S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అహంకారంతో విర్రవీగుతున్న టిఆర్‌ఎస్

ఖమ్మం, ఏప్రిల్ 29: అహంకారంతో టిఆర్‌ఎస్ పార్టీ విర్రవీగుతుందని టిపిసిసి నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ఆరోపించారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరిత నామినేషన్ సందర్భంగా ఖమ్మం వచ్చిన వారు విలేఖరులతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదనే విధంగా ప్రవర్తిస్తుందని ఏద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తూ ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తోందని, ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ టిఆర్‌ఎస్ గెలవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయటంతో పాటు ఇతర పార్టీల నేతలను బెదిరించి పార్టీలో చేర్చుకుంటుందన్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని గుర్తు చేశారు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రజలను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో కోట్ల అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. ప్లీనరిలో చెప్పిన మాటలు ఆచరణలో అమలుకు మాత్రం నోచుకోవన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని టిఆర్‌ఎస్ తమ స్వంత ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా వ్యవహరిస్తుందని సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికే టిఆర్‌ఎస్ అనేక అడ్డదార్లు తొక్కి ఎన్నికల్లో గెలిచిందని ఏద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ చెప్తున్న మాటలకు అమలు చేస్తున్న విధానాలకు పొంతన లేకుండాపోతుందన్నారు.