S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆటో టిప్పర్లను దుర్వినియోగం చేయొద్దు!

హైదరాబాద్, ఏప్రిల్ 29: నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు గాను మహానగర పాలక సంస్థ సమకూర్చిన 1772 ఆటో టిప్పర్లను నిర్దేశించిన లక్ష్యానికి మాత్రమే వినియోగించాలని, ఏ మాత్రం దుర్వినియోగం చేసినా, క్రిమినల్ చర్యలు తప్పవని కమిషనర్ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని 24 సర్కిళ్లలో ప్రతి రోజు పోగవుతున్న సుమారు 4వేల మెట్రిక్ టన్నుల చెత్తను వీలైనంత త్వరగా ఇంటింటి నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించాలన్న సంకల్పంతో 1772 స్వచ్ఛ ఆటో టిప్పర్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు తొలి దశగా 2500 ఆటో టిప్పర్లను కొనుగోలు చేయాలని కార్పొరేషన్ భావించినా, తొలి దశగా పంపిణీ చేసిన వెయ్యి ఆటోల విషయంలో అప్పటికే రిక్షాలో చెత్త సేకరిస్తున్న కార్మికులతో గొడవలు తలెత్తటంతో కార్పొరేషన్ వీటి సంఖ్యను 1772కే పరిమితం చేసింది. ఇప్పటి కాలనీలు, బస్తీలు, మురికివాడల్లో రిక్షాల ద్వారా చెత్తను సేకరిస్తున్న కార్మికులకు సైతం ఈ ఆటో టిప్పర్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చి, డ్రైవింగ్ లైసెన్సు కల్గిన రిక్షా కార్మికులను ఇందుకు లబ్దిదారులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
కానీ చాలా ప్రాంతాల్లో స్థానిక అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్, శానిటరీ సూపర్‌వైజర్ల రాజకీయాలు, అవినీతి కారణంగా ప్రాంతాలను రిక్షా, ఆటో కార్మికులకు సక్రమంగా పంచలేకపోయారు. అయితే కార్పొరేషన్ నిర్దేశించిన చెత్తను సేకరించేందుకు తమకు ప్రత్యేకంగా ప్రాంతాలను అప్పగించకపోవటం, మరోవైపేమో చూస్తుండటంతో నెలరోజులు ముగుస్తుండటంతో బ్యాంకు ఇఎంఐ చెల్లించాల్సి రావటంతో లబ్దిదారులు వీటిని ఇతర పనులకు వినియోగిస్తున్నట్లు కమిషనర్ సైతం క్షేత్ర స్థాయి పర్యటనలో గుర్తించారు.
ఇప్పటి వరకు కార్పొరేషన్ పంపిణీ చేసిన మొత్తం 1772 ఆటోటిప్పర్లను గుర్తించాలని, లేని పక్షంలో కన్పించకుండా పోయిన ఆటో టిప్పర్లకు సంబంధించి ఆయా సర్కిళ్ల మెడికల్ ఆఫీసర్లు లబ్దిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని ఆదేవించారు. కమిషనర్ ఆదేశాలతో కదిలిన వివిధ సర్కిళ్లకు చెందిన ఏఎంవోహెచ్‌లు, డిప్యూటీ కమిషనర్లు సర్కిల్ 10బిలోని ఖైరతాబాద్‌లో ఇతర పనులకు వినియోగిస్తున్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని, ప్రధాన కార్యాలయానికి తరలించారు. వీటిని దుర్వినియోగం చేసినందుకు లబ్దిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.