పజిల్ -- 769
Published Sunday, 15 March 2020

ఆధారాలు
*
అడ్డం
*
1.పాటలో నాదము (4)
4.కొంచెం తేడా వస్తే జగపతి. వారిదీ ఓ
రాజవంశమే (4)
6.అటు నించి నూరు (2)
7.దీపారాధన చేయాలంటే ఇది ఉండాలి (2)
9.ప్రతీ వారం అనడానికి ఇలా కూడా అనవచ్చు (4)
10‘....వరం’ తూ.గో జిల్లా ఏజెన్సీలో ఒక పెద్ద ఊరు. వెనక నించి ‘పరం’ కూడా లభిస్తుంది (4)
11.ఆవల, ఈవల ఉభయత్రా ఉండేది (2)
13.ఈ నక్షత్రం ఎవరికీ కనపడదు (2)
15.‘పొగడను’ అంటే నీ ఇష్టం. కానీ అసలు దానికేసి ‘చూడు’ (4)
17.నాజూకైన స్ర్తి (4)
18.ఈ కాలం ఎవడి ‘ఇది’ వాడే వాయించుకోవాలి (2)
19.‘తను’ లేని ‘తను మధ్య’ (2)
20.ఆదివారం (4)
21.ఇంద్రుడి తోడు (4)
*
నిలువు
*
1.అలనాటి హాస్య నటుడు. ఎర్రాప్రగడ ఇంటి పేరు కూడా (5)
2.్ధ్వని (2)
3.ఉపరాష్ట్రపతి ఇంటిపేరులో కనపడే ఊరు (4)
4.విజయవాడ విమానాశ్రయం ఉన్న ఊరు (4)
5.మలయప్పస్వామి ఊరేగేది ఈ వీధుల్లోనే (4)
8.అడ్డం 7 దీని నుంచే వస్తుంది. వెనక నించి (2)
11.జనవరిలో వచ్చే పంట (2)
12.ఇట్టే వేడికి కరిగిపోయేది (2)
14.పరిశుద్ధత (5)
15.సరిగ్గా చూస్తే ‘మేలిపొర’లో సరిహద్దు దాగి ఉంది (4)
16.పలుకుబడి (4)
17.విష్ణుమూర్తి చక్రం (4)
18.‘...’ ఎప్పుడు వచ్చితీవు (2)
19.‘ఆగము’ అనకుండా ‘రాక’ (2)
*