S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జన్మభూమి కమిటీలు రద్దు కానివ్వం

నల్లజర్ల, ఏప్రిల్ 29: ఎట్టి పరిస్థితుల్లో జన్మభూమి కమిటీలను రద్దు కానివ్వమని, ఈ కమిటీల వల్ల ఎంతో ప్రయోజనం ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఈ కమిటీలు మరింత పకడ్బంధీగా పనిచేసేలా కృషిచేస్తామని జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. నల్లజర్లలో శుక్రవారం ఏర్పాటుచేసిన నాయకత్వ శిక్షణా శిబిరానికి ముళ్లపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించేది టిడిపియేనని, నాయకులు, కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తే రాష్ట్రానికి రూపురేఖలు మారిపోతాయన్నారు. మరో అతిథి, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లకోట్ల స్వామిదాసు మాట్లాడుతూ 420 కేసుల్లో ఉన్న జగన్ సేవ్ డెమోక్రసీ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసిపిలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటే ఎమ్మెల్యేలు ఆ పార్టీని విడిచి వచ్చేవారు కాదన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తయారు చేయాలనే విజన్‌తో సిఎం చంద్రబాబునాయుడు చేస్తున్న కార్యక్రమాలకు పూర్తిమద్ధతునీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మానసిక శిక్షణా నిపుణుడు దారపు నాగిరెడ్డి, శివశ్రీలు శిక్షణ శిబిర కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకట్రాజు పాల్గొన్నారు.