S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘చిత్రపురి’ అవినీతిని రూపుమాపేందుకు బిజెపి నిజ నిర్ధారణ కమిటీ

హైదరాబాద్, ఏప్రిల్ 29: సినిమా కార్మికుల కోసం కేటాయించిన డా. ఎం.ప్రభాకర్‌రెడ్డి చిత్రపురి కాలనీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బట్టబయలు చేసేందుకు భారతీయ జనతాపార్టీ సినిమా సెల్ ఆధ్వర్యంలో ఓ నిజ నిర్దారణ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు శుక్రవారం బర్కత్‌పురాలోని సిటీ బిజెపి ఆఫీసులో గ్రేటర్ బిజెపి అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నేతలు వెల్లడించారు. ఈ కమిటీలో గ్రేటర్ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, సివిఎల్ నరసింహారావులను సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నిజ నిర్దారణ కమిటీ సభ్యులు చిత్రపురి కాలనీని సందర్శించి వివిధ రంగాల సినీ కార్మికులతో మాట్లాడి నిజమైన లబ్ధిదారులు ఎవరన్నది తేల్చనున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తు వివరాలను తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి, అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా చేయనున్నట్లు తెలిపారు. సినీ కార్మికులకు ముఖ్యంగా తెలంగాణ సినీ కార్మికులు ఎక్కువ మొత్తంలో లబ్ది పొందేలా చర్యలు తీసుకోనున్నట్లు వారు వివరించారు. మన తెలంగాణ సినిమా పేరు కూడా వినోద రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుని తన ఉనికిని నిలుపుకోగలదని, ఇదంతా సాధ్యమయ్యేందుకు తెలంగాణలోని ప్రతి ఒక్కరి సహాయాన్ని తాము కోరుతున్నామని వారు పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో సినిమా రంగా అభివృద్ధి కొరకు కేటాయించబడిన అనేక సంస్థలు, వాటికి కేటాయించిన స్థలాలు, నిధులు అనేకం దుర్వినియోగమయ్యాయని వారు ఆరోపించారు. ఈ అవినీతిని బట్టబయలు చేయ్యడానికే బిజెపి సినిమా సెల్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. సమైక్య పాలనలో సినిమా, టీవి, నాట రంగాలకు చెందిన అనేక మంది కార్మికులు వివక్షకు గురయ్యారని, ఆ వివక్షను రూపుమాపి, స్వపరిపాలనలోనైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించుకోవాలన్నారు. అనేక తెలంగాణ వీరుల ఆత్మ బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, నాటి వివక్ష నేటికీ కొనసాగుతుందని, అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైందని కమిటీ సభ్యులు నరసింహారావు వ్యాఖ్యానించారు.