S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భానుడి భగభగ

సత్తుపల్లి, ఏప్రిల్ 29 : గత కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా పెరగడంతో తీవ్రతను తట్టుకోలేక ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఎదైనా పనుంటే ఉదయం లేదా సాయంత్రం మాత్రమే జనం బయటకు వస్తున్నారు. నిత్యం రద్దీగా ఉంటే సత్తుపల్లి పట్టణం, రహదారి సైతం వాహనాలు తిరగక నిర్మానుష్యంగా మారింది. దీనికి తోడు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు కూడా ఎక్కడా రోడ్డుపై కనిపించడంలేదు. దూరప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు చల్లటి పానీయాల వపు మొగ్గు చూపుతున్నారు. కూల్‌డ్రింక్స్, కొబ్బరిబోండాలు, జ్యూస్‌లు, సోడాలు, ఐస్‌క్రీంలు, చెరుకురసం తాగుతూ ఎలాగోలా ప్రయాణాలు చేస్తున్నారు. ఎండలకు భయపడి గ్రామీణా ప్రాంతాల ప్రజలు వేడిగాలులు, ఎండ వేడిమి తట్టుకోలేక రాలేకపోతున్నారు. దీంతో వ్యాపారుల లావాదేవీలు సైతం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఈ నెలలోనే ఇలా ఉంటే మే నెలలో ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రజలు ఆందోళన పడుతున్నారు.
ఈ ఎండలకు ప్రజలు మంచినీటి కోసం పడుతున్న బాధలు చూసి పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, కాలేజీలు, స్కూల్స్, పోలీస్‌శాఖ, ఆటో,టాక్సీ యూనియన్‌లు జనం ఎక్కువగా రద్ధీగా ఉంటే బస్టాండ్ సెంటర్, పాతబస్టాండ్, రింగ్‌సెంటర్, బ్యాంకులు, ఎమ్మార్వో ఆఫీస్, పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రోజు మనుషులను నియమించి పట్టణానికి వచ్చిన ప్రజల దాహర్తిని తీరుస్తున్నారు.