S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీరు-ప్రగతి ఒక ప్రజా ఉద్యమంలా సాగాలి

గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 29: రాష్ట్రంలో నీరు-ప్రగతి కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంలా సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సన్నిధి కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన నీరు-ప్రగతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం చేపట్టిన పనులను వేగవంతంగా చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. నీరు-చెట్టు, పంటకుంటలు, రెయిన్‌గన్స్, నీటిప్రాజెక్టుల పూర్తి, గొలుసుకట్టు చెరువులకు ప్రాధాన్యత, నదుల అనుసంధానం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం వినూత్నంగా నిర్వహిస్తుందన్నారు. భూగర్భ జలాలు అటుగంటడంతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. భూగర్భ జలాలు తగ్గాలంటే ప్రతి నీటిచుక్కను పొదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని సామాజిక బాధ్యతగా అందరూ చేపట్టాలన్నారు. రైతులు తమ పంట పొలాలకు నీరు కావాలన్నా, వేసిన పంట అధిక దిగుబడి సాధించాలన్నా వినూత్న ఆలోచనలతో ముందడుగు వేసి మంచి ఫలితాలు సాధించామన్నారు. 22.5 మిలియన్ల విద్యుత్ కొరత ఉన్నా కేవలం రెండు నెలల్లోనే ఆ సమస్యను అధిగమించి నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. 106 కోట్లతో 118 లక్షల ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనివలన మెట్ట, మాగాణిలో 19.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించినట్లు తెలిపారు. చెక్‌డ్యామ్‌లు, ఇంకుడుగుంటలు, చెరువుపూడిక తీత వంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భారతదేశంలోనే రెండు నదులను అనుసంధానం చేసిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. నడికుడిలో జరుగుతున్న పంట కుంటల పనులు బాగున్నాయని, నెల రోజుల్లో ఆ గ్రామాల్లో 500 పంటకుంటలు ఏర్పాటుచేయాలని, వచ్చే నెల 16వ తేదీన మరలా సందర్శిస్తానని, అదేరోజు జిల్లాలో 50 వేల పంటకుంటలు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటి సంరక్షణలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ నీరు ద్రవరూపంలో ఉన్న బంగారమని, బంగారం లేకపోయినా బతకవచ్చని, మనుషులు, జంతుజాలం నీరులేకుండా జీవించడం కష్టమన్నారు. 1997 నుంచే ఇంకుడుగుంటల ఆవశ్యకతపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని, నీటికొరత ఏర్పడటంతో ప్రజలకు నేడు తెలిసివచ్చిందన్నారు. నీరు-చెట్టు, ఇంటింటికీ ఇంకుడుగుంటలు, పంట పొలాల్లో సేద్యపుకుంటల నిర్మాణానికి ఎవరూ డబ్బులు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే అందుకు కావాల్సిన నిధులు సమకూరుస్తుందన్నారు. పంట పొలాలకు ఎక్కువ నీరు వాడితే దిగుబడి వస్తుందన్న ఉద్దేశంతో కొందరు అధికంగా నీరు వాడుతున్నారని, తద్వారా దిగుబడులు తగ్గే అవకాశముందన్నారు. అనంతరం సన్నిధి ఫంక్షన్ హాలు ఆవరణలో వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, మత్స్యశాఖ, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. కార్యక్రమంలో రాష్టమ్రంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎంపి గల్లా జయదేవ్, ఎమ్మెల్సీ రామకృష్ణ, ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నరేంద్ర, తెనాలి శ్రావణ్‌కుమార్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పార్టీ నాయకులు పుష్పరాజ్, మద్దాళి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.