S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీటి సమస్యపై దద్దరిల్లిన మున్సిపల్ సమావేశం

వికారాబాద్, ఏప్రిల్ 29: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 28 వార్డుల్లో నెలకొన్న మంచినీటి ఎద్దడిపై మున్సిపల్ సాధారణ సమావేశం దద్దరిల్లింది. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపల్ సాధారణ సమావేశానికి శాసనసభ్యుడు బి.సంజీవరావు హాజరై మాట్లాడుతూ మంచినీటి ఎద్దడి నివారణకు జనరల్ ఫండ్‌ను ఖర్చు చేయరాదని, ప్రత్యేక నిధులను ఖర్చు చేయాలని సూచించారు. వార్డుల్లో మంచినీటి సమస్య తీర్చడం, పారిశుధ్యపు పనులు చేపట్టడం తప్పనిసరి అని చెప్పారు. మంజూరైన తొమ్మిది బోర్లను ఎంపిక చేసిన చోటే వేయాల్సి ఉంటుందని చెప్పారు. 25వ వార్డు కౌన్సిలర్ జి.విజయేందర్ గౌడ్ మాట్లాడుతూ నీటిఎద్దడి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత సమయంలో 28 వార్డులకు ఏడు ట్యాంకర్లు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ట్యాంకర్ల నిర్వహణకు ఎంతమంది సూపర్‌వైజర్లను నియమించారు, వారి నెంబర్లు కౌన్సిలర్లకు ఇచ్చారా అని ప్రశ్నించారు. డిఇఇ, ఎఇలు కౌన్సిలర్లకు మర్యాద ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకరు వెంట కౌన్సిలర్ వెళ్లాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని అన్నారు. ఎంపిక చేసిన తొమ్మిది పాయింట్లలో ఇంకా బోర్ ఎందుకు వేయలేదని నిలదీశారు. లీకేజీలతో నీరు వృథాగా పోతున్నా, మరమ్మతు బిల్లులు ఎలా పెడతారని ప్రశ్నించారు. డిఇఇ గోపాల్ మాట్లాడుతూ పట్టణంలోని 22, 23, 27 వార్డులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నందున ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు వార్డులకు ప్రాధాన్యతన ఇస్తున్నామని చెప్పారు. 22వ వార్డు కౌన్సిలర్ సుచరిత నరోత్తంరెడ్డి మాట్లాడుతూ ఆరు రోజుల క్రితం నల్లా ద్వారా నీటి సరఫరా జరిగిందని, ట్యాంకర్ కోసం ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తడం లేదని డిఇఇని నిలదీశారు. చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చిన తొమ్మిది బోర్లు ఎక్కడ వేయాలో పేర్కొన్నారు. బోర్లలో మోటార్లు దించడానికి డబ్బులు లేవని అన్నారు. తొమ్మిది బోర్లను రాజీవ్‌నగర్, రాజీవ్‌గృహకల్ప, చెంచుపల్లి, కొత్తగడి, అనంతగిరిపల్లి, గంగారం, ఎనె్నపల్లి, ఆలంపల్లిలో వేస్తున్నట్లు తెలిపారు. కౌన్సిలర్ లక్ష్మికాంత్‌రెడ్డి మాట్లాడుతూ మంజీరా నీటి సరఫరా లేదని, ట్యాంకర్లు అస్తవ్యస్తంగా నడుస్తున్నాయని పెదవి విరిచారు. కౌన్సిలర్ సంగీత మాట్లాడుతూ తమ వార్డులో నీటి సమస్య ఉన్నా ఒక్క ట్యాంకరైనా పంపారా అంటూ నిలదీశారు. కౌన్సిలర్ మంజుల మాట్లాడుతూ మార్నింగ్ వాక్‌లో భాగంగా ప్రధాన రహదారుల్లోనే పారిశుద్ధ్యపు పనులు తనిఖీ చేస్తున్నారని, గాంధీ కాలనీకి ఒక్కసారి వస్తే చెత్తాచెదారం మాయమవుతుందని సూచించారు. మున్సిపల్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్‌కు చెందిన దాదాపు కోటి 30 లక్షల రూపాయలు మంచినీటి ఎద్దడి నివారణకు ఖర్చు చేసేలా కలెక్టర్ నుంచి అనుమితికి లేఖ రాయాలని సూచించారు. వార్డులో మంచినీటి సమస్య పరిష్కరించడం లేదని వార్డు ప్రజలు తనను తిడుతున్నారని 23వ వార్డు కౌన్సిలర్ స్వరూప సమావేశంలో కంటతడి పెట్టారు. చైర్మన్ కూర్చున్న వేదిక వద్ద కింద కూర్చుని నిరసన తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ హెచ్.సురేష్ మాట్లాడుతూ పనిపై శ్రద్ధ లేనందునే ఎఇ సమావేశానికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 లక్షల రూపాయలతో ఎక్కడెక్కడ ఫ్లషింగ్ చేశారో చెప్పాలని, కేసింగ్ పాడైన చోట ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కౌన్సిలర్ అరుణాబాయి రాఠి మాట్లాడుతూ తన వార్డులో మంచినీటి సమస్య, పారి