరిచయం ఇబ్బందికరంగా ఉంటుంది. నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. గౌరవం పెరుగుతుంది. ప్రయాణావకాశాలు. వారాంతంలో కొన్ని సమస్యలు తప్పవు. ఊహించని సంఘటనలుంటాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతృప్తి. క్రియేటివిటీ పెంచుకుంటారు. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. భాగస్వామ్యాల్లో సంతృప్తి. ఖర్చులు పెట్టుబడులు అధికమైనా ఫలితాలు సంతోషం. విశ్రాంతి లోపానికి అవకాశం. వారం మధ్యమంలో పోటీలు ఒత్తిడులు చికాకులున్నా విజయం సాధిస్తారు. శ్రమాధిక్యం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. కాంపిటీషన్స్‌ను ఎదుర్కొంటారు. కొంత సమయం వ్యర్థం కావచ్చు. దైవ, ధర్మ కార్యక్రమాలకు దానం చేయడం వల్ల మరింత మేలు కలుగుతుంది. విహార యాత్రలకు అవకాశం అధికం. వారాంతంలో పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొంత బద్ధకం తగ్గించుకోవాలి.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలకు అనుకూలం. సౌకర్యాలు, సౌఖ్యం పెరుగుతాయి. గృహ వాహనాదులపై దృష్టి ఉంటుంది. నిర్ణయాదుల్లో ఒత్తిడులు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. అధికారిక వ్యవహారాల్లో ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు. వ్యతిరేకతలకు అవకాశం. అధికమైన ప్రయోజనాలు కోరుకుంటారు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికలు అనుకున్న విధంగా సాగకపోవచ్చు. సంతాన వ్యవహారాల్లో జాగ్రత్త. ఆందోళనలకు దూరంగా ఉండాలి. దైవారాధన, ఉపాసనల వల్ల మేలు కలుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనులపై దృష్టి. వారాంతంలో పోటీలు ఒత్తిడులకు అవకాశం. శత్రువులపై విజయం. కాంపిటీషన్స్ వైపు దృష్టి. రుణాదులను అధిగమిస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మీడియా రంగంలోని వారికి అనుకూలత. అధికారికమైన ఖర్చులు, ప్రయాణాలు. విశ్రాంతి లోపానికి అవకాశం. సంతాన వర్గంపై దృష్టి. ప్లానింగ్ ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి ఉన్నా గుర్తింపు, గౌరవాదులు పెరుగుతాయి. వారం మధ్యమంలో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల్లో జాగ్రత్త. ఆశించిన సంతోషం అందకపోవచ్చు. సౌఖ్యం కోసం ప్రయత్నం. విందులు వినోదాల్లో పాల్గొంటారు. విహారాలున్నా అప్రమత్తంగానే ఉండాలి. అధికారిక ప్రదేశాల్లో గుర్తింపు. సామాజిక గౌరవం పెరుగుతుంది. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. అన్ని పనుల్లోనూ సంతోషం. లాభాలు సంతృప్తిని ఇస్తాయి.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ