S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒకవైపు సహజవనరుల అభివృద్ధి -మరోవైపు టెక్నాలజీ వినియోగం...

దాచేపల్లి, ఏప్రిల్ 29: ఒకవైపు మట్టి, నీరు , చెట్టు వంటి సహజ వనరులను అభివృద్ధి చేసుకుంటూనే మరొవైపుటెక్నాలజీ సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి తాను కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పిడుగురాళ్ళ మండల బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సభకు గురజాల ఎమ్మేల్యే యరపతినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ప్రకృతి వైపరిత్యాలు ఈనాడు కొత్తగా వచ్చినవి కావని సిఎం చెప్పారు. అయితే వాటిని ఎదుర్కొనేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవటం వలన సమస్యల నుండి చాలా వరకు బయటపడవచ్చునన్నారు. వర్షాభావం వలన భూగర్భ జలాలు అడుగంటి పోయి రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొని కరవు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు, భవిష్యత్తు అవసరాల కొరకు నీటిని నిల్వ చేసుకొనేందుకు ఇంకుడుగుంతల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత నిర్మించుకోవాలని కోరారు. అదే విధంగా చెట్లు నాటాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తొలుత తాను రాష్ట్రంలో టెక్నాలజిని ప్రవేశ పెట్టినప్పుడు పలువురు తనను విమర్శించారని చెప్పారు. విమర్శించిన వారు ఇప్పుడు టెక్నాలజి వాడకుండా ఉండగలరా అని ఆయన ప్రశ్నించారు. తాను కంప్యూటర్, సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్ వంటి వాటికి ప్రోత్సాహం ఇచ్చినప్పుడు కంప్యూటర్లు కూడు పెడతాయా అని పలువురు విమర్శించిన విషయాన్ని ఆయన గుర్తుచేసారు. అయితే ఇప్పుడు కంప్యూటర్లు, సెల్ ఫోన్లను వాడకుండా వారు ఉండగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. టెక్నాలజీ సహాయంతో ప్రభుత్వ శాఖలలో నెలకొని ఉన్న అవినీతిని చాలా వరకు తగ్గించగలిగామని సిఎం చెప్పారు. గతంలో 60 సర్ట్ఫికేట్ల కోసం కాళ్ళు అరిగేలా ప్రజలు తహశీల్దారు కార్యాలయాల చుట్టూ లంచాలిస్తూ తిరిగేవారని పేర్కొన్నారు. అయితే తాను ప్రభుత్వ రికార్డులను కంప్యూటరీకరణ చేయడం ద్వారా సర్ట్ఫికేట్ల సంఖ్యను చాలా వరకు తగ్గించగలిగామని సిఎం చెప్పారు. అదే విధంగా భూమి రికార్డులను కంప్యూటరీకరణ చేసి మీభూమి వెబ్‌సైట్‌ను ప్రారంభించామని చెప్పారు. దీని వలన ఎవరైనా తమ సెల్‌ఫోన్‌లో మీభూమి అప్లికేషన్‌ను ఒపెన్ చేసి తమ భూమి వివరాలను తెలుసుకోవచ్చని సిఎం చెప్పారు. ఫైబర్ గ్రిడ్ సహాయంతో రాష్ట్రంలో జూలై నాటికి కేవలం నెలకు 149 రూపాలయల ఖర్చుతో 15 ఎంబిపియస్ స్పీడ్ కలిగిన ఇంటర్‌నెట్, కేబుల్ టీవి, ఫోన్ అందించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఎక్కడనుండి ఎక్కడికైనా వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవచ్చునని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులు ఇంటి వద్దనే పాఠాలు నేర్చుకునే అవకాశం ఉందన్నారు. అదే విధంగా వైద్య రంగంలో సైతం వీడియో కాన్ఫరెన్స్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చనిపోయిన వారికి సైతం వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే వారని తాను బయోమెట్రిక్ విధానం అమలు చేయటం వలన అర్హులకే పింఛన్లు అందుతున్నాయన్నారు. ఇప్పటికైనా ఎవరైనా అర్హులకు పింఛను అందకపోతే వెంటనే తన దృష్టికి తెస్తే వారికి పింఛను ఇప్పించే ఏర్పాటు చేస్తామని సిఎం తెలిపారు. రైతులు బ్యాంకులో రుణం పొందాలంటే పట్టాదారు పాసుపుస్తకం అవసరం లేకుండా 1బి ఫారం సహాయంతో రుణం పొందవచ్చునని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. అదే విధంగా డ్వాక్రా మహిళల రుణమాఫీ కూడా దశల వారిగా అమలు చేస్తున్నట్లు సిఎం వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, పలువురు శాసన సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.