S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేద విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చదిద్దడానికి వేసవి శిబిరాలు

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 29: పేద విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకే వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. చందానగర్ పిజెఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన జిహెచ్‌ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్స్-2016ను శుక్రవారం మేయర్ ప్రారంభించారు.
మేయర్ మాట్లాడుతూ, విద్యార్థులందరికీ అందుబాటులో వుండేలా క్రీడా శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేసి జిహెచ్‌ఎంసి పేరు నిలబెట్టాలని కోచ్‌లు, విద్యార్థులకు ఆయన సూచించారు. చందానగర్ కార్పొరేటర్ బి.నవతారెడ్డి అభ్యర్ధన మేరకు స్టేడియం అభివృద్ధికి రూ.కోటి 35 లక్షలు మంజూరు చేసానని వెల్లడించారు. టెన్నిస్‌కోర్టు, స్కేటింగ్ రింగ్, క్రికెట్ పిచ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణాలు చేపట్టడానికి అంగీకరించారు. తాగునీటి ప్లాంటును ఏర్పాటు చేయిస్తానని అన్నారు. స్విమ్మింగ్‌పూల్ నిర్మాణానికి స్థలం చూపించాలని నవతారెడ్డికి సూచించారు. ఎమ్మెల్యే గాంధీ, నవతారెడ్డి, కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులను ప్రోత్సహించడానికి తమ సహకారం వుంటుందని హామీ ఇచ్చారు. అంతకుముందు మైదానంలో విద్యార్థుల గౌరవ వందనాన్ని మేయర్ స్వీకరించారు. స్థానిక కార్పొరేటర్ ఆర్.నాగేందర్ యాదవ్, కార్పొరేటర్లు వి.జగదీశ్వర్‌గౌడ్, హమీద్‌పటేల్, మేక రమేష్, జానకి రామరాజు, పార్టీ నేతలు విజయ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, వీరేశంగౌడ్, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. ఉపకమిషనర్లు మమత, రవీంద్రకుమార్, నరేందర్, క్రీడా విభాగం ఓఎస్‌డి ప్రేమ్‌రాజ్, ఇన్‌స్పెక్టర్ శ్యాంరాజ్ పాల్గొన్నారు.
యువత స్వయం ఉపాధిని ఎంచుకుని అభివృద్ధి చెందాలి
ఘట్‌కేసర్, ఏప్రిల్ 29: యువత స్వయం ఉపాధిని ఎంచుకుని అన్ని రంగాలలో రాణించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మైసమ్మగుట్ట సమీపంలోని జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన శ్రీ వందన హోటల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి సభ్యుడు మంద సంజీవరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, సన్మార్గాన్ని ఎంచుకుని జీవిత లక్ష్యాన్ని సాదించాలన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేయాలన్నారు.
కోదండరాం మాట్లాడుతూ యువత మహోన్నత లక్ష్యాన్ని ఎంచుకుని సాదించేవరకు పోరాడాలన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వ్యాపారాలపై దృష్టి సారించాలని సూచించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళికను సిద్దం చేసినట్లు, ప్రాంత అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు రానివారు నిరాశపడకుండా వ్యాపారాల వైపు దృష్టి సారించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి సంజీవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గొంగళ్ళ స్వామి, కాళేరు రామోజీ, సింగిరెడ్డి రాంరెడ్డి, హోటల్ నిర్వాహకులు మహిపాల్‌రెడ్డి, రాజేశ్, కిరణ్ తదితరులు ఉన్నారు.