S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విచ్చలవిడిగా కరపత్రాల ప్రచారం

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 29: ఎంసెట్ ప్రవేశ పరీక్షా కేంద్రాల వద్ద నిర్వహించిన కరపత్రాల ప్రచారంతో పలు రోడ్లు అపరిశుభ్రంగా తయారయ్యాయి. పలు ఇంజనీరింగ్, ఇతర కళాశాలలకు చెందిన కరపత్రాలు రోడ్లపై దర్శనమిచ్చిన వైనాన్ని పరిశీలిస్తే అసలు నగరంలో లిట్టర్ ఫ్రీ చర్యలు అమలులో ఉన్నాయా లేదాన్న సందేహం కలుగకమానదు. సామాన్య ప్రజలు, వ్యాపారులు రోడ్లపై చెత్త చెదారం వేస్తే అపరాధ రుసుం కింద వేలాది రూపాయలను వసూలను చేసే మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ ప్రస్తుతం విద్యా వ్యాపారంలో భాగంగా జరిగిన కరపత్రాల అపరిశుభ్రతపై ఎటువంటి చర్యలు తీసుకొంటారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొనగా మధ్యాహ్నాం నుంచి రాత్రి వరకూ వీటిని తొలగింపు చర్యలు లేవనే చెప్పాలి. విద్యార్థులను ఆకర్షించేందుకు గాను వివిధ కళాశాలలు రంగు రంగుల కరపత్రాలు వందలు కాదు వేలు కాదు ఏకంగా లక్షలాది కరపత్రాలను రోడ్లపై పడవేసిన వైనం నగరంలో జరుగుతున్న కరపత్రాల ప్రచారం అమలు ఏపాటివో ఇట్టే చెప్పేవచ్చు. లిట్టర్ ఫ్రీ రోడ్లే కాకుండా పోస్టర్ ఫ్రీ నగరంగా కూడా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రోడ్లపక్కన గోడలపై అనధికారికంగా అతికిస్తున్న వాల్‌పోస్టర్ల తొలగింపే కాకుండా అందుకు కారకులైన వారిని గుర్తించి వారిపై ఫైన్ విధించి వసూలు చేయడమే కాకుండా చట్టపరమైన ఇతర చర్యలు కూడా తీసుకొంటున్న ప్రస్తుత తరుణంలో ప్రస్తుతం జరిగిన కరప్రతాల ప్రచారానికి ఎటువంటి అనుమతులున్నాయన్నది సంబంధిత అధికారులకే తెలియాలి. ముఖ్యంగా మొగల్‌రాజపురం సిద్ధార్థ కళాశాల, నిర్మలా హైస్కూల్ రోడ్లే కాకుండా ఇతర ప్రధాన కళాశాలల వద్ద విచ్చలవిడి కరప్రతాల ప్రచారం జరిగింది. పంపిణీ చేసిన కరపత్రాలన్నీ రోడ్లపైనే దర్శనమిస్తున్నాయి. వాహనాల రాకపోకల తాకిడికి ఇవి పైకి ఎగిసిపడుతూ చికాకు పుట్టిస్తున్న వైనం శోచనీయం కాగా నగర పరిసరాలు, రోడ్ల అపరిశుభ్రతకు పాల్పడిన ఆయా కళాశాలలపై విఎంసి కమిషనర్ వీరపాండియన్ కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.