S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇంద్రకీలాద్రపై భద్రతతో కూడిన అభివృద్ధి పనులు

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 29: పుష్కర యాత్రికుల సౌకర్యమే ప్రధాన ప్రాతిపదికగా అమ్మవారి దర్శనానికి వచ్చే పుష్కర భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా ఇంద్రకీలాద్రి కొండపై భాగంలో భద్రతతో కూడిన అభివృద్ధి పనులను చేపట్టడటం జరుగుతోందని జిల్లా కలెక్టర్ బాబు ఎ, అదనపుపోలీస్ కమిషనర్ మహేష్ లడ్డాలు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి పై పుష్కర ఏర్పాట్ల కార్యచరణ ప్రణాళికలపై జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డిసిపి అశోక్‌కుమార్, వియం కమిషనర్ వీరపాండియన్, సబ్ కలెక్టర్ సృజన, ఎసిపి రామకృష్ణ, దుర్గగుడి ఇవో యస్‌యస్ చంద్రశేఖర్ అజాద్, ఇఇ కోటేశ్వరరావు, డిఇ రమాదేవితో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. పుష్కర భక్తులు తొలుత పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవటానికి రావటం జరుగుతోందని ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పుష్కరాలు 12రోజులు అయినప్పటికీ 15 రోజుల వరకు భక్తులు రావటం జరుగుతోందని దసరా మహోత్సవాల కంటే పుష్కరాలకు మరిన్ని అదనపుసౌకర్యాలను ఏర్పాటు చేసుకునే విధంగా ముందుగానే అన్ని సెక్షన్ సిబ్బంది ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ దుర్గగుడి ఇవోకు సూచన చేశారు. ఇంద్రకీలాద్రిపై పే చేపట్టిన తొలగింపుపనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సోమవారం ఖరారు కానున్న నేపథ్యంలో మంగళవారం నుండే క్షేత్రస్థాయిలో తొలగింపు పనులు చేపట్టాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు కలెక్టర్‌కు స్పష్టం చేసారు. క్యూలైనులను స్నాన ఘాట్టాలకు అనుసంధానం చేస్తూ మరోరెండు క్యూలైన్లు అమ్మవారి దర్శనాన్ని వెళ్లే భక్తుల కోసం కేటాయించడానికి తగిన విధంగా ప్రణాళికలతో ముందుకురావాలని కలెక్టర్ సూచించారు. అదనపునగర పోలీస్ కమిషనర్ మహేష్ లడ్డా మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సందర్భంగా ఎదుర్కొన్న సంఘటనలు గుర్తుంచుకోవాలని, అటువంటి సంఘటనలకు తావులేకుండా క్యూ లైన్ల నిర్వహణలో భద్రతపరమైన అంశాలను జోడించి నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మహామండపం ద్వారా, శివాలయం మార్గం ద్వారా, కొండపైకి ప్రధాన రహదారి గుండా వచ్చే భక్తుల క్యూలైన్ల యథార్థ స్థితిగతులను, మ్యాప్‌లు, ఇంద్రకీలాద్రి ఏరియల్ ప్యూలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. మహామండపం గుండా భక్తులను రాకపోకలను సంబంధించి ఆలయ కార్యచరణ ప్రణాళిక వివరాలను తెలుసుకొని కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలసి స్వయంగా భక్తులు నడిచే మార్గాల్లో పరిశీలించారు. దుర్గగుడి ఇవో ఆజాద్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి నుండి మహామండపానికి అనుసంధానంగా ఏర్పాటు చేసే విస్తరణ పనులు, తొలగింపుభవనాల వివరాలు, అధికార బృందానికి వివరించారు. మొత్తం 44 కట్టడాలకు సంబంధించి తొలగింపు పనులను నిర్వహించాల్సి ఉంటుందని, అందుకు సంబంధింత పనులపై టెండరులను ఆహ్వానించినట్లు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయశాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్బారావు రూపొందించిన ప్లాన్, డిజైన్, అనుగుణంగా చర్యలు తీసుకోవటం జరుగుతోందన్నారు.