S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ను తరిమేస్తాం

ఖమ్మం, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తరిమేస్తామని, కొన్ని పార్టీలు ఓటమి భయంతోనే చీకటి రాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, కడియం శ్రీహరిలు స్పష్టం చేశారు. శుక్రవారం టిఆర్‌ఎస్ పాలేరు అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు మనుగడ లేకుండాపోతుందన్నారు. నారాయణ్‌ఖేడ్, మెదక్ ఉప ఎన్నిక, వరంగల్ కార్పొరేషన్ ఎన్నిక, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నిక ఏ ఎన్నికలో అయినా విజయం టిఆర్‌ఎస్‌కే సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తున్నాయన్నారు. ఏ ఎన్నిక అయినా విజయం టిఆర్‌ఎస్‌కే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారన్నారు. నారాయణఖేడ్‌లో బరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం మానవత్వం గురించి మాట్లాడుతున్నారని, మానవత్వం ఆ పార్టీకి ఉంటే అక్కడ పోటీ చేయకుండా ఉండాల్సిందని గుర్తు చేశారు. కొన్ని పార్టీలు బరిలో ఉండకుండా జారుకుంటుండగా కొన్ని పార్టీలు తాము ఉన్నామని చెప్పుకునేందుకే బరిలో ఉంటున్నాయన్నారు. పాలేరు అభ్యర్థిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రిగా ఖమ్మం జిల్లాను ఇప్పటికే పలు రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. భక్తరామదాసు ప్రాజెక్ట్ ద్వారా పాలేరు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరందించేందుకు తుమ్మల కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అత్యంత కరవు పీడిత ప్రాంతమైన పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరందించేంత వరకు విశ్రాంతి తీసుకోనని చెప్తున్నారని, అలాంటి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని పాలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మార్పు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుంది - కెటిఆర్
కాంగ్రెస్ విధానాలను నచ్చక ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటంతో నందమూరి తారక రామారావు ఆత్మక్షోభిస్తుందని మంత్రి కెటిఆర్ అన్నారు. టిఆర్‌ఎస్‌ను ఓడించాలనే ఉద్దేశ్యంతో తప్పుడు ప్రచారం చేస్తూ విలువలకు తిలోదకాలిస్తున్నారని ఏద్దేవా చేశారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.