వారం వారం గోచారం (8.3.2020 నుంచి 14.3.2020 వరకు)
Published Sunday, 8 March 2020మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో సంతాన సంబంధమైన ఆలోచనలకు అవకాశం. క్రియేటివిటీ పెంచుకుంటారు. ప్రణాళికలకు అవకాశం ఉంటుంది. ఉన్నత లక్ష్యాలను సాధించడంలో కొంత అసంతృప్తి. ఆథ్యాత్మిక యాత్రలకు అనుకూలం. నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విందులు, విహారాలు ఉంటాయి. బాధ్యతలను సునాయాసంగా నిర్వహిస్తారు. వార మధ్యమంలో వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలు. సౌకర్యాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. కొంత అసంతృప్తి ఉంటుంది. సుదూర ప్రయాణాదుల్లో జాగ్రత్త వహించాలి. కీర్తి ప్రతిష్టల కోసం శ్రమించాలి. వారాంతంలో భాగస్వామ్యాల్లో అనుకూలత.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాల విషయంలో అనుకూలత. కృషితో విద్యారంగంలో మంచి ఫలితాలు. శ్రమాధిక్యం. అనుకోని సమస్యలుంటాయి. కొన్ని చికాకులను అధిగమించాలి. విందులు, విలాసాల కోసం కాలం, ధనం వెచ్చిస్తారు. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విశ్రాంతి లభిస్తుంది. వార మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త పనులపై పదోన్నతులు. సంప్రదింపుల్లో శుభ పరిణామాలు. వారాంతంలో వ్యతిరేకతలు తప్పకపోవచ్చు. పోటీలు, ఒత్తిడులు అధికం. కాంపిటీషన్స్‌లో విజయం. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా మెలగాలి. మాటల్లో తొందరపాటు కూడదు. గౌరవ లోపం జరుగకుండా చూసుకోవాలి. చికాకులను అధిగమించాల్సి వస్తుంది.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆథ్యాత్మిక యాత్రలకు అనుకూలం. సోదరవర్గంతో సన్నిహిత సంబంధాలుంటాయి. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు, అభినందనలు లభిస్తాయి. వారం మధ్యమంలో సౌకర్యాలు, సౌఖ్యంపై దృష్టి. ఆహార విహారాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. విద్యారంగంలోని వారికి శ్రమతో ఫలితాలుంటాయి. ఉన్నత లక్ష్యాలను సాధించడంలోనూ కొంత శ్రమ ఉంటుంది. కీర్తి ప్రతిష్టల కోసం ప్రయత్నిస్తారు. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభపరిణామాలుంటాయి. పరిచయాలు, స్నేహనుబంధాల్లో కొంత జాగ్రత్త అవసరం. వారాంతంలో క్రియేటివిటీ పెరుగుతుంది. కాంట్రాక్టు వ్యవహారాలు లాభిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో సంతోషం. బంధువర్గ వ్యవహారాలు తెరపైకి వస్తాయి. నిల్వధనం పెంచుకుంటారు. మాట విలువ పెరుగుతుంది. పోటీ రంగంలో కొంత జాగ్రత్త. విమర్శలకు అవకాశం. నిరాశ. వృత్తి ఉద్యోగాదుల్లో శుభఫలితాలు. పదోన్నతులు, సంతోషం. సామాజిక గౌరవం పెరుగుతుంది. వార మధ్యమంలో వ్యాపారవర్గ సహకారం కోసం ప్రయత్నం. ప్రయాణాలకు అవకాశం. సోదరులతో సంప్రదింపులుంటాయి. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. కొంత ఆరోగ్య లోపం. నిర్ణయాదుల్లో సంతోషం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. వ్యతిరేకతలు తప్పకున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమాధిక్యం. వారాంతంలో ఆహారంపై దృష్టి. విందులు వినోదాదులు ప్రభావితం చేస్తాయి. సౌకర్యాలు సమకూర్చుకుంటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచనల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని ఫలితాలు మాత్రం నిరాశకు గురి చేయవచ్చు. బాధ్యతలు విస్తరిస్తాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సుదూర ప్రయాణాదులకు ప్రణాళిక. వారం మధ్యమంలో మాటల్లో ఆకర్షణ, చమత్కారం ఉంటాయి. నిల్వధనం పెంచుకునే మార్గాలు. కుటుంబంలో సంతోషం, పరిచయాలు, స్నేహానుబంధాల్లో కొంత జాగ్రత్త. అధికారుల పరిచయం కలుగుతుంది. విశ్రాంతిగా గడిపే అవకాశం కూడా కలుగుతుంది. ప్రణాళికాబద్ధంగా మెలిగే ప్రయత్నం. క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. వారాంతంలో సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలకు అవకాశం.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు, పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాలకు అవకాశం. సౌకర్యాలు మధ్యలో శ్రమకు గురిచేసే అవకాశం. ముందు జాగత్త అవసరం. కొన్ని కాంట్రాక్టు వ్యవహారాల్లోనూ చికాకులుంటాయి. అనుకోని ఇబ్బందులు. స్ర్తిలతో జాగ్రత్తగా మెలగాలి. వారం మధ్యమంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. పోటీలు, ఒత్తిడులు తప్పవు. శ్రమతో కార్యాలుంటాయి. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలు లభిస్తాయి. సౌకర్యాలు, సౌఖ్యం విషయంలో తొందరపాటు కూడదు. ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. మాటల్లో శుభపరిణామాలు. ఆర్థిక నిల్వలు పెంచుకునే అవకాశం.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. పెద్దల అనుకూలత. లాభాలు సంతోషాన్నిస్తాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. దైవదర్శనాదులకు ప్రయాణాలు. సహకారం లభిస్తుంది. భాగస్వామ్యాల్లో శుభపరిణామాలు. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం. సంతోషంగా గడుపుతారు. వారం మధ్యమంలో ఖర్చులు అధికమవుతాయి. విందులు, వినోదాలు, విహారాలకు అవకాశం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. ఆలోచనల్లో కొంత ఒత్తిడి. సంతాన వర్గ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో ఫలితాలుంటాయి. సోదరవర్గంతో సంప్రదింపులున్నా కొంత ముందుజాగ్రత్త అవసరం. వారాంతంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మ విశ్వాసం పెంచుకునే సూచనలు. సుదూర ప్రయాణ భావనలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులకు అనుకూలం. అధికారిక వ్యవహారాలపై దృష్టి. సామాజిక హోదా పెంచుకుంటారు. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి. పదోన్నతులకు అవకాశం. మాటల్లో కొంత నిరాశ. నిల్వధనం తగ్గే సూచనలు. వ్యతిరేకతలపై విజయం. పోటీలు, ఒత్తిడులను అధిగమించాలి. శ్రమ ఉన్నా గుర్తింపు పెరుగుతుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి, లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త వహించాలి. సౌఖ్య లోపం. సుదూర ప్రయాణాలు, నూతన పరిశోధనలు, లక్ష్య సాధనలపై దృష్టి. మాటల్లో తొందరపాటు కూడదు. ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో ఖర్చులు, పెట్టుబడులకు అవకాశం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి, కీర్తి ప్రతిష్టలు ప్రభావితం చేస్తాయి. లక్ష్యాల సాధనలో కొంత శ్రమ. పరిశోధనలపై దృష్టి ఉన్నా కొంత ఏకాగ్రత అవసరం. ఆలోచనలకు రూపకల్పన. స్ర్తి సంతానం గూర్చిన ఆలోచనలుంటాయి. క్రియేటివిటీతో కార్యనిర్వహణ. సంకల్పాలకు రూపకల్పన. వారం మధ్యమంలో వృత్తి, ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాదుల్లో సంతృప్తి. అధికారిక సంప్రదింపులు తప్పకపోవచ్చు. పెద్దల సహకారం లభిస్తుంది. కొన్ని అనుకోని సమస్యలున్నా అధిగమిస్తారు. నిర్ణయాదుల్లో తొందరపాటు కూడదు. వౌనంగా, ప్రశాంతంగా గడపాల్సి ఉంటుంది. వారాంతం అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. వేరు వేరు రూపాల్లో లాభాలను ఆశిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య భావాలు. చికాకులుంటాయి. కాలం, ధనం కోల్పోయే అవకాశం. ఖర్చులు అధికం. నిరాశ, ప్రయాణాదుల్లో ఒత్తిడులు. విశ్రాంతి లోపం. సౌకర్యాలున్నా ఆశించిన సంతోషం ఉండకపోవచ్చు. శ్రమాధిక్యం. గృహ, వాహనాదులు, ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. పరిశోధన, ప్రయాణాలు ప్రభావితం చేస్తాయి. లక్ష్యాల సాధన కోసం ఆలోచనలు. సంతృప్తి. కుటుంబంలో కొంత ఒత్తిడి, ఆర్థిక నిల్వల గూర్చిన ఆందోళన. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యర్థమైన ప్రయాణాలు. విశ్రాంతి లోపం. పరామర్శలకు అవకాశం అధికం. వారాంతంలో వృత్తి, ఉద్యోగాదుల్లో శ్రమ. అధికారిక వ్యవహారాలు తప్పక పోవచ్చు.
కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, అనుబంధాలు పెంచుకుంటారు. శ్రమాధిక్యం. ఆశించిన లాభాలు అందక కొంత నిరాశగా ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలత. సొదరీమణులతో అనుబంధాలు విస్తరిస్తాయి. స్ర్తి వర్గ సహకారం లభిస్తుంది. ప్రయాణాలకు అవకాశం. వారం మధ్యమంలో అనుకోని సమస్యలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపార లోపాలకు అవకాశం. నిర్ణయాదులు సమీక్షించుకోవాలి. బాధ్యతలు అధికం. శ్రమతో కార్యక్రమాలు. వ్యతిరేక ప్రభావాలు తప్పవు. ఆశించిన ప్రయోజనాలు నెరవేరకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. దానధర్మాల వల్ల మేలు. వారాంతంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. పరిశోధనలు వెలుగు చూస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీ రంగంలో మంచి గుర్తింపు. విజయం సాధిస్తారు. శ్రమ ఉన్నా ఫలితాలుంటాయి. వృత్తిలో కొంత ఒత్తిడి. అధికారిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. మాటల్లో చమత్కార ధోరణి. వేరు వేరు కాంట్రాక్టు వ్యవహారాలపై దృష్టి. నిల్వధనం పెంచుకుంటారు. వారం మధ్యమంలో భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాల్లోనూ పరిచయాలు పెంచుకుంటారు. అధికారిక ప్రయాణాలు, ఖర్చులు తప్పకపోవచ్చు. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత శ్రమ ఉంటుంది. పనిచేసే ప్రదేశాల్లో గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. వారాంతంలో అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. వేరు వేరు సమస్యలుంటాయి.