S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గోదావరి జలాల ట్రయల్ రన్ విజయవంతం

మేడ్చల్, ఏప్రిల్ 29: మేడ్చల్ పట్టణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన గోదావరి జలాల ట్రయల్ రన్ విజయవంతం అయింది. స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పండితుల ప్రత్యేక పూజల అనంతరం ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మచెరువు (ఏర్ర చెరువు)లో గోదావరి జలాలను ఆయన విడుదల చేశారు. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ పథకం కింద రూ. 160 కోట్లు మంజూరు అయ్యాయని అందుకు సంబంధించిన పనులు కూడా తుది దశలో ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట్, ఘట్‌కేస, కీసరతో పాటు కుత్బుల్లాపూర్ మండలాలకు గోదావరి జలాలను సరఫర చేస్తున్నామని చెప్పారు. సిఎం కెసిఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ కంటే ముందు మేడ్చల్‌కు గోదావరి జలాలు సరఫరా కానున్నాయని తెలిపారు. మే ఒకటవ తేదీన సిఎం కార్యక్రమం ఖరారైతే మేడ్చల్ మజీద్‌పూర్ వద్ద మిషన్ భగీరథ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు. మేడ్చల్ పట్టణానికి పైపులైన్ల ఏర్పాటు కోసం సిఎం కెసిఆర్ చొరవతో ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 45 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. రెండు రోజుల్లో ప్రస్తుతం సరఫరా అవుతున్నా పైపులైన్ ద్వారా పట్టణ ప్రజలను గోదావరి జలాలను సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. మేడ్చల్ ప్రజానీకం గత ఎన్నో సంవత్సరాలుగా తాగునీరు కోసం అల్లాడుతున్నారని వారి చిరకాలం స్వప్నం నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టు వివరించారు. ఇంటింటికీ నల్లా ద్వారా గోదావరి జలాలను అందించే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఖజాన ద్వారానే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలల వ్యవధిలో పట్టణంలో ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్ పనులు పూర్తవుతాయని ఇక ముందు ఏలాంటి విద్యుత్ సమస్యలు ఉండబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కలల ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ఓ ఉద్యమంలా సాగుతుందని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు అక్టోబర్ చవిరకల్లా గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని తెలిపారు. ఘణపూర్ క్షేత్రగిరి గుట్టపై నిర్మించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి మేడ్చల్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. దశల వారీగా మేడ్చల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే నగర పంచాయతీ నూతన కార్యాలయాన్ని కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు. గత పాలకులు మేడ్చల్‌ను ఏలిన వారు అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ధ కనబర్చలేదని ఆరోపించారు. టిఆర్‌ఎస్ సర్కార్ వచ్చాక కలలో కూడా ఉహించని పథకాలతో మేడ్చల్ ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ సొంత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. అందరి సహయ సహకారంతో అభివృద్ధి చేస్తామని బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిర్దేశిత సమయంలో చెప్పిన విధంగానే మిషన్ భగీరథ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి గోదావరి జలాలను సరఫరా చేసినందుకు అధికారులను గుత్తేదార్‌ను ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. ఎమ్మెల్యేను అధికారులను నాయకులు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ జిల్లా ఇఇ నరేందర్‌రెడ్డి, డిప్యుటీ ఇఇ విశ్వనాథ్, నరగ పంచాయతీ కమిషనర్ రామిరెడ్డి, నాయకులు భాస్కర్ యాదవ్, సందీప్, సత్యనారాయణ, మల్లికార్జున్, నందారెడ్డి, మోనార్క్, సాటే నరేందర్, రాఘవేందర్, శివకుమార్, నాగేందర్, మల్లేశ్, ఆజ్మత్‌ఖాన్, మురళీధర్, అశోక్, ఫయాజుద్దీన్, ఘట్‌కేసర్ ఎంపిపి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.