S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యథేచ్ఛగా గుప్తనిధుల తవ్వకాలు

నల్లబెల్లి, ఎఫ్రిల్ 29: కాకతీయుల నాటి పురాతన ఆలయాలను కోందరు గుర్తుతెలియని దుండగులు కాకతీయ రాజుల కళా పదను విధ్వంసం చేస్తున్నా పోలీసు అధికారులు పటించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి గ్రామ సమీపంలో గల ఊరచెరువు చివర కాకతీయుల నాటి శివాలయంలో గుప్తనిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఆధునాతన మిషన్‌లతో తవ్వకాలు చేపట్టిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. లెంకాలపల్లి సర్పంచ్ చేరాలు, నల్లబెల్లి ట్రైని ఎస్సైతోపాటు గ్రామస్తులు శివాలయాన్ని సందర్శించి గుప్త నిధులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. గత 50 ఏళ్ళక్రితం శివాలయం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ శివాలయంనే పీరలమ్మ దేవాలయంగా పిలుస్తు ముస్లీంలు పీరమ్మల పండుగను జరుపుకొనే వారని వివరించారు. శివాలయంలో గుప్తనిధులు ఉన్నట్లు భావించిన కోందరు గుర్తు తెలియని వ్యక్తులు జెసిపి యంత్రం సహాయంతో పూజలు ని నిర్వహించి తవ్వకాలను జరిపినట్లు ఆనవాలు ఉన్నయని తెలిపారు. గత కొంతకాలంగా మండలంలోని శివాలయాలపై దుండగులు కనే్నసి యంత్రాలతో శివాలయాలను శిథిలం చేస్తూనే ఉన్నా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నల్లబెల్లి మండలంలోని శనిగరం, కన్నారావుపేట, కొండాపురం, రాంతీర్ధం, గుండ్లహాపాడ్, నారక్కపేటలోని లింగాలగడ్డలో పలు దేవలాయాల్లో జెసిబి మిషన్ సహాయంతో విధ్వంసం చేస్తూ గుప్తనిధులను తీస్తున్నా స్థానిక పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప దుండగులను పట్టుకున్న పాపన పోలేదని పలువురు విమర్శిస్తున్నారు. పోలీసులు దుండగులను పట్టుకొని ఉంటే శివాలయాలు విధ్వంసానికి గురి అయ్యేవి కావని పలువురు వాపోయారు. గుప్తనిధుల తవ్వకాలపై విచారణ జరిపి దోషులను గుర్తించి శిక్షించాలని పలువురు కోరారు.