S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుచరి’త్ర‘ సృష్టించాలి

ఖమ్మం రూరల్, ఏప్రిల్ 29: పాలేరు ఉప ఎన్నికల్లో రాంరెడ్డి సుచరితను గెలిపించి సుచరిత్ర సృష్టించాలని సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పివిఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ రోజు ఈ స్థాయిలో పంటలు పండుతున్నాయంటే అది కాంగ్రెస్ చలవేనని, నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అన్న సంగతి మర్చి ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క సీటు కోసం అర్రులు చాచడం ఎంతవరకు సబబో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. భారతంలో ఏ ధర్మమైతే గెలిచిందో, ఇప్పుడు కూడా అదే ధర్మం గెలుస్తుందన్నారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడం, ఆ స్థానంలో ఉప ఎన్నికలు జరగాల్సిరావడం బాధాకరమన్నారు. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన సతీమణి రాంరెడ్డి సుచరిత టిడిపి, వైసిపి మద్దతుతో పోటీ చేస్తున్నారని, ప్రజలు ఆమెకు ఘనవిజయం చేకూర్చాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో కరవు తాండవిస్తుందని, ఇప్పటికే పాలేరు కింద రైతులు నాలుగు పంటలు కోల్పోయారని, ప్లీనరీలోనైనా కరవు జిల్లాగా ప్రకటిస్తారనుకుంటే జిల్లా ప్రజల ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మధిర ఎమ్మెల్యే భట్టివిక్రమార్క, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పాలేరంటే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే ఉండేవని, కానీ ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ కనుమరుగైందన్నారు. ఈఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్‌అలి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు మాట్లాడుతూ నిజమైన తెలంగాణ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి అని, ఆయన సతీమణిని ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ ద్రోహులను ఓడించాలని పిలుపునిచ్చారు.
పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సుచరిత మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితం సత్యం, వనం వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు గెల్లా జగన్మోహన్‌రావు, వైసిపి నాయకులు దయాకర్‌రెడ్డి, చరణ్‌రెడ్డి పాల్గొన్నారు.