S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

10న కృష్ణానది కరకట్టపై అతిరాత్ర మహాయాగం

విజయవాడ, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మొట్టమొదటిసారి అధిరాత్ర మహా యాగం జరపాలని సంకల్పంతో తపస్వి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మే 19న కృష్ణా నది ఒడ్డున అమరావతి కట్ట రోడ్ మొదటిలో గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో సన్నాహాలు మొదలయ్యాయి. అధిరాత్రలో ముఖ్యమైనది యాగశాల, గురుడాకారంలో ఉంటున్న యాగశాల నిర్మాణం శుక్రవారం ప్రారంభించారు. కేరళ రాష్ట్రం నుండి నైపుణ్యం కలిగిన కార్మికులని, వాస్తు శాస్త్ర ప్రకారం తయారు చేయడం జరుగుతోంది. యాగశాల నిర్మాణానికి కావలసిన పిల్లరకు వక్క చెట్ల బాదులను పైకప్పుకోసం కొబ్బరి ఆకులను అల్లి, ప్రత్యేకంగా తయారు చేసి కేరళ నుండి తీసుకురావడం జరిగింది. యాగశాలకు ఇరువైపులా విఐపి గ్యాలరీ, సందర్శకుల గ్యాలరీ నిర్మిస్తున్నారు. మరోపక్క యాగానికి సంబంధించిన పరిపాలన కార్యాలయం వుంటుంది. యాగశాలకు ఎడమ ప్రక్కన ఉన్న 40 సెంట్ల స్థలంలో హోమగుండం నిర్మించనున్నారు. హోమగుండం కొంచెం దూరంలో ఆడిటోరియంలో భోజన శాల, వంటశాల, నిర్మిస్తారు. ఇక్కడ నిర్మించబోయే గోశాల చాలా విశిష్ఠమైనది. భారతదేశంలో ఉంటున్న 32 జాతుల ఆవులను ప్రదర్శిస్తారు. ఈ గోశాలలోనే సురభి, గోరక్ష దీక్షా యాగం కూడా అధిరాత్ర మహాయాగంతో పాటు 12 రోజులు జరగనుంది. అలాగే గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను రైతుల చేత స్వయంగా భక్తులకు విక్రయించే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు అధిరాత్ర మహాయాగం మీడియా సమన్వయ కర్త పికె దిలీప్ తెలిపారు. యాగశాల నిర్మాణానికి సంబంధించిన పనులను తపస్స్ ట్రస్ట్‌కు చెందిన సుదర్శన్ రెడ్డి, శివ శంకర్, కుందుర్తి మహికిరణ్ శర్మ, కార్య నిర్వాహకులు వి.శ్రీనివాసరాజు, జి.వి.రామారావు, ఐ.బర్మారావు పరిశీలించారు.