S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అయిదు లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంచేసుకోవాలి

ఏలూరు, ఏప్రిల్ 29: వేసవి దృష్ట్యా ప్రజల ఉపయోగార్ధం అయిదు లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ విజయగౌరిని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. తాగునీరు, చలివేంద్రాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, మీ-కోసం, మీ-సేవ, ఎల్ ఇసి కార్డులు, బయోమెట్రిక్ అటెండెన్స్, దీపం, పెన్షన్లు, తదితర అంశాలపై ఆర్‌డివోలు, మండల తహశీల్దార్లు, ఎంపిడివోలు, అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ఏ ఒక్కరూ వడగాల్పుల బారిన పడకుండా ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు, ప్రయాణీకులకు వేసవిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చలివేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో అవసరమైన ప్రతీ చోటా బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, రైతుబజార్లు, మార్కెట్ ప్రాంతాలు, నాలుగు రోడ్ల కూడళ్లు, హైవేలు, జనరద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రభుత్వం తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చలివేంద్రాల ఏర్పాటులో ఆర్‌డివోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చల్లని మంచినీటితోపాటు అవసరమైన మజ్జిగను సరఫరా చేయాలన్నారు. అధికారుల్లో ఎవరో ఒకరు చలివేంద్రాల్లో ఉండాలని మంచినీరు, మజ్జిగ పంపిణీలో స్వచ్ఛంద సంస్థలు ఉత్సాహవంతులైన విద్యార్ధులు, వాలెంటీర్లు పాల్గొనవచ్చునని చెప్పారు. అయిదు లక్షల ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌వోను ఆదేశించారు.