S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యేక హోదా, రైల్వేజోన్ హామీలపై స్పందన లేదు

గుంటూరు, ఏప్రిల్ 29: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగాలేదు.. కేంద్రం సహకరించటంలేదు.. విభజన జరిగి రెండేళ్లయినా ఇప్పటి వరకు కేవలం రూ. 2వేల 500 కోట్లు మాత్రమే నిధులిచ్చింది.. పునర్వ్యవస్థీకరణ చట్టంలో అంశాలు.. ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో జాప్యం జరుగుతోంది.. అయినా తలకు మించిన భారంతో మొండిగా ముందుకు సాగుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించిన సీఎం ఒకానొక సందర్భంలో రైతులకు కూడా చురకలంటించారు. రాష్ట్రంలో కరవును అధిగమించేందుకు పంట సంజీవని ఉచితంగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంటే కాస్తంత జాగా వదులుకోలేరా అని ప్రశ్నించారు. అదే సభలో రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33వేల ఎకరాల భూములిచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని అభివృద్ధి నిధి.. వెనుబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ.. రైల్వేజోన్.. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.. పన్నుల రాయితీలు ఇవేవీ ఇప్పటి వరకు కేంద్రం మంజూరు చేయకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన హామీలన్నింటినీ నెరవేర్చే వరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. రాజధాని.. అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చులు పెరుగుతున్నాయి.. అయినా భూగర్భజలాల పెంపుదలను ఓ ఉద్యమంలా చేపట్టాలని రైతులకు ఉచితంగా పంట సంజీవనిని అందించి ఆదుకోవాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాగా దేశంతో పాటు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు. ఫలితంగానే దుర్భిక్షం తాండవిస్తోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేసి పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి సిద్ధం చేస్తే కరవును అధిగమించవచ్చన్నారు. ఇందుకోసం ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. యూరియా, ఎరువుల కుంభకోణాలతో పాటు రాష్ట్రంలో వైఎస్ ఆదర్శరైతులకు అధికారాలిచ్చారని దీనివల్ల రైతులు అనేక అగచాట్లు పడ్డారని విమర్శించారు. నేను హెలీకాప్టర్‌లో గుంటూరు నుంచి వస్తుంటే పల్నాడు ప్రాంతాన్ని చూసి గుండె తరుక్కుపోయింది.. పులిచింతల, నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరందించి రెండు పంటలు సాగుచేసుకునే వీలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. కాగా గుంటూరు సన్నిధి కళ్యాణ మండపం ఆవరణలో జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమం ప్రారంభంలోనే మనం వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాలి.. సమయాన్ని వృథా చేయద్దు. ప్రపంచంలో అందరికీ రేషనింగ్ టైమే.. జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ఎక్కువకాలం బతకగలం.. లేకపోతే చస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని సుసంపన్నం చేసేందుకు పంట సంజీవని.. రెయిన్ గన్.. ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో యంత్రాంగం పనిచేయాలని కోరారు.