S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రూ.10 లక్షలతో వ్యాధి నిరోధక కేంద్రం ఏర్పాటు

అవనిగడ్డ, ఏప్రిల్ 29: అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.10 లక్షల వ్యయంతో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకందార్లు, సహకార సంఘ సభ్యుల అవగాహనా సదస్సును శుక్రవారం స్థానిక గాంధీ క్షేత్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం అందించే పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత సహకార సంఘాలపై ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పెంపకందార్లు ప్రతి ఒక్కరూ ఎంతో చొరవతో సద్వినియోగం చేసుకుంటున్నారని, సక్రమ పద్ధతిలో ప్రభుత్వ సాయాన్ని పేద వారికి అందించడమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. పెంపకందార్లకు సరైన పరిజ్ఞానం ఉండాలన్నారు. వ్యాధి నిరోదక చర్యలకు ప్రాధాన్యత ఇచ్చి జన్మభూమి కార్యక్రమంలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీమా సౌకర్యం మరింత పెంచాల్సిన అవసరం ఉందని, జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం చేస్తోందన్నారు. పెన్షన్, గుర్తింపు కార్డులు కూడా త్వరలో అందిస్తామన్నారు.