S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బోర్డు తిప్పేసిన హౌసింగ్ సంస్థ?

భీమవరం, ఏప్రిల్ 29: భీమవరం పట్టణంలోని వివిఆర్ హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ బోర్డు తిప్పేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనితో శుక్రవారం బాధితులంతా ఆ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మరికొందరు లబోదిబోమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన వివిఆర్ హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ భీమవరంలో 2010లో టౌన్ రైల్వేస్టేషన్ వద్ద కార్యాలయాన్ని ప్రారంభించింది. ఏజెంట్లను ఏర్పాటుచేసుకుని వారి ద్వారా సామాన్య, మధ్యతరగతి వారికి ఇళ్ల స్థలాలు విక్రయిస్తామని ప్రచారం చేసింది. దీంతో తక్కువ ధరకు స్థలాలు వస్తున్నాయని, పైగా వాయిదాల్లో డబ్బులు చెల్లిస్తే పెద్దగా భారముండదని భావించిన ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ముందుకు వచ్చారు. జిల్లాలోని భీమవరం, తణుకు, శృంగవృక్షం, పెన్నాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతాల్లో వ్యాపారం జోరుగా నడిపింది ఈ సంస్థ. ఇందులో చాలామంది ఏజెంట్లుగా చేరారు. అయితే గత కొంతకాలంగా భీమవరం కార్యాలయం భవనం బయట ఏర్పాటుచేసుకున్న బోర్డు తొలగించి తాళం వేసి ఉంది. తమ భూములకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తారని తిరిగిన వారికి చేదు అనుభవం ఎదురైంది. దీంతో విశాఖపట్నం, కాకినాడ ఇలా అనేక ప్రాంతాలకు ఆర్థిక చెల్లింపులు చేసిన వారు తిరిగినా అక్కడ కూడా ఎవరూ ఫోన్ ఎత్తకపోవడం, కార్యాలయం మూసి ఉందని బాధితులు చెబుతున్నారు. దీంతో ఏం జరుగుతుందిలే చూద్దామని ఎదురుచూసిన బాధితులకు శుక్రవారంరాత్రి భీమవరం కార్యాలయంలోని సామాగ్రిని విజయవాడకు చెందిన కొందరు వ్యక్తులు తీసుకువెళ్తున్నారని సమాచారం అందింది. వెంటనే బాధితులు రంగప్రవేశం చేసి విజయవాడ నుంచి వచ్చిన సంతోష్, సత్యనారాయణ అనే ఇద్దరు వ్యక్తులను నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న టూటౌన్ సిఐ రమేష్‌బాబు, ఎస్సై తిలక్‌లు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. సుమారు 500 మంది ఖాతాదారులు ఉంటామని, సుమారు రూ.10 కోట్లు వరకు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని సిఐకి బాధితులు వివరించారు. సిఐ రమేష్‌బాబు ఆదేశాల మేరకు ఎస్సై తిలక్ వివిఆర్ హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయానికి తాళాలు వేయించారు. బాధితులు నిర్బంధించిన సంతోష్, సత్యనారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సంస్థ వారు వస్తారని, అందరికీకి కూడా చెల్లింపులు చేస్తారని పోలీసుల అదుపులో ఉన్న సంతోష్, సత్యనారాయణలు బాధితులను బుజ్జగింపుచేసే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న సిఐ రమేష్‌బాబు అటువంటి ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందామని, ముందుకు పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. సిఐ వాహనంలో వారి ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దీనికి ముందు సంతోష్, సత్యనారాయణలు విజయవాడ బ్రాంచ్‌కు చెందిన వారితో సిఐ రమేష్‌బాబుతో మాట్లాడించారు. బాధితులు విజయవాడ వస్తే అక్కడ చెల్లింపులు చేస్తామని సిఐకు ఫోన్‌లో చెప్పారు. నష్టపోయిన బాధితులు ఇక్కడే ఉన్నారని, సంస్థ యాజమాన్యం ఇక్కడకు వచ్చి బాధితులకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
కాగితాల్లో రిజిస్ట్రేషన్ చేశారు.. కాని భూమే లేదు
భీమవరం పట్టణానికి చెందిన వి శ్రీనివాసరాజు ఈ సంస్థకు ఏజెంటుగా ఉన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి, ఏలూరు, పెన్నాడ, శృంగవృక్షం గ్రామాల్లో చిన్న చిన్న బిట్‌లలో భూమిని సామాన్య, మధ్యతరగతి వారి ద్వారా కొనుగోలు చేయించారని తెలిపారు. వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు ఇచ్చామని, కాని వాస్తవంగా ఆ భూమి వద్దకు వెళ్లి చూస్తే రైతులు దున్నుకుంటున్నారని వివరించారు. సంస్థ తమలాంటి ఏజెంట్లను మోసం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.. భీమవరం బ్రాంచ్ మేనేజర్‌గా ప్రసాద్, ఏలూరు బ్రాంచ్ మేనేజర్‌గా మహేంద్ర, విజయవాడకు చెందిన పద్మావతిలు లావాదేవీలు చూస్తూ ఉండేవారని శ్రీనివాసరాజు తెలిపారు.