S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బందరురోడ్డుపై హోరెత్తిన వాహనాల జోరు

పెనమలూరు, ఏప్రిల్ 29: ఒకవైపు ఎంసెట్, మరోవైపు రెసిడెన్షియల్ విద్యార్థుల ఇళ్లబాట, వీటికి తోడు శుభముహూర్తాల చివరిరోజు కావడంతో పెళ్లిళ్లు వెరసి శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు బందరురోడ్డు వాహనాల రద్దీతో హోరెత్తింది. పెనమలూరు మండల పరిధిలోని రవీంద్రభారతి, అక్షర, విఆర్ సిద్ధార్థ, ధనేకుల ఇంజనీరింగ్, సిద్ధార్థ లా కళాశాల, పివిపి సిద్ధార్థ కళాశాలల్లో ఎంసెట్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో చెక్‌పోస్ట్ సెంటర్ నుండి గంగూరు వరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వాహనాలతో బందరురోడ్డు కిక్కిరిసింది. ఎంసెట్ పరీక్ష రాసిన వెంటనే రెసిడెన్షియల్ విద్యార్థులు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, తెలంగాణాలోని వారి ఇళ్లకు బయలుదేరారు. నారాయణ, శ్రీచైతన్య కళాశాలకు సంబంధించి నగరంలో 50 శాతం పైగా పెనమలూరు, కంకిపాడు మండలాల్లో రెసిడెన్షియల్ భవనాలు ఉన్నాయి. దీంతో రద్దీ పెరగడంతో కంకిపాడు నుండి చెక్‌పోస్ట్‌సెంటర్ వరకు అన్ని సెంటర్‌ల్లో పోలీసులు మోహరించి వాహనాల రద్దీ నియంత్రణకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కాగా శుక్రవారం శుభముహూర్తాలకు చివరిరోజు కావడంతో ధనేకుల, ఆహ్వానం, శ్రీనివాస, మనవేదిక, ఎల్‌ఎన్ గార్డెన్స్, సాయి, బాలాజీ, కిలారుఅనిల్ ఎస్టేట్స్, తదితర బందరురోడ్డుపై ఉన్న కల్యాణ మండపాలకు సాయంత్రం నుండే వాహనాల ర్యాలీలు మొదలయ్యాయి. వాహనాలు ఒకదానికొక్కటి ఢీకొన్న సంఘటనలు పలుచోట్ల చోటు చేసుకున్నాయి.