S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ముగిసిన ‘స్వచ్ఛ’ సర్వే

హైదరాబాద్, ఏప్రిల్ 29: స్వచ్ఛ భారత్ అన్న కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించేందుకు చేపట్టిన సర్వే ముగిసింది.
ఇక మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించి వాటిని నిర్మించటమే తదుపరి లక్ష్యం. ఇందుకు గాను మొత్తం రూ. 12 వేల వరకు ఖర్చవుతోందని అంచనా వేసిన అధికారులు జిహెచ్‌ఎంసి తరపున రూ. 8వేలు, మిగిలిన రూ. 4వేలను కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ నిధుల నుంచి అందించనున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ సర్వేను పూర్తి చేయగానే డిప్యూటీ కమీషనర్ల నేతృత్వంలో కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆ తర్వాత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులను రెండు విడతలుగా బ్యాంకు ఖాతాల ద్వారా అందించనున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఇన్ శానిటరీ లెట్రిన్‌లను సెప్టిక్ ట్యాంక్ లెట్రిన్‌లుగా మార్చుకోవడానికి సాముదాయక మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా నిధులు అందజేయనున్నట్లు తెలిపారు.
నగరంలోని ప్రస్తుత 86 సాముదాయక మరుగుదొడ్లు ఉన్నాయని, మరో 48 సులబ్ కాంప్లెక్సులు ఉన్నాయని తెలిపారు. నగరంలో మరో 188 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి అనుమతులకై దరఖాస్తులు వచ్చాయని కమిషనర్ తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్ధిదారులకు ఎంపికలకు కార్పొరేటర్, స్లమ్ లెవెల్ ఫెడరేషన్‌ల సహాయక సహకారాలు పొందాలని సూచించారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి ద్వారా ప్రవేశపెట్టిన మోడరన్ టాయిలెట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ అన్నారు. ఈ వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్ధిదారుల వివరాలు, నిర్మించే మరుగుదొడ్ల వివరాలను జియోట్యాగిన్ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఐదు లక్షల మొక్కలు నాటుతాం
నగరంలో పచ్చదనాన్ని పెంపొందించి, మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు గాను త్వరలో చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ఐదు లక్షల మొక్కలు నాటనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసి ద్వారా ఒకే రోజు ఐదు లక్షల మొక్కలు మాటనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందుకు గాను హైదరాబాద్ నగరంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, జిహెచ్‌ఎంసి లేవుట్ ఓపెస్ ప్లేస్‌లు, ప్రధాన రహదారుల్లో మొక్కలను పెద్ద ఎత్తున నాటనున్నట్లు తెలిపారు. ఈ మొక్కల పెంపకానికి స్థానిక రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు, మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగించాలని కమిషనర్ తెలిపారు.