S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆదర్శ్ భవనం కూల్చేయండి

ముంబయి, ఏప్రిల్ 29: మహారాష్టల్రోని ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో శుక్రవారం బాంబే హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. 31 అంతస్తుల భవనాన్ని కూల్చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను న్యాయస్థానం ఆదేశించింది. దక్షిణ ముంబయిలోని కొలాబా ప్రాంతంలో కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికుల కోసం ఆదర్శ హౌసింగ్ సొసైటీలో ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. తరువాత దాన్ని 31 అంతస్తుల భవనం నిర్మించి రాజకీయంగా పలుకుబడిన వారి కుటుంబ సభ్యులకు ఫ్లాట్లు కేటాయించారు. సొసైటీలో జరిగిన భారీ కుంభకోణంపై విచారించిన బాంబే హైకోర్టు 31 అంతస్తుల భవనాన్ని కూల్చివేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖను ఆదేశించింది. బహుళ అంతస్తు భవన నిర్మాణాన్ని నిర్మించినా ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆదర్శ్ సొసైటీ అభ్యర్థన మేరకు ఆదేశాల అమలుపై డివిజన్ బెంచ్ 12 వారాలు స్టే ఇచ్చింది. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీల్ చేసుకోనున్నారు. కాగా భవన నిర్మాణం విషయంలో చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవల్సిందిగా జస్టిస్ ఆర్‌వి మోరే, జస్టిస్ ఆర్‌జి కేట్కర్‌తో కూడిన ధర్మాసరం ఆదేశించింది. భవనం కూల్చివేతకయ్యే ఖర్చును సొసైటీనే భరించాలని కూడా బెంచ్ సూచించింది. ప్రతివాదులైన ఆరుగురు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ డైరెక్టర్ భరత్ భూషణ్, అడ్వయిజర్ నళినీ భట్, బాంబే మున్సిపల్ కార్పొరేషన్(బిఎంసి) మాజీ కమిషనర్ సీతారాం కుంటేతోపాటు ముగ్గురికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆదర్శ సొసైటీయే చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.