S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రెండేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ తరహాలో అభివృద్ధి

మహబూబ్‌నగర్, మే 13: రెండేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిని కార్పోరేట్ ఆసుపత్రుల తరహాలో మారుస్తూ పేద ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్, మద్దూర్ మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మద్దూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ స్కాన్‌తో పాటు క్యాన్సర్ వ్యాధికి సంబందించిన వైద్యసేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందన్నారు. ఆధునీక వైద్య పరీక్షలు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలంగాణలోని సర్కార్ దవాఖానలన్నింటిని బలోపేతం చేసి పేదలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్పోరేట్ ఆసుపత్రుల తరహాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు అందినప్పుడే ప్రభుత్వ ఆసుపత్రులకు మంచిపేరు వస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని వైద్యశాఖలో ఖాళీల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రుల స్థాయిని పెంచుతున్నామని ఇప్పటికే రాష్ట్రంలో వివిధ జిల్లాలోని ఆసుపత్రులను ఆధునీకరించి 200 పడకల ఆసుపత్రులుగా మార్చామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు అయ్యినందున మరిన్ని వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని బోధన ఆసుపత్రుల దగ్గర ఆధునికమైన పరికరాలతో వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.