S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బెట్టింగుల జోరు!

ఏలూరు, ఏప్రిల్ 29: ‘‘ అతనో పెళ్లికాని యువకుడు. భీమవరంలో ఒక సెల్‌ఫోన్ షాపులో మేనేజరుగా పనిచేస్తున్నాడు. సరదాగా క్రికెట్ బెట్టింగ్‌లు కట్టడం ప్రారంభించాడు. పూర్తిగా నష్టపోయాడు. గతంలో ఇలాగే బెట్టింగ్‌లు కట్టి దాదాపు 15లక్షల రూపాయలు కోల్పోతే తండ్రి అప్పు చేసి ఆ మొత్తాలను తీర్చాడు. మళ్లీ అదే పరిస్దితి ఎదురుకావటంతో ఏం చేయాలో తెలియక రైలు కింద పడి ప్రాణాలు విడిచాడు’’. ఇది ఒక యువకుని కధ మాత్రమే. ఇలా ఎందరో. ముందు వెయ్యి రూపాయలతో ప్రారంభించి దానికి రెట్టింపు మొత్తం రావటంతో ఆశ పెరిగి అయిదు, పది, 25వేలు ఇలా పెంచుకుంటూ పోతూ చివరకు భారీగా సొమ్ము పొగొట్టుకుంటూ ఆ మొత్తాలను తీర్చలేక బలవన్మలకు పాల్పడుతున్నారు. జిల్లాలో క్రికెట్ పందాలు జోరుగా సాగుతూ అంచనాలు తలకిందులై మధ్యతరగతివారు దారుణంగా నష్టపోతున్నారు. కేవలం గంటల వ్యవధిలో లక్షల సొమ్ము దక్కించుకునే అవకాశం ఉండటంతో భారీఎత్తున పందాలు సాగుతున్నాయి. జాక్‌పాట్‌లా ఐపిఎల్ మ్యాచ్‌లు మారిపోవటంతో ఏ ఒక్కర్ని పలకరించినా బెట్టింగ్‌లు గురించే ప్రస్తావన ప్రారంభం కావటం విశేషం. పటిష్టమైన నెట్‌వర్కుతో ఆధునిక పరికరాల సహయంతో జిల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ప్రపంచకప్ పోటీలు ముగిసాయనుకున్నలోపే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మ్యాచ్‌లు ప్రారంభం కావటంతో పందాలరాయుళ్లకు విశ్రాంతి లేకుండా పోయింది. జిల్లాలో పలుప్రాంతాల్లో బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. దీనికి ప్రధానంగా యువత, సమాజంలో గౌరవనీయమైన స్ధానంలో ఉన్నవారు, వర్గంతో పనిలేకుండా చాలామంది బలవుతున్నారు. కిళ్లీషాపులు, టీకొట్టులు, హోటళ్లు, లారీ సప్లయి ఆఫీసులు ఇలా ప్రతిది బెట్టింగ్ కేంద్రంగా మారిపోయాయంటే ఆతిశయోక్తి కాదు. ఈ బెట్టింగులలో కొంతమంది ఉన్నదంతా కోల్పోతుంటే మరికొందరు రోజుల్లో లక్షాధికారులు అవుతున్నారు. బెట్టింగ్ నిర్వహించేవారు కోట్ల రూపాయల లాభాలు చూస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరుతోపాటు భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి వంటి ప్రధాన ప్రాంతాలతోపాటు చిన్నచిన్న గ్రామాల్లో కూడా పెద్దఎత్తున బెట్టింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. కొందరు రాజకీయ ప్రముఖుల అండ ఉండటంతో బెట్టింగ్ నిర్వాహకులకు అడ్డులేకుండా పోతోంది. పోలీసులకు కొన్నిచోట్ల పక్కా సమాచారం ఉన్నా దానిని తమ వసూళ్ల ఖాతాకు జమ చేసుకుంటున్నారు. ప్రపంచకప్ పోటీలు ముగిసిన వెంటనే ఐపిఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కావటంతో క్రికెట్ పందాలకు శెలవు లేకుండా పోయింది. ఐపిఎల్ మ్యాచ్‌ల్లో కళ్లు మూసి తెరిచేలోగానే డబ్బులు వచ్చి పడతాయన్న ఆశతో ఎంతోమంది బరితెగించి మరీ పందాలు కాస్తున్నారు. ఎక్కువగా ఫ్యాన్సీ పందాలు జోరుగా సాగుతున్నాయి. మొదటి ఆరుఓవర్లలో బ్యాటింగ్ చేసే జట్టు ఎంత స్కోరు చేస్తుందన్న ప్రాతిపదికగా ఈపందాలు కొనసాగుతాయి. ఇక ఆతర్వాత 12 ఓవర్లకు, చివరిగా 20 ఓవర్లకు ఫ్యాన్సీ పందాలు కొనసాగుతున్నాయి. అయితే రెండవ జట్టు బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం మొదటి ఆరు ఓవర్ల వరకే ఫ్యాన్సీ పందాలను కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో ప్రతి సందులోనూ ఒక క్రికెట్ బుకీ ఉన్నాడంటే ఆతిశయోక్తి కాదు. పేర్లు పలకలేనివారు కూడా ఈ బెట్టింగ్‌లకు దిగుతున్నారంటే ఈ బెట్టింగ్ వ్యవహారం ఏ స్ధాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిణామాలు ఇలాఉంటే బెట్టింగ్ నెట్‌వర్క్ విషయంలో ఏలూరుతోపాటు పలు పట్టణ ప్రాంతాలలో లోకల్ బుకీలు భారీగా మోసాలకు పాల్పడుతూ లక్షలు మిగుల్చుకుంటున్నారు. ప్రధాన బుకీలు బెట్టింగ్‌కు సంబంధించి కొన్ని నిబంధనలను సడలించినా ఆ విషయం అందరికి తెలియకుండా దాచిపెట్టి సాధారణ పందెగాళ్లను దోచుకుంటున్నారు. మొత్తంమీద జిల్లాలో ఐపిఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్‌లు జోరుగా సాగిపోతున్నాయి.