S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అయ్యో! తెలుగా..!

గడచిన తరం సాహిత్య మహా మనుషులతో, సర్వంకష సారస్వత ప్రతి భాగరాయుసులలో ప్రాతః స్మరణీయులు విపుల ప్రజ్ఞ్ధారీణులు అయిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్ర్తీ మహోదయలు తెలుగు భాషా సర్వతోముఖ వికాసాన్ని ఆశిస్తూ ఇట్లా స్వస్తి వచనం పలికారు.
‘‘తెలుగు అధికార భాష కాక తప్పదనీ, కోర్టులలో, కార్యాలయాలలో సమస్త రాజకీయ వైజ్ఞానిక విషయాలలో తెలుగు రావాలని 1945లో తిరుపతి ఓరియంటల్ కళాశాల వజ్రోత్సవములలో వారు తమ భావములను నిర్నిబంధముగా వెల్లడించినారు. ఆనాటి సభా వేదికపై నున్న వైస్రాయి కౌన్సిల్ సభ్యులు శ్రీ ఆర్కాటు రామస్వామి మొదలియారు. మదరాసు విశ్వవిద్యాలయోపాధ్యక్షులు శ్రీ ఆర్కాటు లక్ష్మణ స్వామి మొదలియారు గారు తమ హర్షామోదములను ప్రకటించారు. (అద్యాపకులలో అమృత మూర్తులు శ్రీ పోచిరాజు శేషగిరిరావు, పుట4-2010) అయ్యోరామా ఈ పుస్తకం ప్రచురణ అయి ఒక దశాబ్దము, పూజ్యపాదులు శ్రీ ప్రభాకరశాస్ర్తీగారు ఆ శిషములు పలికి 75 ఏళ్లు అప్పుడే గడచిపోయాయి. తెలుగు అదృష్టం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉంది. భారతదేశంలో భాషా విషయకంగా తెలుగు వారంత ప్రాంతీయ భాషా దురదృష్టవంతులు మరొక భాషవారు ఉండరేమోననిపిస్తుంది.
భాషాశాస్త్ర పరిశోధకులలో భారతదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా అగ్రేసరులనిపించుకున్న గిడుగు వెంకటరావు, మూర్తి పంతులుగారు నూరేళ్ల కిందట ‘తెలుగు’ పేరుతో ఒక మాస పత్రికను ‘పర్లాకిమిడి’ వంటి మారుమూల ప్రాంతం నుంచి నిర్వహించారు. ఈ పత్రిక పూర్తిగా భాషా సారస్వతాలు సర్వతోముఖంగా సమస్త భావ ప్రకటన వాహికలు కావాలంటే ఎట్లా పురోగతి సాధించారో బోధించే ఏకైక పత్రిక ఒక్క తెలుగుకు సంబంధించి మాత్రమే కాదు. ఆనాడు సమస్త భారతీయ భాషలను పరిగణించినా ఇటువంటి పత్రిక మరొకటి లేదు. గిడుగు వారు వ్యవహారిక భాషోద్యమ పద నిర్దేశకుడు కాబట్టి గిడుగును ఆనాటి పండితులెవరూ సమర్థించలేదు. గురజాడ మాత్రం సర్వాత్మణ సమర్థించారు. కందుకూరి వీరేశలింగం మాత్రం చివరలో గిడుగువారి ప్రభావానికి లోనైనట్లు తెలుస్తున్నది. తిరుపతి వెంకటకవులు, తాత సుబ్బరాయశాస్ర్తీ వంటి జగదేవ పండితులు గిడుగు వారిని సమర్థించారు అయితే పిఠాపురం, వెంకటగిరి వంటి సంస్థానాధీశులు గిడుగు వారికి ఎటువంటి ఆర్థికావలంబనం చేకూర్చలేదు. పైన గిడుగు వారి భాషా దార్శనికతను వ్యతిరేకించారు. అందువల్ల గిడుగు వారు ఈ పత్రికను ఒక ఏడాది కూడా నడపలేకపోయినారు. అంతర్జాతీయ స్థాయి భాషాతత్త్వజ్ఞులైన విదేశ పండితులు గ్రియర్సన్, హూర్జ్, యూక్స్‌బ్లాక్, ఫ్రేజర్, డేనియల్ జోన్స్, గిడుగు వారిని శ్లాఘిస్తూ తెలుగు పత్రికలో ప్రచురణార్థం లేఖలు అందజేశారు. తెలుగు పత్రికలో ఆంగ్ల విభాగం కూడా ఉండేది. ఎందుకంటే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం, విదేశీ భాషా సారస్వత వేత్తలు తన బ్రహ్మాండమైన ప్రయత్నం ఏమిటో, లక్ష్యం ఏమిటో ఇంగ్లీషు మాత్రమే చదివి తెలుసుకోగలవారి కోసం ఇంగ్లీషు విభాగాన్ని ఈ తెలుగు పత్రికలో ప్రచురించారు. నెల్లూరులో ఇటీవలే నెలకొన్న తెలుగు భాషా సాహిత్య వికాస లక్ష్య, సమగ్రాధ్యయన సంస్థ, గిడుగు వారి సర్వా రచనలను, వారి తెలుగు పత్రికను విశేష వివరణ సహితంగా ఆకర్షకంగా మల్ల ప్రచురించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. అంతేకదా గి.వె.రా గూర్చి తెలుగులో ఐదారు జీవిత చరిత్రాత్మక భాషా సాహిత్య కృషిని గూర్చి వచ్చిన గ్రంథాలు కూడా పునరుద్దరించాలి. అప్పుడుగానీ ఆయన భాషావికాస సమగ్రాధ్యయనత్త్వం ఎటువంటిదో తెలుసుకోగల సద్మః ఫలితం తెలుగు వారికి దక్కదు. అటువంటి గొప్ప భాషావేత్త తెలుగు వాడై జన్మించటం అరుదైన విషయం.
తెలుగు, తెలుగు అని వాగాడంబరం ప్రదర్శించే రాజకీయ ప్రముఖులు, విశ్వవిద్యాలయాచార్యులు, ‘తెలుగు పత్రిక’ను అసలు చూసే ఉండరు. అట్లా అన్నందుకు ఈ వ్యాస రచయితను మన్నించగలరు. తెలుగు పత్రికకు శతజయంతి గూర్చి తెలుగునాట ఏ విశ్వ విద్యాలయమూ తలపట్టెలేదు. గిడుగు వారికి అత్యంత సాన్నిహిత్యం గల ‘ప్రతిభ’ పత్రికను కూడా మళ్లీ ముద్రించాలి. ఇందులో చిలుకూరి నారాయణరావు, వడ్డాది అప్పారావు, టేకుమళ్ల కామేశ్వరరావుగారి వంటి వారి రచనలు ఎంతో విలువైనవి.
ఇంతవరకు తెలుగులో ఆధునిక నిఘంటువు రాలేదు. 1919 సెప్టెంబర్ ప్రారంభ సంచికలోనే ‘రాబోయే సంచికలలో మేము విచారించదలుచుకున్న విషయములు, అనే ప్రస్తావనలో ఆ మహనీయుడు 21 ప్రణాళికలను రూపకల్పన చేశాడు. అయితే ఈ గడచిన నూరేళ్లలో వీటిని గూర్చి చిత్తశుద్ధితో, విత్తశుద్దితో పట్టించుకున్న విశ్వవిద్యాలయం కానీ, సాహిత్య సంస్థ కానీ మృగ్యం, సూర్య రాయాంధ్ర నిఘంటువు ప్రకటితం కావటానికి 60 ఏళ్లు పట్టింది. దానిని నిర్మించిన సారస్వతేయులెవరూ ఈ 8 సంపుటాలను చూసి ఉండరు. ఇప్పుడి విభాషా విపణిలో లభించవు కూడా. 1920 ప్రాంతంలో ఆనాటి అసదృశ విద్వాంసుడైన శ్రీ వేదం వేంకటరామశాస్ర్తీ, ఆంధ్ర భాషా సర్వ స్వార్హ నియమకతిపయములు’...... అని తెలుగు భాషా విజ్ఞాన సర్వసాన్ని ఏ విధంగా రూపొందించాలో సంగ్రాహ ప్రణాళిక హస్తపుస్తక (అంటే సుమారు 20 పుటల కరపత్రిక వంటిది) ప్రచురింపజేశారు. అట్లానే ఆ తరువాత మరి ముప్ఫై సంవత్సరాలకు శ్రీ తెనే్నటి వెంకట దీక్షితులనే వారు (వీరిది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి ప్రాంతం) ‘దీక్షితయము’ అనే ఆధునికాంధ్ర నిఘంటు స్వరూప స్వభావాలను ప్రకటన పత్రిక రూపంలో మచ్చుపుటలు ప్రచురించారు. ఈ నిఘంటువు పాణినీయం మార్గదర్శకలో తాము రూపొందిస్తున్నట్లు అధ్యక్షులు ఈ మచ్చు పుటలను చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. ఇట్లానే శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్ర్తీ వర్య మహామనీషలు కూడా ‘నుడికడలి’ పేరుతో అచ్చుల విభాగపు మచ్చుపుటలు ప్రచురించారు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి వంటి విద్వశేషులు మారేపల్లి వారిని ప్రస్తుతించారు. ఈ నిఘంటు మచ్చాపుటల పేఠిక కూడా వారే సంతరించినట్లు ఊహ్యము. ‘తెలుగు నిఘంటువులు’ అని శ్రీ సురవరం వారు మారేపల్లి వారి ‘నుడికడలి ప్రశంసాశ్రమను సమీక్షించారు. ఇక తెలుగు సారస్వతధిషణా మనీష సర్వంకషులైన శ్రీ చిలుకూరినారాయణరావు, తను జీవిత సాఫల్యతాపస్యవరివస్యగా లక్ష తెలుగు సామెతలను సంకలనం చేశారు. (శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారి ‘నా వాఙ్మయ మిత్రులు’ అనే గ్రంథంలో చిలుకూరి వారు తన సామెతల సంకలన కృషి గూర్చి పడిన తపన సంబంధిగా రెండు లేఖలు కనపడతాయి)
గుంటూరులో ఉన్న శ్రీ బొమ్మిడాల ట్రస్టు వారు (సాహిత్య, సామాజిక, విద్యా, పాత్రికేయ, గ్రంథాలయ కృషికి ఆనువత్సర భూరివిరాళ ప్రదాత్త సాంస్కృతిక సంస్థ) ఈ చిలుకూరి వారి సంకలిత తెలుగు సామెతలో సంపుటాలను సూర్యా లోకం కలిగించే దొడ్డ ప్రయత్నంలో ఉన్నారు. నెల్లూరులో నెలకొన్న మన తెలుగు లలాట లిఖిత భాగ్య విలసిన అదృష్ట చిరకాల ప్రతీక్ష మహా సంస్థ ముఖ్యంగా ఆధునిక తెలుగు నిఘంటువు నిర్మాణానికి ప్రణాళికా రచన రూపొందించవలెనని ఈ సంస్థకు విన్నవించుకుంటున్నాను.
కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్తులో కిందటి తరానికి, ఈ తరానికి చెందిన విలువైన గ్రంథ నిధి ఉన్నది. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికా సంపుటాలు, ఇంకా గతకాలపు తెలుగు పత్రికలు వివరణాత్మ సూచికలు రూపొందింపజేసే ప్రయత్నం సాగించాలి. దివి గోపాలాచార్యుడు వారి ధన్వంతరి సంపుటాలలో ప్రపంచ విఖ్యాత విజ్ఞాన శాస్తవ్రేత్త, యెల్లాప్రగడ సుబ్బారావు తెలుగు రచనలు ఉన్నవి కదా! ఇవి ఉత్పన్నం కాకుండా చూడాలి. కొమర్రాజు, వేదం, అక్కిరాజు ఉమాకాంత్, కొక్కొండ, కందుకూరి రచనలు విశేష వ్యాఖ్యాసహితంగా పునరుద్దరణ కావాలి.
ఇతిశమ్.

- అక్కిరాజు రమాపతిరావు