S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వడదెబ్బతో ఐదుగురి మృతి

ఓర్వకల్లు, ఏప్రిల్ 29: జిల్లాలో శుక్రవారం వడదెబ్బతో ఐదుగురు మృతిచెందారు. అందులో ఓర్వకల్లు మండల పరిధిలోని గుట్టపాడు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ పెద్ద పెద్దయ్య(58) వడదెబ్బ సోకి శుక్రవారం మృతిచెందాడు. పెద్దయ్య ఉదయానే్న గ్రామానికి చెందిన కూలీలతో కలిసి ఉపాధి పనికి వెళ్లాడు. 10 గంట ల సమయంలో తల నొప్పిగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయని తోటి కూలీలతో చెప్పి సృహ తప్పి పడిపోయాడు. దీంతో తోటి కూలీలు సమాచారం ఇవ్వడంతో 108 వాహనం అక్కడికి చేరుకుని పెద్దయ్యను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందాడు. ఇతడికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మహానందిలో..
మహానంది : మండల పరిధిలోని మసీదుపురం గ్రామంలో వడదెబ్బతో రైతు కూలీ ఈశ్వరయ్య(52) మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. శుక్రవారం ఉదయం పొలంలో పనిచేసి తిరిగి వచ్చి ఇంటికి రాగానే వాంతులు, విరేచనాలై కోలుకోలేక మృతి చెందాడు. ఇటీవల కాలంలో మండలంలో దాదాపు వడదెబ్బతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఎండవేడిమి రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులతో కూలీపనులకు వెళ్తున్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : మండల పరిధిలోని శ్రీపతిరావుపేట గ్రామానికి చెందిన బాలమ్మ (50) శుక్రవారం వడదెబ్బకు గురై మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. బాలమ్మ గురువారం పొలం పనులకు వెళ్లింది. ఎండలో పని చేస్తున్న ఆమె ఆ వేడిమికి తట్టుకోలేక మధ్యాహ్న సమయంలో స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స చేయించారు. రాత్రి భోజనం చేసి నిద్ర పోయిందని, ఉదయం లేచి చూసేసరికి మృతి చెందిందని తెలిపారు.
ఎమ్మిగనూరులో..
ఎమ్మిగనూరు : పట్టణ సమీపంలోని వెంటపురం గ్రామానికి చెందిన వాల్మీకి గురుముర్తి (48) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. ఈయన కూలీ పనులు చేస్తు జీవనం సాగించేవాడు. ఎండవేడిమికి పోలం పని చేస్తుండగా కిందపడిపోవడం జరిగింది. బంధువులు హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందిన్నట్లు వైద్యులు తెలిపారు. ఇతనికి భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
చాగలమర్రిలో..
చాగలమర్రి : చాగలమర్రిలోని గుంతపాలెం వీధికి చెందిన లారీ డ్రైవర్ ముల్లా వలి (56) వడదెబ్బ సోకి శుక్రవారం చనిపోయాడు. గత కొన్ని రోజుల నుంచి వడదెబ్బ సోకి అస్వస్థతకు గురై స్థానిక ప్రైవేటు వైద్యుల వద్ద చికిత్స చేయించామని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. నయం కాక మృతి చెందినట్లు వారు వివరించారు.