S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సామాన్య విద్యార్థుల అసామాన్య ఫలితాలు

గుంటూరు, ఏప్రిల్ 29: గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థినులు అసామాన్య ఫలితాలు సాధించడం పట్ల స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లేళ్ల అప్పిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కష్టపడి కాక ఇష్టపడి చదివినందునే మట్టిలో మాణిక్యాల్లాగా ప్రకాశిస్తున్నారన్నారు. నల్లపాడులోని ఫ్యూచర్ ఫోకస్ మహిళా జూనియర్ కళాశాలలోని విద్యార్థినులు ఎంపిసి, బైపిసిలో జిల్లా, రాష్టస్థ్రాయిలో అత్యున్నత ఫలితాలు సాధించడమే కాక జెఇఇ మెయిన్స్‌కు కూడా నేరుగా అర్హత సాధించారు. ఈ సందర్భంగా వారిని అప్పిరెడ్డి జ్ఞాపికలను అందజేసి అభినందించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ నవులూరి బ్రహ్మం అధ్యక్షతన జరిగిన సభలో అప్పిరెడ్డి మాట్లాడుతూ ఫ్యూచర్ ఫోకస్ చిన్న విద్యాసంస్థ అయినప్పటికీ కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో కసి, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చన్నారు. అందుకు రైలులో బందిపోట్లను ఎదిరించి ప్రమాదవశాత్తు ఒక కాలు పూర్తిగా దెబ్బతిని కూడా ధైర్యం కోల్పోకుండా ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాలీబాల్ క్రీడాకారిణి అరుణిమా అనే ధీరవనిత గాధను విద్యార్థులకు చెప్పారు. అరుణిమా తన ఒంటికాలితో ప్రపంచ రికార్డు సృష్టించగలిగినప్పుడు అన్ని సక్రమంగా ఉన్న మనం ఎందుకు అద్భుతాలు సృష్టించలేమని ఎవరికి వారు ప్రశ్నించుకుని స్ఫూర్తివంతం గా ముందుకు సాగాలని అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోటేశ్వరరావు, మహేష్, కిరణ్‌రాజు, సాంబశివరావు, రఘునాథరెడ్డి, నాగలక్ష్మి పాల్గొన్నారు.