S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సామర్థ్యం

ఒక అడవిలో ఒక పులి, నక్కా స్నేహంగా ఉండేవి. పులి తన వాడియైన గోళ్లతో, పొడవైన కోరలతో జంతువులను వేటాడేది. వేటాడిన జంతువులలో కొంత భాగం నక్కకు ఇచ్చేది. యజమానురాలు పులి తనకు ఇస్తున్న ఆహారానికి ప్రతిఫలంగా నక్క పులి గుహను శుభ్రపరిచేది.
ఇలా కొన్నాళ్లు గడిచాయి. పులి ముసలిది అయింది. దానికి వేటాడే శక్తి నశించింది. పైగా ముసలితనం వల్ల దానికి చూపు సరిగా ఆనటం లేదు. ఆహారం లేకపోవటం వల్ల పులి మరింత నీరసపడిపోయింది. అప్పుడు నక్కతో పులి ఇలా అంది. ‘‘మిత్రమా! ఇన్నాళ్లు నేను వేటాడి నిన్ను పోషించాను. నేను ముసలిదాన్ని అయ్యాను. పరిగెత్తి, తరిమి, జంతువులను వేటాడే శక్తి పోయింది. చూపు మందగించింది. ఏదైనా జంతువు మరీ దగ్గరగా వస్తే తప్ప కనబడటం లేదు. అందుకని ఇవాళ నుండి వేటాడటం నీ వంతు’’ అంది.
నక్క ఏమీ మాట్లాడలేదు. పులి చెప్పిన మాటల్లో దానికి యదార్థమే కనిపించింది. పైపెచ్చూ రోజురోజుకీ వేటాడి తెచ్చే ఆహారం తగ్గిపోవటం వల్ల నక్క కూడా ఎన్నో రాత్రుళ్లు పస్తులు పడుకోవాల్సి వస్తున్నది. నీరసించిపోతున్నది. అయితే ఇన్నాళ్లూ పులిపై ఆధారపడటం వల్ల దానికి బద్దకం పెరిగిపోయింది. కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఆహారం సంపాదించటం ఎలాగా? అనుకుంటూ గుహ ముందు కూర్చుంది.
అటువేపు నుండి పోతోన్న ఒక ఏనుగు నక్క కంట బడింది. ఏనుగును చూడగానే నక్కకు నోరూరింది. ఏనుగు భారీ జంతువు. కనుక ఏనుగును వేటాడితే.. తనూ, తన యజమాని రోజుల తరబడి ఆహారం గురించి వెదుక్కోనవసరం లేకుండా కాలం గడపవచ్చనుకుంది. వేటాడ్డం ఎలాగో తెలియని నక్క, పులిలాగే ఎగిరి ఏనుగు గొంతును నోట కరచి పట్టుకుంది. అల్ప జీవియైన నక్క అకస్మాత్తుగా తన గొంతు పట్టుకోవడం వల్ల ఏనుగుకు చిరాకు కలిగింది.
కోపంతో ఘీంకారం చేసింది. పొడవైన తన తొండంతో నక్కను ఒడిసిపట్టుకుంది. అలా పట్టుకుని గాల్లోకి ఎత్తి నేలకు బాదింది. నేల మీద పడ్డ నక్క ‘‘కుయ్యో...మొర్రో’’ అంటూ లేవటానికి ప్రయత్నం చేసింది. లేవలేకపోయింది. ఏనుగు నక్కను తన ముందుకాలితో తొక్కి పచ్చడి చేసింది.
(నీతి: తన సామర్థ్యం గ్రహించక తలపడితే చేటు తప్పదు)

-కూర చిదంబరం 8639338675