S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంగన్‌వాడీ కేంద్రాలకు ఇ-పోస్ ద్వారానే నిత్యావసర సరుకులు

విజయవాడ, ఏప్రిల్ 29: అంగన్‌వాడీ కేంద్రాలకు చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసర వస్తువులను తప్పనిసరిగా ఇ-పోస్ విధానం ద్వారానే పొందాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఇ-పోస్ విధానం ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీపై సబ్‌కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో శుక్రవారం అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, స్ర్తి సంక్షేమశాఖ, పౌర సరఫరాల అధికారులు, డీలర్లతో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 3,812 అంగన్‌వాడీ కేంద్రాలకు 2163 చౌకధరల దుకాణాల నుండి ఇ-పోస్ విధానం ద్వారా నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని నిర్ణయించటం జరిగిందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఇ-పోస్ విధానం ద్వారా నిత్యావసర వస్తువులు సరఫరా చేయటం తొలిసారిగా కృష్ణాజిల్లాలో చేపట్టటం జరిగిందన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించి అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను నికరతూకంతో అందించాలని ఇ-పోస్ విధానాన్ని ప్రవేశపెట్టటం జరిగిందన్నారు. ఇ-పోస్ విధానం ద్వారా చౌకధరల దుకాణాల నుండి నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించి సమర్థవంతంగా నిత్యావసర సరుకులను సరఫరా చేసి జిల్లాను ఆదర్శంగా నిలపాలన్నారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను రేషన్ షాపులకు అనుసంధానం చేయటం జరిగిందన్నారు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఇ-పోస్ విధానాన్ని అమలు చేయకుండా నేరుగా సరుకులను సరఫరా చేయటం జరుగుతుందని ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసినట్లు సంక్షిప్త సమాచారంలో పొందుపర్చి అంగన్‌వాడీ కేంద్రానికి సరుకులను రెండు, మూడు రోజుల వరకు పంపిణీ చేయకపోవటాన్ని గుర్తించిన జాయింట్ కలెక్టర్ సంబంధిత పిడిఎస్ డిటిలకు, రేషన్ డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారినని ఆదేశించారు. సకాలంలో అంగన్‌వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు సరఫరా జరగకపోయినట్లయితే అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన అధికారులు పిడిఎస్ డిటిని గాని, సహాయ పౌర సరఫరాల అధికారినిగాని సంప్రదించాలని వారి నుండి సరైన స్పందన లేనట్లయితే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు సరఫరాలో అలసత్వం వహించిన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో విజయవాడ, నూజివీడు సబ్‌కలెక్టర్లు డా. జి.సృజన, డా.లక్ష్మీశా, జిల్లా పౌర సరఫరాల అధికారి వి.రవికిరణ్, ఐసిడిఎస్ పిడి కె.కృష్ణమూర్తి, జిల్లాకు చెందిన ఐసిడిఎస్ సిడిపిఒలు, పౌర సరఫరాల అధికారులు, రేషన్ డీలర్లు తదితరులు ఉన్నారు.