S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టెట్ నిర్వహణ బాధ్యతగా తీసుకుంటాం

ముషీరాబాద్, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న టెట్ పరీక్షలకు స్కూల్‌లు, కళాశాలలను ఇవ్వబోమని ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు ప్రకటించడాన్ని టిఎన్జీవో తీవ్రంగా ఖండించింది. మే 1న జరుగాల్సిన టెట్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేయటం బాధకరమని పేర్కొంది. శుక్రవారం నాంపల్లిలోని టిఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ ఎన్జీవో సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అనాలోచిత నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణలోని పది జిల్లాల ఎన్జీవోలు అంతా ప్రభుత్వానికి బాసటగా నిలుస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అన్ని స్థాయిలలో పని చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. టెట్ పరీక్షల నిర్వహణను బాధ్యత తీసుకుని విజయవంతం చేస్తామని, సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను కలిసి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.