S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉడకపెడుతున్న ఉష్ణోగ్రతలు

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 29: ఉడకపెడుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9గంటలకే ప్రచండ భానుడు నిప్పులు గగ్గుతూ ప్రకాశించటంతో ప్రజలు, పశుపక్షాదులు వేడికి అల్లాడుతున్నాయి. మంచినీరు ఎంత తాగినా ఇంకిపోతోంది. దీనికి తోడు ఉక్కపోత కారణంగా వృద్ధులు, పసికందులు ఉడికిపోతున్నారు. ఉదయం 10గంటలు దాటిన తరువాత ఇళ్ళ నుంచి బయటకు రాకపోవటంతో పట్టణంలోని రహదారులన్నీ జన సంచారం లేక వెలవెలబోతున్నాయి. వేసవి దృష్ట్యా పట్టణంలో మంచినీరు రెండు రోజులకు ఒక సారి విడుదల చేస్తున్నారు. అయితే రెండు రోజులకు ఒక సారి విడుదల చేసినా స్టోరేజిలో నీరు తగ్గిపోవటంతో పురపాలక సంఘం వారు బోర్లను ఏర్పాటు చేస్తున్నారు. మంచినీరు రెండు రోజులకు వచ్చినా వాడుకోవటానికి చుక్క నీరు లేకపోవటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పురపాలక సంఘం వారు ఆయా వార్డులలో బోరు వేసి పంపులను ఏర్పాటు చేస్తున్నారు. రోహిణీ కార్తె రాకముందే మండలు మండిపోతుంటే రోహిణీ కార్తెలు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని వృద్ధులు అడలిపోతున్నారు.